పాత్రికేయుడు బోరియా మజుందార్‌పై రెండేళ్ల నిషేధం విధించేందుకు బీసీసీఐ సన్నాహాలు చేస్తోంది. వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ వృద్ధిమాన్ సాహాను ఇంటర్వ్యూ పేరుతో బెదిరించినట్లు మజుందార్‌పై ఆరోపణలు వచ్చాయి. సాహా ఎపిసోడ్‌కు ఎట్టకేలకు ఫైనల్ తీర్పు రానున్నట్లు తెలుస్తోంది. ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో ప్రకారం- బోరియాను ఏ స్టేడియంలోకి ప్రవేశించడానికి అనుమతించకూడదని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్ర యూనిట్‌లకు తెలియజేయబోతున్నట్లు తెలుస్తోంది. దేశవాళీ మ్యాచ్‌లలో కూడా బోరియాకు మీడియా అక్రిడిటేషన్ ఇవ్వరు. మీడియా అక్రెడిటేషన్ పొందకపోవడం అంటే మజుందార్ ఇకపై టీమ్ ఇండియాకు సంబంధించిన విలేకరుల సమావేశానికి హాజరు కాలేరు. ఇది కాకుండా, బోరియా మజుందార్‌తో ఎలాంటి సంభాషణలు జరపవద్దని భారతీయ ఆటగాళ్లందరూ ప్రత్యేకంగా కోరతారు. ఇది కాకుండా, బోర్డు బోరియాపై ఐసీసీకి కూడా ఫిర్యాదు చేస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఐసీసీ టోర్నమెంట్లలోనూ నిషేధించమని కోరుతున్నట్లు తెలుస్తోంది.
సోషల్ మీడియా ద్వారా ఈ విషయం వెలుగులోకి రావడంతో, BCCI వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా, కోశాధికారి అరుణ్ ధుమాల్, అపెక్స్ కౌన్సిల్ సభ్యుడు ప్రభతేజ్ భాటియాతో ముగ్గురు సభ్యుల విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ నివేదికతోనే బీసీసీఐ తన తుది నిర్ణయాన్ని త్వరలో వెల్లడించనున్నట్లు తెలుస్తోంది.
Also Read: IPL 2022: లక్నో సారథితో ముంబైకు అట్లుంటది మరి.. ఆ రికార్డులో తొలి బ్యాట్స్‌మెన్‌గా కేఎల్ రాహుల్..
LSG vs MI Score: మెరుపు ఇన్నింగ్స్‌తో రాణించిన రాహుల్.. ముంబై టార్గెట్ 169 పరుగులు..