Helicopter Shot: ధోనీ కంటే ముందే హెలికాప్టర్ షాట్​ ఆడిన భార‌త ప్లేయ‌ర్.. ఇంట‌ర్నెట్ లో వీడియో వైర‌ల్

|

May 16, 2021 | 2:31 PM

హెలికాప్టర్ షాట్.. క్రికెట్ చ‌రిత్ర‌లో ఈ షాట్ కు సెప‌రేట్ ట్రేడ్ మార్క్ ఉంది. భార‌త మాజీ ధోనినే ఈ షాట్ క‌నిపెట్టిన‌ట్లు చాలామంది చెబుతారు.

Helicopter Shot:  ధోనీ కంటే ముందే హెలికాప్టర్ షాట్​ ఆడిన భార‌త ప్లేయ‌ర్.. ఇంట‌ర్నెట్ లో వీడియో వైర‌ల్
Helicopter Shot
Follow us on

హెలికాప్టర్ షాట్.. క్రికెట్ చ‌రిత్ర‌లో ఈ షాట్ కు సెప‌రేట్ ట్రేడ్ మార్క్ ఉంది. భార‌త మాజీ ధోనినే ఈ షాట్ క‌నిపెట్టిన‌ట్లు చాలామంది చెబుతారు. దాన్ని వ్య‌తిరేకించే వాళ్లు సైతం ఉన్నారు. నిజంగా క్రికెట్​లో ఫుల్ లెంగ్త్​ ​బాల్​, యార్కర్​ను ఎదుర్కోవ‌డం బ్యాట్స్​మన్​కు క‌ష్ట‌మైన విష‌యం. ఆ బంతిని జాగ్ర‌త్త‌గా డిఫెన్స్ చేస్తేనే బాగా ఆడాడు అంటారు. అలాంటిది బ్యాట్స్​మన్​ తమదైన శైలిలో బంతిని స్టాండ్స్ లోకి పంపిస్తే.. అదుర్స్ అనాల్సిందే. ధోనీ హెలికాప్టర్ షాట్స్ ఆడ‌టంలో నిష్ణాతుడు. అయితే దీనిని మహి కంటే ముందే మరో ప్లేయ‌ర్ ఆడి చూపించాడు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ స‌ర్కులేట్ అవుతుంది.

భారత మాజీ సారథి మహమ్మద్ అజారుద్దీన్​ ఈ హెలికాప్టర్​ షాట్​ను గతంలోనే ఆడాడు. 1996లో కోల్​కతా వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్​ మ్యాచ్​లో అజారుద్దీన్​ కేవలం 77 బంతుల్లోనే 109 రన్స్ చేశాడు. ఇందులో 18 ఫోర్లు, ఒక సిక్స్​ ఉన్నాయి. సౌతాఫ్రికా ఆల్​రౌండర్ క్లూసెనర్​ వేసిన ఓ ఓవర్లో అజారుద్దీన్​ ఏకంగా 5 ఫోర్లు కొట్టి దుమ్మురేపాడు. మొద‌టి రెండు బంతులకు బౌండరీలు కొట్టడం వల్ల తదుపరి బంతిని యార్కర్​గా వేశాడు ప్రోటీస్ బౌలర్. ఆ బంతిని హెలికాప్టర్​ షాట్​ ఆడాడు అజారుద్దీన్​.

అందుకు సంబంధించిన వీడియోను మీరు దిగువ‌న చూడొచ్చు…