MS Dhoni : ఆసియా కప్ కోసం కోచ్‌గా గంభీర్.. స్పెషల్ రోల్‎లో ధోని.. బీసీసీఐ మాస్టర్ ప్లాన్

2026 టీ20 వరల్డ్ కప్‌కు కొన్ని నెలల ముందు భారత క్రికెట్‌లో సంచలనం సృష్టించే ఒక వార్త బయటపడింది. ఒక నివేదిక ప్రకారం, బీసీసీఐ ఎంఎస్ ధోనికి మళ్లీ మెంటార్ పాత్ర ఇవ్వాలని భావిస్తోంది. ఇంతకు ముందు 2021 టీ20 వరల్డ్ కప్ సమయంలో ధోని టీమిండియాకు మెంటార్‌గా ఉన్నాడు.

MS Dhoni : ఆసియా కప్ కోసం కోచ్‌గా గంభీర్..  స్పెషల్ రోల్‎లో ధోని.. బీసీసీఐ మాస్టర్ ప్లాన్
Ms Dhoni

Updated on: Aug 30, 2025 | 5:02 PM

MS Dhoni : టీ20 వరల్డ్ కప్ 2026కు కొన్ని నెలల ముందు భారత క్రికెట్‌లో సంచలనం సృష్టించే ఒక వార్త వెలువడింది. ఒక నివేదిక ప్రకారం.. బీసీసీఐ ఎంఎస్ ధోనిని మళ్లీ టీమిండియా మెంటార్‌గా నియమించాలని చూస్తోంది. ధోని గతంలో 2021 టీ20 వరల్డ్ కప్ సమయంలో భారత జట్టుకు మెంటార్‌గా వ్యవహరించాడు. ఆ సమయంలో రవిశాస్త్రి హెడ్ కోచ్‌గా ఉన్నారు. నివేదికల ప్రకారం.. ధోనికి ఆఫర్ ఇప్పటికే ఇచ్చారు. అయితే, అతను ఈ ఆఫర్‌ను రిజెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

టీమిండియాకు ధోని మెంటార్ అవుతాడా?

బీసీసీఐ అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. ఎంఎస్ ధోని మెంటార్‌గా భారత క్రికెట్‌లో నెక్ట్స్ జనరేషన్ టీంను రెడీ చేయడంలో సాయపడగలడు అని అన్నారు. అయితే, ధోని ఈ ఆఫర్‌ను అంగీకరించకపోవడానికి ప్రధాన కారణం గౌతమ్ గంభీర్ కావచ్చు అని ఆ అధికారి చెప్పాడు. 2021లో ధోని మెంటార్‌గా ఉన్నప్పుడు, భారత జట్టు టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్‌కు కూడా వెళ్లలేకపోయింది.

కొన్ని ఇతర నివేదికల ప్రకారం.. ధోని ఐపీఎల్ 2026 తర్వాత ఐపీఎల్‌కు కూడా గుడ్ బై చెప్పే అవకాశం ఉంది. ఐపీఎల్ 2026 టీ20 వరల్డ్ కప్ 2026 ముగిసిన తర్వాత నెలలోనే ప్రారంభమవుతుంది. యువ ఆటగాళ్లకు ధోని సలహాలు ఎంతో సహాయపడతాయనడంలో సందేహం లేదు. కానీ, అతని ఆలోచనా విధానం గౌతమ్ గంభీర్ కంటే భిన్నంగా ఉండవచ్చు.

టీ20 వరల్డ్ ఛాంపియన్ కెప్టెన్ ధోని

మొదటి టీ20 వరల్డ్ కప్ 2007లో జరిగింది. ఫైనల్‌లో భారత్ పాకిస్తాన్‌ను 5 పరుగుల తేడాతో ఓడించి చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. ఆ తర్వాత 2014లో ధోని కెప్టెన్సీలోనే భారత జట్టు టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌ ఆడింది. దురదృష్టవశాత్తు.. ఆ మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది.

 

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి