BCCI: భారత మహిళల జట్టుపై గంగూలీ కీలక వ్యాఖ్యలు.. మీరెన్ని ఫైనల్స్ గెలిచారంటూ ఫ్యాన్స్ ఫైరింగ్..

|

Aug 11, 2022 | 5:30 AM

బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ జట్టుకు శుభాకాంక్షలు తెలిపిన తీరుపై అభిమానుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సౌకర్యాలు లేకపోయినా.. దేశానికి పతకాలు సాధించిన క్రీడాకారులు నిరాశ చెందకుండా పతకాలు సాధించినందుకు గర్వపడాలని పలువురు అభిమానులు అంటున్నారు.

BCCI: భారత మహిళల జట్టుపై గంగూలీ కీలక వ్యాఖ్యలు.. మీరెన్ని ఫైనల్స్ గెలిచారంటూ ఫ్యాన్స్ ఫైరింగ్..
Cwg 2022 Indian Women Cricket Team
Follow us on

కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత మహిళల క్రికెట్ జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. కీలక ఫైనల్లో ఓడిపోయి రజత పతకం దక్కించుకుంది. మహిళల క్రికెట్‌కు తొలిసారిగా కాబన్వెల్త్ క్రీడల్లో చోటు దక్కింది. ఇలాంటి పరిస్థితుల్లో చారిత్రాత్మక పతకం సాధించి సంబరాల్లో మునిగితేలుతున్న దేశానికి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ చేసిన ప్రకటన ఆగ్రహం తెప్పించింది. దీనిపై సోషల్ మీడియాలో నిత్యం గంగూలీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిజానికి ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 9 పరుగుల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. అంతకుముందు 1998లో పురుషుల క్రికెట్ జట్టు కూడా ఈ క్రీడల్లో కనీసం పతకం గెలవలేదు. ఈ మేరకు మహిళా జట్టు ప్రదర్శనను అందరూ అభినందిస్తున్నారు. కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ 61 పతకాలు సాధించి ఓవరాల్‌గా నాలుగో స్థానంలో నిలిచింది.

కాగా, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ జట్టుకు శుభాకాంక్షలు తెలిపిన తీరుపై అభిమానుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సౌకర్యాలు లేకపోయినా.. దేశానికి పతకాలు సాధించిన క్రీడాకారులు నిరాశ చెందకుండా పతకాలు సాధించినందుకు గర్వపడాలని పలువురు అభిమానులు అంటున్నారు. చాలా మంది అసంతృప్తితో గంగూలీపై తీవ్రంగా మండిపడుతున్నారు.

మహిళా క్రికెట్ జట్టును అభినందిస్తూ గంగూలీ ఏమన్నాడంటే..’రజత పతకం సాధించినందుకు భారత మహిళా క్రికెట్ జట్టుకు అభినందనలు. కానీ, వీరి ఆటతీరుతో నిరాశగా ఇంటికి వస్తున్నారు’ అంటూ కామెంట్ చేశారు. దీనిపై నెటిజన్లు, అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గంగూలీని తీవ్రంగా ట్రోల్ చేయడం ప్రారంభించారు. మహిళా జట్టును చూసి గర్వపడాలని, నిరాశ చెందవద్దని ఒక యూజర్ కామెంట్ చేశాడు.

ఇవి కూడా చదవండి

పవర్ ఫుల్ బోర్డు చైర్మన్ గా ఉండి ఇలాంటి ట్వీట్లు సరికాదని మరో యూజర్ రాసుకొచ్చారు. మీరు ఎన్ని ఫైనల్స్‌లో గెలిచారు? అంటూ మరో యూజర్ గంగూలీని ప్రశ్నిస్తూ ఓ కామెంట్ చేశాడు.

హర్మన్‌ప్రీత్ కౌర్ అద్భుతంగా ఆడినా..

ఫైనల్లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసి 161 పరుగుల టార్గెట్‌ను భారత్ ముందుంచింది. బెత్ మూనీ 8 ఫోర్ల సాయంతో ఆస్ట్రేలియా తరపున అత్యధికంగా 65 పరుగులు చేసింది. కాగా, ఆస్ట్రేలియా ఆఫ్ స్పిన్నర్ ఆష్లే గార్డనర్ 3 ఓవర్లలో 16 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో భారత్ తరపున అత్యధికంగా 65 పరుగులు చేసింది.

మేఘనా సింగ్, స్నేహ రాణా చెరో రెండు వికెట్లు తీశారు. ఫైనల్లో స్మృతి మంధాన, షెఫాలీ వర్మ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. అంతకుముందు గ్రూప్ రౌండ్‌లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిపోయింది. పాకిస్థాన్, బార్బడోస్‌లను ఓడించి ఆ జట్టు సెమీ ఫైనల్‌కు చేరుకుంది. ఆ జట్టు సెమీ ఫైనల్‌లో ఆతిథ్య ఇంగ్లాండ్‌ను ఓడించింది.