WTC Final 2023: WTC ఫైనల్‌కు టీమిండియా స్వ్కాడ్.. అయోమయంలో బీసీసీఐ.. ఎందుకంటే?

|

Apr 19, 2023 | 7:22 PM

IND vs AUS, WTC Final 2023: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ జూన్ 7 నుంచి ఓవల్‌లో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతుంది. అయితే టీమ్ ఇండియాను ఎంపిక చేయడం BCCIకి అంత సులభం కాదు.

WTC Final 2023:  WTC ఫైనల్‌కు టీమిండియా స్వ్కాడ్.. అయోమయంలో బీసీసీఐ.. ఎందుకంటే?
Wtc Final 2023 Ind Vs Aus
Follow us on

Indian Cricket Team For WTC Final 2023: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌కు టీమ్ ఇండియాను త్వరలో ఎంపిక చేయనున్నారు. జూన్ 7 నుంచి ఓవల్‌లో భారత్, ఆస్ట్రేలియా మధ్య వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అయితే టీమ్ ఇండియాను ఎంపిక చేయడం బీసీసీఐకి అంత సులువు కావడం లేదు. ఎందుకంటే చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ ఇటీవల రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. చేతన్ శర్మ రాజీనామా చేయడంతో బీసీసీఐ సెలక్షన్ కమిటీ తాత్కాలిక చైర్మన్‌గా శివ సుందర్ దాస్‌ను నియమించింది. ఆయనకు సహాయం చేయడానికి 5 మంది సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేశారు.

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు జట్టును ఎప్పుడు ప్రకటిస్తారంటే..

మే 7న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు బీసీసీఐ జట్టును ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు ఇప్పటికే ఆస్ట్రేలియా తన జట్టును ప్రకటించింది. ఈ క్రమంలో ఇక అందరి చూపు బీసీసీఐ వైపు నిలిచాయి. భారత జట్టను ప్రకటించిన తర్వాత.. ఏమైనా మార్పులు చేయాలనుకుంటే, మే 22 చివరి తేదీగా నిలిచింది. ఇటువంటి పరిస్థితిలో తాత్కాలిక సెలెక్టర్ సేవలను అందిపుచ్చుకోవడంలో బీసీసీఐ ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తోంది. చేతన్ శర్మ భర్తీని ఆసియా కప్ 2023 నాటికి ప్రకటించవచ్చని నివేదికలు వినిపిస్తున్నాయి. అయితే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు జట్టును ముందుగా ఎంపిక చేయాల్సి ఉండడంతో.. ఆసక్తి నెలకొంది.

సెలక్షన్ కమిటీకి తాత్కాలిక చైర్మన్‌గాశివ సుందర్ దాస్..

ప్రపంచ కప్ 2021 నుంచి  BCCI నిరంతరం 4 సెలెక్టర్లతోనే భారత జట్టును ఎంపిక చేస్తోంది. అయితే, ఈ ఏడాది ప్రారంభంలో చేతన్ శర్మ రెండోసారి చీఫ్ సెలెక్టర్ అయినప్పుడు, మొత్తం 5 మంది సెలెక్టర్లు ఉన్నారు. కానీ, ఇది ఎక్కువ కాలం కొనసాగలేదు. ఇప్పుడు చేతన్ శర్మ తన పదవికి రాజీనామా చేయడంతో మరోసారి ఈ కమిటీలో నలుగురు సభ్యులు మాత్రమే మిగిలారు. ఈ క్రమంలో కొత్త సెలక్షన్ కమిటీ కోసం దరఖాస్తులను బీసీసీఐ కోరవచ్చని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..