IPL 2024: పార్లమెంట్ ఎన్నికల ఎఫెక్ట్‌.. ఐపీఎల్‌ ప్రారంభమయ్యేది అప్పుడే.. కీలక అప్డేట్ ఇచ్చిన జైషా

ఇండియన్ ప్రీమియర్ లీగ్- 2024 సీజన్‌ ఎప్పుడు ప్రారంభమవుతుందా? అని క్రికెట్‌ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే వచ్చే ఏడాది పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌ మన దేశంలోనే జరుగుతుందా? లేదా విదేశాలకు తరలిపోతుందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఐపీఎల్ నిర్వహణపై బీసీసీఐ సెక్రటరీ జే షా కీలక అప్డేట్‌ ఇచ్చారు. ఈసారి ఐపీఎల్

IPL 2024: పార్లమెంట్ ఎన్నికల ఎఫెక్ట్‌.. ఐపీఎల్‌ ప్రారంభమయ్యేది అప్పుడే.. కీలక అప్డేట్ ఇచ్చిన జైషా
BCCI secretary Jay Shah

Updated on: Dec 10, 2023 | 7:34 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్- 2024 సీజన్‌ ఎప్పుడు ప్రారంభమవుతుందా? అని క్రికెట్‌ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే వచ్చే ఏడాది పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌ మన దేశంలోనే జరుగుతుందా? లేదా విదేశాలకు తరలిపోతుందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఐపీఎల్ నిర్వహణపై బీసీసీఐ సెక్రటరీ జే షా కీలక అప్డేట్‌ ఇచ్చారు. ఈసారి ఐపీఎల్ మార్చి నెలాఖరులో ప్రారంభం కానుందని ఆయన స్పష్టం చేశారు. ఐపీఎల్ సీజన్ 17 మార్చి చివరిలో ప్రారంభమై మే నెలాఖరు లేదా జూన్ మొదటి వారంలోగా పూర్తవుతుందని జై షా ధృవీకరించారు. అయితే డేట్ ఇంకా ఫిక్స్ కాలేదు. వచ్చే లోక్‌సభ ఎన్నికలే ఇందుకు ప్రధాన కారణం. ఎన్నికల తేదీని ఎన్నికల సంఘం ప్రకటించిన తర్వాతే ఐపీఎల్ షెడ్యూల్ సిద్ధమవుతుంది. దీంతో ఐపీఎల్ గవర్నర్ కౌన్సిల్ ఎన్నికల ప్రకటన కోసం ఎదురుచూస్తోంది. ఈసారి ఐపీఎల్ వేలం ప్రక్రియ డిసెంబర్ 19న జరగనుంది. దుబాయ్‌లో జరగనున్న ఈ మినీ వేలం కోసం మొత్తం 1166 మంది ఆటగాళ్లు రిజిస్టర్ చేసుకున్నారు.

అయితే ప్రస్తుతం 10 జట్లలో ఖాళీల సంఖ్య 77 మాత్రమే. అంటే 77 మంది ఆటగాళ్లకు మాత్రమే ఈసారి ఈసారి ఐపీఎల్‌లో చోటు దక్కనుంది. అయితే ఇక్కడ ప్రతి జట్టు పర్స్ మొత్తాన్ని బట్టి ఆటగాళ్లకు అవకాశం లభిస్తుంది. అంటే, ఐపీఎల్ నిబంధనల ప్రకారం, ఒక జట్టులో కనీసం 18 మంది, గరిష్టంగా 25 మంది ఆటగాళ్లను తీసుకోవచ్చు. ఈ ఏడాది ఐపీఎల్ వేలం ప్రక్రియ డిసెంబర్ 19న జరగనుంది. దుబాయ్‌లో జరగనున్న ఈ మినీ వేలం కోసం మొత్తం 1166 మంది ఆటగాళ్లు రిజిస్టర్ చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

జూన్ మొదటి వారంలో ముగింపు..

దక్షిణా ఫ్రికా వర్సెస్ భారత్ సిరీస్.. క్రికెటర్ల ఫొటోషూట్

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..