Sourav Ganguly New Home: భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తన స్వస్థలం కోల్‌కతాలో కొత్త ఇంటిని కొనుగోలు చేశారు. గంగూలీ ప్రస్తుతం దక్షిణ కోల్‌కతాలోని ప్రతిష్టాత్మకమైన బిరెన్ రాయ్ రోడ్‌లోని తన పూర్వీకుల ఇంట్లో నివసిస్తున్నారు. గంగూలీ మింటో పార్క్ ఎదురుగా ఉన్న లోయర్ రాడెన్ స్ట్రీట్ ఏరియాలో కొత్త ఇల్లు కొన్నాడు. ఈ రెండు అంతస్తుల కొత్త భవనంలో డజనుకు పైగా గదులు, విశాలమైన ఖాళీ స్థలంతోపాటు చెట్లతో నిండి ఉంది. గంగూలీ కోల్‌కతాలో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో కొత్త ఇల్లు కొన్నాడు. అయినప్పటికీ, ఈ కొత్త ఇంటి చుట్టూ మాత్రం పచ్చదనం కనిపిస్తోంది. మీడియా కథనాల ప్రకారం, గంగూలీ దాదాపు రూ. 40 కోట్లతో కొత్త ఇంటిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
అయితే, సౌరవ్ గంగూలీ తన కొత్త ఇంటికి ఎప్పుడు మారతాడు అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. కాగా, గంగూలీకి తన పాత ఇంటితో చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. సౌరవ్ గంగూలీతో కలిసి ఆడిన టీమిండియా ఆటగాళ్లు.. గంగూలీ కోల్‌కతా వచ్చినప్పుడు అతని ఇంటికి వచ్చేవారు.
సౌరవ్ గంగూలీ టీమిండియా తరపున అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకడిగా నిలిచాడు. గంగూలీ భారత్ తరపున 113 టెస్టులు, 311 వన్డేలు ఆడాడు. స్టైలిష్ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ సౌరవ్ గంగూలీ 16 సెంచరీలు, 35 అర్ధ సెంచరీలతో సహా 42.17 సగటుతో టెస్ట్ మ్యాచ్‌లలో 7212 పరుగులు చేశాడు. అదే సమయంలో, వన్డే ఇంటర్నేషనల్‌లో 41.02 సగటుతో 11363 పరుగులు అతని పేరిట నమోదయ్యాయి. వన్డేల్లో గంగూలీ బ్యాట్‌లో 22 సెంచరీలు, 72 హాఫ్ సెంచరీలు చేశాడు.
గంగూలీ కెప్టెన్సీలో భారత్ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది..
సౌరవ్ గంగూలీ 49 టెస్టులు, 147 వన్డేలకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ‘దాదా’గా పేరుగాంచిన ఈ ఆటగాడు దేశం వెలుపల కూడా సత్తా చాటాడు. గంగూలీ కెప్టెన్సీలో 2003లో జరిగిన ప్రపంచకప్‌లో టీమిండియా ఫైనల్‌కు చేరుకుంది. అదే సమయంలో, 2002 ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఉమ్మడి విజేతగా నిలిచింది.
India vs England: చోటు దక్కించుకున్న ‘నయావాల్’.. ఇంగ్లండ్‌తో ఐదో టెస్ట్ ఆడే తుది భారత జట్టు ఇదే..