IND vs ENG: వైజాగ్ మ్యాచ్‌లో ఓటమి.. సిరీస్‌ మధ్యలోనే అబుదాబికి ఇంగ్లండ్‌ టీమ్‌.. కారణమిదే

అంతకుముందు సిరీస్‌ ప్రారంభానికి ముందే అబుదాబిలో పర్యటించింది ఇంగ్లండ్‌ టీమ్‌. అక్కడ శిక్షణా శిబిరాన్ని ముగించుకుని మొదటి టెస్టుకు మూడు రోజుల ముందు భారత్‌కు చేరుకుంది. ఇప్పుడు మళ్లీ అబుదాబి వెళ్లిన ఇంగ్లండ్ అక్కడ షార్ట్ క్యాంప్ నిర్వహించనున్నట్లు తెలిసింది.

IND vs ENG: వైజాగ్ మ్యాచ్‌లో  ఓటమి.. సిరీస్‌ మధ్యలోనే అబుదాబికి ఇంగ్లండ్‌ టీమ్‌.. కారణమిదే
England Cricket Team
Image Credit source: twitter

Updated on: Feb 06, 2024 | 4:55 PM

భారత్‌తో జరిగిన 2వ టెస్టు మ్యాచ్ ఓటమి అనంతరం ఇంగ్లండ్ జట్టు అబుదాబికి బయలుదేరింది. టీమిండియాతో మూడో టెస్టు మ్యాచ్ ప్రారంభానికి ఇంకా సుమారు 10 రోజుల సమయం ఉంది. దీంతో ఇంగ్లండ్ జట్టు అబుదాబిలో గడపాలని నిర్ణయించుకుంది. అంతకుముందు సిరీస్‌ ప్రారంభానికి ముందే అబుదాబిలో పర్యటించింది ఇంగ్లండ్‌ టీమ్‌. అక్కడ శిక్షణా శిబిరాన్ని ముగించుకుని మొదటి టెస్టుకు మూడు రోజుల ముందు భారత్‌కు చేరుకుంది. ఇప్పుడు మళ్లీ అబుదాబి వెళ్లిన ఇంగ్లండ్ అక్కడ షార్ట్ క్యాంప్ నిర్వహించనున్నట్లు తెలిసింది. మూడో టెస్టు మ్యాచ్‌కు రెండు మూడు రోజుల ముందు భారత్‌కు తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఫిబ్రవరి 15 నుంచి భారత్, ఇంగ్లండ్ మధ్య మూడో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ మైదానంలో జరగనున్న ఈ మ్యాచ్ ఇరు జట్లకు ఎంతో కీలకం. సిరీస్ ఇప్పటికే 1-1తో సమంగా ఉన్నందున, తదుపరి మ్యాచ్‌లో గెలిచిన జట్టు సిరీస్‌లో ముందంజ వేయనుంది.

హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ 28 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అలాగే విశాఖపట్నం వేదికగా జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో భారత జట్టు 106 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఇక మూడో మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారనేది ఆసక్తిగా మారింది. ఇంగ్లండ్ సీనియర్ స్పిన్నర్ జాక్ లీచ్ మూడో టెస్టు మ్యాచ్ ద్వారా పునరాగమనం చేసే అవకాశం ఉంది. తొలి టెస్టు మ్యాచ్‌లో గాయపడిన లీచ్‌ రెండో మ్యాచ్‌లో ఆడలేదు. ఇక గాయం కారణంగా రెండో టెస్టుకు దూరమైన కేఎల్ రాహుల్ మూడో మ్యాచ్‌లో ఆడే అవకాశం ఉంది. అలాగే తొలి రెండు మ్యాచుల్లో ఆడని టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ కూడా పునరాగమనం చేసే అవకాశం ఉంది. తద్వారా మూడో మ్యాచ్‌లోనూ ఉత్కంఠభరితమైన పోటీని ఆశించవచ్చు.

ఇవి కూడా చదవండి

అబుదాబిలో ప్రత్యేక శిక్షణా శిబిరం..

 

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us