WTC Final 2021: భారత్, న్యూజిలాండ్ మధ్య శుక్రవారం నుంచి ప్రారంభంకానున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో.. టీమిండియాని ఉత్సాహపరిచేందుకు ‘భారత ఆర్మీ’ రెడీ అయింది. సౌథాంప్టన్ వేదికగా రేపు మధ్యాహ్నం మ్యాచ్ మొదలవనుంది. ఈమేరకు స్టేడియంలోకి సుమారు 4,000 మందిని ఈసీబీ అనుమతించనుంది. ఈమేరకు భారత ఆర్మీ ఓ వీడియో ను విడుదల చేసింది. మ్యాచ్ ను ప్రత్యక్షంగా చూసేందుకు, టీమిండియా ఆటగాళ్లను ఉత్సాహపరిచేందుకు స్టేడియంలోకి వెళ్లనున్నట్లు భారత ఆర్మీ సభ్యులు పేర్కొన్నారు. అయితే ఫైనల్ మ్యాచ్‌కి వర్షం అడ్డంకిగా మారనున్నట్లు తెలుస్తోంది. సౌథాంప్టన్‌లో వర్షం కురిసే సూచనలున్నాయి. కాగా, పిచ్ పేసర్లకి అనుకూలమనే వార్తల నేపథ్యంలో టీమిండియా ముగ్గురు పేసర్లు, ఒక స్పిన్నర్‌తో బరిలోకి దిగనుందని తెలుస్తోంది.
డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం టీమిండియా ఆటగాళ్లు ఈ నెల 3న సౌథాంప్టన్‌కి చేరుకున్నారు. అనంతరం రెండు టీంలుగా విడిపోయి ప్రాక్టీస్ మ్యాచ్ ఆడారు. ఈ మ్యాచ్‌లో యువ బ్యాట్స్ మెన్ రిషబ్ పంత్ శతకం నమోదు చేశాడు. శుభమన్ గిల్, రవీంద్ర జడేజా అర్థ సెంచరీలతో చెలరేగారు. ఇక బౌలింగ్‌లో ఇషాంత్ శర్మ 3 వికెట్లు తీశాడు. మరోవైపు ఇంగ్లాండ్‌తో జరిగిన రెండు టెస్టులు సిరీస్ ను కివీస్ 1-0తో గెలుచుకుంది.
Watch the Bharat Army getting ready to cheer for India at the #WTC21 Final ??️ pic.twitter.com/jiq5YlRBOY
— ICC (@ICC) June 16, 2021
Also Read:
WTC Finals: డబ్ల్యూటీసీ ఫైనల్స్‌లో టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే.. జట్టులో ఇద్దరు స్పిన్నర్లు.!