కరోనా కొత్త వేరియంట్ ‘ఓమిక్రాన్’ ఆందోళన నేపథ్యంలో భారత ఫాస్ట్ బౌలర్ శార్దూల్ ఠాకూర్‌ను దక్షిణాఫ్రికాకు పంపకూడదని BCCI నిర్ణయించింది. భారత్ ఎ జట్టులో భాగమయ్యేందుకు శార్దూల్ దక్షిణాఫ్రికా వెళ్లాల్సి ఉంది. కానీ అతని ప్రయాణం వాయిదా పడింది. ఇప్పుడు అతను భారత సీనియర్ జట్టు శిబిరంలో భాగం కానున్నాడు. ఓమిక్రాన్ ముప్పు మధ్య భారత్ ఎ జట్టు ప్రస్తుతం దక్షిణాఫ్రికా ఎ జట్టుతో సిరీస్ ఆడుతోంది. డిసెంబర్ 6 నుంచి జరిగే చివరి నాలుగు రోజుల మ్యాచ్‌లో శార్దూల్ ఠాకూర్ దక్షిణాఫ్రికా ఎతో ఆడాల్సి ఉంది.
కరోనా యొక్క కొత్త వేరియంట్ ముప్పు ఉన్నప్పటికీ, క్రికెట్ సౌతాఫ్రికా ఇండియా A తో సిరీస్‌ను కొనసాగించాలని నిర్ణయించుకుంది. బ్లూమ్‌ఫోంటైన్‌లో ఒక్క కరోనా వేరియంట్ కేసు కూడా రాకపోవడంతో క్రికెట్ సౌతాఫ్రికా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ బృందాలు కూడా బయో బబుల్‌లో ఉన్నాయి. “భారత A-జట్టు పర్యటన కొనసాగుతోందని BCCI కోశాధికారి అరుణ్ ధుమాల్ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో చెప్పారు. ఆటగాళ్లందరూ బయోబబుల్‌లో ఉన్నారు. మేము పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నాం, దీనికి సంబంధించి క్రికెట్ దక్షిణాఫ్రికాతో సంప్రదింపులు జరుపుతున్నాం. ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్‌లు జరుగుతున్నాయి. భారత ప్రభుత్వం నుంచి కూడా మాకు ఎలాంటి ఆదేశాలు రాలేదు.” అరుణ్ ధుమాల్ వివరించారు.
శార్దూల్ ఠాకూర్‌ను దక్షిణాఫ్రికాకు పంపకూడదని BCCI నిర్ణయించి ఉండవచ్చు, కానీ ఇద్దరు ఆటగాళ్లు ఇషాన్ కిషన్, దీపక్ చాహర్ 3 రోజుల క్వారంటైన్ అనంతరం భారత A జట్టులో భాగమయ్యారు. న్యూజిలాండ్ నుంచి టీ20 సిరీస్ ముగిసిన వెంటనే ఈ ఇద్దరు ఆటగాళ్లు దక్షిణాఫ్రికాకు వెళ్లిపోయారు.
Reda also.. Sourav Ganguly: దక్షిణాఫ్రికాలో భారత జట్టు పర్యటన ఉంటుందా.. బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ ఏం చెప్పాడంటే..