
Washington Sundar : భారత క్రికెట్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్, లార్డ్స్ టెస్ట్ మ్యాచ్ ఐదో రోజు గురించి ధీమాగా మాట్లాడాడు. ఈ మ్యాచ్‌లో భారత్ లంచ్ తర్వాత విజయం సాధిస్తుందని చెప్పాడు. ప్రస్తుతం భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ చివరి రోజు ఆట నేడు ప్రారంభం కానుంది. అయితే, భారత్‌తో పాటు ఇంగ్లాండ్‌కు కూడా గెలిచే అవకాశం ఉంది. లార్డ్స్ టెస్ట్ నాలుగో రోజు ఆట ముగిసిన తర్వాత వాషింగ్టన్ సుందర్ స్కై స్పోర్ట్స్ క్రికెట్ తో మాట్లాడాడు. ఈ సమయంలో అతనితో పాటు కుమార్ సంగక్కర, నాసిర్ హుస్సేన్ కూడా ఉన్నారు. మ్యాచ్ గురించి అడిగినప్పుడు సుందర్ మాట్లాడుతూ.. ఖచ్చితంగా రేపు మేమే గెలుస్తామని అన్నాడు. దీనికి హాస్యంగా, “మీరు ఎప్పుడు గెలుస్తారో చెప్పండి, అప్పుడు మేం మా క్యాబ్‌ను బుక్ చేసుకుంటాం” అని అడిగారు.
దానికి సుందర్.. ఖచ్చితంగా మేమే గెలుస్తాం. బహుశా లంచ్ తర్వాత విజయం సాధిస్తం. ఈరోజు ఒక వికెట్‌కు స్టంప్స్ అయితే బాగుండేది. కానీ మా ఫాస్ట్ బౌలర్లు చూపించిన ప్రెజర్ అద్బుతం. ఉదయం హార్డ్ బాల్‌తో సీమ్ ఉంటుందని మేం ఆశించాం. సిరాజ్ బౌలింగ్ చేసిన తీరు, ఆకాష్ దీప్ హ్యారీ బ్రూక్ వికెట్ తీసిన విధానం చాలా బాగుంది” అని చెప్పాడు.
రెండో ఇన్నింగ్స్‌లో సుందర్ 4 కీలక వికెట్లు తీసి అదరగొట్టాడు. అతను జో రూట్, బెన్ స్టోక్స్, జామీ స్మిత్, షోయబ్ బషీర్ లను అవుట్ చేశాడు. మొదటి ఇన్నింగ్స్‌లో అతనికి ఒక్క వికెట్ కూడా దొరకలేదు. ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 192 పరుగులకే ఆలౌట్ అయింది. భారత్‌కు గెలవాలంటే 193 పరుగుల టార్గెట్ ఛేజ్ చేయాలి.
"Defninitely India winning tomorrow!" 😁
Washington Sundar reflects day four for India at Lord's 🇮🇳 pic.twitter.com/ha7iCscMMh
— Sky Sports Cricket (@SkyCricket) July 13, 2025
నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. కానీ, యశస్వి జైస్వాల్ సున్నా పరుగులకే, కరుణ్ నాయర్ 14 పరుగులకే, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 6 పరుగులకే వెంటవెంటనే అవుట్ అయ్యారు. ఆకాష్ దీప్ 1 పరుగు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. భారత్ ప్రస్తుతం 58 పరుగులకు 4 వికెట్లు కోల్పోయి, గెలుపు కోసం ఇంకా 135 పరుగులు చేయాలి, చేతిలో 6 వికెట్లు మాత్రమే ఉన్నాయి.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..