Ruturaj Gaikwad: ఆ టెస్ట్ సిరీస్‌లో ఓపెనర్‌గా రుతురాజ్?
అంతర్జాతీయ క్రికెట్‌లో అదరగొడుతున్న యంగ్ ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్‌కు బంగ్లాతో జరిగే టీ20లో భారత్ టీమ్ చోటు దక్కలేదు. దీంతో నెటింట్లో ఈ యువ బ్యాటర్‌కి మద్ధతుగా క్రికెట్ అభిమానులు బీసీసీఐని ప్రశ్నించారు. దీంతో త్వరలో ఈ యువ బ్యాటర్‌ని మరో అవకాశం ఇవ్వాలనే యోచనలో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తుంది.
వరుస విజయాలతో ఊపుమీదున్నా భారత్.. అక్టోబర్ 6 నుంచి బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ ఆడనుంది. ఆ తర్వాత నవంబర్‌లో ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్‌లు వాళ్ల దేశంలోనే భారత్ ఆడనుంది. అంతర్జాతీయ క్రికెట్‌లో అదరగొడుతున్న యంగ్ ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్‌కు బంగ్లాతో జరిగే టీ20 సిరీస్‌లో భారత్ టీమ్‌లో చోటు దక్కలేదు. దీంతో నెటింట్లో ఈ యువ బ్యాటర్‌కి మద్ధతుగా క్రికెట్ అభిమానులు బీసీసీఐని ప్రశ్నించారు. సెలక్షన్ కమిటీ రుతురాజ్‌ను టీమ్‌లోకి ఎందుకు తీసుకోలేదని, తను అంతర్జాతీయ క్రికెట్‌లో అదరగొడుతున్న ఎందుకు అవకాశం ఇవ్వాలని తీవ్రంగా విరుచుకపడ్డారు. దీంతో టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఈ యువ బ్యాటర్‌కు అవకాశం ఇవ్వాలనే యోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. నవంబర్‌లో జరిగే ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్‌లో 3వ ఓపెనర్‌గా రుతురాజ్‌ను తేవాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఈ విషయంలో ఎంత నిజం ఉందో తెలీదు గానీ రుతురాజ్‌కు టెస్ట్ మ్యాచ్‌లో ఛాన్స్ ఇవ్వాలని చూస్తున్నట్లు సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది.
బంగ్లాదేశ్ టీ 20 సిరీస్‌కి యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్‌లకు కూడా రెస్ట్ ఇచ్చినప్పటికి రుతురాజ్‌ని ఎంపిక చేయకపోవడం పట్ల క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ నెల న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరగనున్న టెస్ట్ మ్యాచులకు రుతురాజ్‌కి అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. 2024 ఐపీఎల్ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) కెప్టెన్‌గా రుతురాజ్ వ్యవహరించాడు. సౌత్ ఆఫ్రీకా, విండీస్‌లతో టెస్ట్ మ్యాచ్‌లో రుతురాజ్‌కు అవకాశం వచ్చినా దాన్ని అతను అందిపుచ్చుకోలేదనే చెప్పాలి.
ఇదిలా ఉంటే నేడు కాన్పూర్‌లో బంగ్లాతో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. మొదట అందరూ ఈ మ్యాచ్ డ్రా అవుతుందని భావించారు. కానీ టీమిండియా ఈ మ్యాచ్‌ను ఛాలెంజింగ్‌గా తీసుకొని మరి విజయం సాధించింది. మ్యాచ్ ప్రారంభమైనప్పటి నుంచి ఆటకు వర్షం ఆటంకం కలిగించడంతో క్రికెట్ అభిమానులు నిరాశపడ్డారు. అభిమానులకు కిక్కించేలా టీమిండియా ఆటగాళ్లు రసవత్తరంగా ఆడారు. ముఖ్యంగా భారత బ్యాటర్స్ అదరగొట్టారనే చెప్పాలి.