BCCI: బీసీసీఐ కొత్త సెలక్షన్ కమిటీ కోసం సచిన్, ధోనీ, సేహ్వాగ్ అప్లై.. కట్ చేస్తే ఊహించని ట్విస్ట్..

|

Dec 23, 2022 | 6:06 AM

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కొత్త సెలక్షన్ కమిటీ నియామకం కోసం ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగానే బోర్డు గత నెలలోనే దరఖాస్తులను ఆహ్వానించింది.

BCCI: బీసీసీఐ కొత్త సెలక్షన్ కమిటీ కోసం సచిన్, ధోనీ, సేహ్వాగ్ అప్లై.. కట్ చేస్తే ఊహించని ట్విస్ట్..
Bcci
Follow us on

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కొత్త సెలక్షన్ కమిటీ నియామకం కోసం ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగానే బోర్డు గత నెలలోనే దరఖాస్తులను ఆహ్వానించింది. టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు పేలవ ప్రదర్శన అనంతరం.. చేతన్ శర్మ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీని తొలగించాలని బీసీసీఐ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఆ నిర్ణయం తీసుకుని నెల రోజులు దాటినా ఇంకా ఎలాంటి ముందడుగు పడలేదు. అయితే, సెలక్షన్ కమిటీలో చోటు కోసం బీసీసీఐకి వందల సంఖ్యలో దరఖాస్తులు అందాయి. అయితే, ఇక్కడ విచిత్రం ఏంటంటే.. ఈ దరఖాస్తుదారుల్లో టీమిండియా లెంజెడ్స్ సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీ, వీరేంద్ర సెహ్వాగ్ వంటి సీనియర్ల పేర్లు కూడా ఉన్నాయి. ఇదే ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

ఈ విషయం తెలిసిన ఎవరైనా.. భారత క్రికెట్ చరిత్రలో లెజెండ్స్‌గా పేరుగాంచి వీరు నిజంగానే సెలక్షన్ కమిటీకి అప్లై చేసుకున్నారా? అని ఆశ్చర్యపోకుండా ఉండలేరు. మరి అనుభవజ్ఞులైన వీరిని సెలక్టర్లుగా నియమించడానికి బీసీసీఐ ఇంత సమయం ఎందుకు తీసుకుంటోంది? అనే ప్రశ్న తప్పనిసరిగా వస్తుంది. అయితే, ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. టీమిండియా సెలెక్టర్లుగా సచిన్, ధోనీ, సేహ్వాగ్‌తో పాటు.. పాకిస్తాన్ క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ కూడా అప్లై చేసుకున్నాడట. దాంతో అనుమానం కలిగి కూపీ లాగితే అసలు మ్యాటర్ బయటపడింది.

BCCI ఐదుగురు సభ్యుల సెలక్షన్ కమిటీ కోసం 600 కంటే ఎక్కువ ఇమెయిల్ దరఖాస్తులు వచ్చాయి. సచిన్, సేహ్వాగ్, ధోనీ వంటి వారి దరఖాస్తులు కూడా వచ్చాయి. వీరే కాదు.. పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్-ఉల్-హక్ దరఖాస్తు కూడా వచ్చింది. అయితే, బీసీసీఐ అధికారులు సెలక్షన్ కమిటీ అభ్యర్థుల బయో-డేటాను చెక్ చేయడానికి మెయిల్ బాక్స్ ఓపెన్ చేయగా.. సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోనీ, వీరేంద్ర సెహ్వాగ్ పేర్లతో దరఖాస్తు చేయడం చూసి వారు ఆశ్చర్యపోయారు. అయితే, ఈ అప్లికేషన్స్‌ని కొందరు ఫేక్ ఈమెయిల్ ఐడీతో చేసినట్లు గుర్తించారు అధికారులు.

ఇవి కూడా చదవండి

10 పేర్లతో షార్ట్ లిస్ట్..

సెలక్షన్ కమిటీ అంశం భారత క్రికెట్‌లో చాలా చర్చనీయాంశమైంది. ముఖ్యంగా కొత్త సెలెక్టర్ల నియామకంలో జాప్యం.. అనేక సందేహాలకు కారణం అవుతోంది. కాగా, ఇందుకోసం ఏర్పడిన క్రికెట్ సలహా కమిటీ (CAC) దరఖాస్తుల నుండి 10 పేర్లను షార్ట్‌లిస్ట్ చేయాలి. అలా షార్ట్ లిస్ట్ చేసిన వారిని ఇంటర్వ్యూ చేస్తారు. CAC 10 మంది అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి.. ఆపై తుది ఐదుగురిని ఎంపిక చేస్తుంది. దాంతో ఆ ప్రక్రియ ముగుస్తుంది.

స్పోర్ట్స్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..