BCCI : గౌతమ్ గంభీర్ టీమ్‌లో పెను మార్పులు.. కీలక సభ్యుడి తొలగింపు!

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌లో ఒక ముఖ్యమైన సభ్యుడిని తొలగించింది. ఏషియా కప్ 2025 కోసం భారత జట్టును ప్రకటించిన కొన్ని రోజుల తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. గౌతమ్ గంభీర్ భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి బీసీసీఐ పలువురు సపోర్ట్ స్టాఫ్ సభ్యులను తొలగిస్తోంది.

BCCI : గౌతమ్ గంభీర్ టీమ్‌లో పెను మార్పులు.. కీలక సభ్యుడి తొలగింపు!
Indian Cricket Team

Updated on: Aug 23, 2025 | 12:06 PM

BCCI : గౌతమ్ గంభీర్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌లో వరుస మార్పులు జరుగుతున్నాయి. తాజాగా, బీసీసీఐ సుదీర్ఘ కాలం పనిచేసిన టీమ్ మసూర్ రాజీవ్ కుమార్ సేవలను నిలిపివేసింది. దాదాపు 15 ఏళ్ల పాటు భారత జట్టుకు సేవలు అందించిన రాజీవ్‌ను తొలగించి, అతని స్థానంలో కొత్త మసూర్‎ను నియమించింది. ఈ నిర్ణయం టీమ్ మేనేజ్‌మెంట్ సిఫార్సుతో తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా కోచింగ్ స్టాఫ్‌లో ఉన్న అభిషేక్ నాయర్, సోహమ్ దేశాయ్ వంటివారిని తొలగించారు. ఈ మార్పులు టీమిండియాలో కొత్త కోచ్ ప్రభావం ఎంత ఉందో చూపిస్తున్నాయి.

శ్రేయాస్ అయ్యర్‌కు షాక్

ఆసియా కప్ 2025 కోసం భారత జట్టును ప్రకటించినప్పుడు అందరికీ ఆశ్చర్యం కలిగించిన విషయం శ్రేయాస్ అయ్యర్ ను ఎంపిక చేయకపోవడం. అతను ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అలాగే, ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ తరఫున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా ఉన్నాడు. శ్రేయాస్ లేకపోవడంపై చాలా మంది మాజీ క్రికెటర్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

భారత్‌లో ఆటగాళ్లకు కొదవలేదు

శ్రీలంక మాజీ ఆటగాడు ఫర్వేజ్ మహారూఫ్ ఈ విషయంపై స్పందించారు. శ్రేయాస్ అయ్యర్, యశస్వి జైస్వాల్ ఏ తప్పు చేయలేదని, భారత్‌లో అద్భుతమైన ఆటగాళ్లు చాలా మంది ఉన్నందున ఇలాంటి ఎంపికలు జరుగుతాయని అన్నారు. ఏషియా కప్ జట్టును చూస్తే భారత్ ఫేవరెట్‌గా ఉందని, అన్ని విభాగాలు పటిష్టంగా ఉన్నాయని ఆయన చెప్పారు. హార్దిక్ పాండ్యా వంటి ఆటగాడు మ్యాచ్‌ను గెలిపించగల సత్తా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ జట్టులో హార్దిక్ పాండ్యానే కీలకం అని ఆయన పేర్కొన్నారు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..