Team India: టీమిండియా నూతన సారథిగా హైదరాబాదీ సొగసరి బ్యాటర్.. ఎప్పటినుంచంటే?

Indian Cricket Team: రాహుల్ ద్రవిడ్ విరామం తీసుకున్నప్పుడల్లా వీవీఎస్ లక్ష్మణ్‌ను కోచ్‌గా నియమించారు. ప్రపంచకప్ తర్వాత కూడా ఇదే పరిస్థితి కొనసాగవచ్చు. ఐర్లాండ్ పర్యటనలో వీవీఎస్ లక్ష్మణ్ భారత జట్టుకు కోచ్‌గా పనిచేసిన సంతగి తెలిసిందే. దీని తరువాత, అతను ఆసియా క్రీడలలో భారత జట్టుకు కోచ్‌గా కూడా ఉన్నాడు. ఆ సమయంలో జట్టు బంగారు పతకాన్ని గెలుచుకుంది.

Team India: టీమిండియా నూతన సారథిగా హైదరాబాదీ సొగసరి బ్యాటర్.. ఎప్పటినుంచంటే?
Team India Cwc 2023

Updated on: Oct 27, 2023 | 10:07 PM

మాజీ దిగ్గజ బ్యాట్స్‌మెన్ వీవీఎస్ లక్ష్మణ్‌ (VVS Laxman)ను భారత క్రికెట్ జట్టు (Indian Cricket Team) కోచ్‌గా నియమించవచ్చు. ప్రపంచ కప్ 2023 తర్వాత, భారత జట్టు ఆస్ట్రేలియాతో T20 సిరీస్ ఆడవలసి ఉంది. ఈ సిరీస్ కోసం వీవీఎస్ లక్ష్మణ్‌ను భారత జట్టు ప్రధాన కోచ్‌గా నియమించవచ్చని తెలుస్తోంది. ప్రపంచ కప్ 2023 తర్వాత రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగుస్తుంది. ఇటువంటి పరిస్థితిలో వీవీఎస్ లక్ష్మణ్ ఈ సిరీస్‌లో తాత్కాలిక కోచ్‌గా పని చేయవచ్చు. గతంలో కూడా ఇలాంటి బాధ్యతలు నిర్వర్తించారు.

నవంబర్ 23 నుంచి భారత్-ఆస్ట్రేలియా మధ్య టీ20 సిరీస్ ప్రారంభం కానుండగా, తొలి మ్యాచ్ విశాఖపట్నంలో జరగనుంది. పీటీఐ నివేదిక ప్రకారం, రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగియడం వల్ల ఈ సిరీస్‌కు అందుబాటులో ఉండడు. 2023 ప్రపంచకప్ తర్వాత అతను మళ్లీ దరఖాస్తు చేసుకుంటాడా లేదా అనేది చూడాలి. రాహుల్ ద్రవిడ్ మళ్లీ దరఖాస్తు చేసుకోకపోతే, వీవీఎస్ లక్ష్మణ్‌ను తదుపరి కోచ్‌గా చేయవచ్చు. ఎందుకంటే, అతను ప్రస్తుతం NCAలో పనిచేస్తున్నాడు. అందుకే అతనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వవచ్చు.

వీవీఎస్ లక్ష్మణ్‌కు కీలక బాధ్యతలు..

రాహుల్ ద్రవిడ్ విరామం తీసుకున్నప్పుడల్లా వీవీఎస్ లక్ష్మణ్‌ను కోచ్‌గా నియమించారు. ప్రపంచకప్ తర్వాత కూడా ఇదే పరిస్థితి కొనసాగవచ్చు. ఐర్లాండ్ పర్యటనలో వీవీఎస్ లక్ష్మణ్ భారత జట్టుకు కోచ్‌గా పనిచేసిన సంతగి తెలిసిందే. దీని తరువాత, అతను ఆసియా క్రీడలలో భారత జట్టుకు కోచ్‌గా కూడా ఉన్నాడు. ఆ సమయంలో జట్టు బంగారు పతకాన్ని గెలుచుకుంది. ఇటువంటి పరిస్థితిలో, VVS లక్ష్మణ్ వాదన మరింత బలపడుతుంది. ప్రపంచకప్ తర్వాత టీ20 ప్రపంచకప్‌నకు భారత్ సన్నద్ధం కానుంది.

వన్డే ప్రపంచకప్ 2023లో టీమిండియా పరిస్థితి..

ఐసీసీ వన్డే ప్రపంచ కప్ 2023లో టీమిండియా వరుస విజయాలతో దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచ్‌లలో ఐదు గెలిచిన భారత్.. తన ఆరో మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్‌తో తలపడేందుకు రెడీ అయింది. ఆదివారం (అక్టోబర్ 29) లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ హైవోల్టేజీ మ్యాచ్ కోసం టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీస్ ప్రారంభించారు. ఇక పాయింట్ల పట్టికలో 10 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..