India vs New Zealand: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ కోసం భారత జట్టును ఒకటి లేదా రెండు రోజుల్లో ప్రకటించవచ్చు. అయితే, ఇందులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలకు భారీ షాక్ ఇచ్చేందుకు బీసీసీఐ సిద్ధమైనట్లు వార్తలు వస్తు్న్నాయి. టీ20 జట్టుకు వీరిద్దరూ దూరమైనట్లేనని భావిస్తున్నారు. వచ్చే 24 గంటలు భారత క్రికెట్ జట్టుకు చాలా కీలకం కానుంది. ఎందుకంటే టీ20 వరల్డ్‌కప్‌లో భారత జట్టు పునర్నిర్మాణం జరుగుతోందని ఇటీవల టీమ్ ఇండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ చెప్పిన సంగతి తెలిసిందే. మా జట్టులో చాలా మంది ప్రతిభావంతులైన క్రికెటర్లు ఉన్నారు. అయితే వారు ఓపికతో ఉండాలి. రోహిత్, విరాట్, కేఎల్ రాహుల్ వంటి సీనియర్ ఆటగాళ్లు భవిష్యత్తులో భారత టీ20 జట్టులో భాగం కారని కోచ్ ద్రవిడ్ ఇప్పటికే సిగ్నల్స్ ఇచ్చేశారు. దీంతో పాటు హార్దిక్ పాండ్యాను టీ20 జట్టుకు రెగ్యులర్ కెప్టెన్‌గా కూడా చేయవచ్చని తెలుస్తోంది. జనవరి 27 నుంచి భారత్, న్యూజిలాండ్ మధ్య టీ20 సిరీస్ ప్రారంభం కానుంది.
ప్రస్తుత భారత టీ20 టీమ్‌లో రోహిత్ శర్మకు ప్లేస్ కష్టం కానుంది. అందుకు అతని ఏజ్ సమస్యగా మారునుంది. హిట్‌మ్యాన్‌కి ఇప్పుడు 35 ఏళ్లు. ఇటీవల రోహిత్ టీ20 క్రికెట్‌లో రాణించలేకపోతున్నాడు. టీ20ల్లో గత 10 ఇన్నింగ్స్‌ల్లో ఒకే ఒక్క అర్ధ సెంచరీ మాత్రమే చేయగలిగాడు. టీ20 ప్రపంచకప్‌లోనూ అతని ప్రదర్శన మసకబారింది. మునుపటిలా బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించలేకపోతున్నాడు. ఈ కారణాలన్నింటిని దృష్టిలో ఉంచుకుని టీ20 క్రికెట్‌లో భవిష్యత్ ప్రణాళికల్లో రోహిత్‌ని ఇన్వాల్వ్ చేయడం టీమ్ మేనేజ్‌మెంట్ ఇష్టపడడం లేదు.
టీ20లో వేగంగా బ్యాటింగ్ చేయడంలో విరాట్ కోహ్లి విఫలమవుతున్నాడు. చాలా నెమ్మదిగా స్టార్ట్ చేయడంతో ఈ లిస్టు నుంచి తప్పించాలని మేనేజ్‌మెంట్ భావిస్తోంది. ప్రారంభంలో కోహ్లీ సగటు ఒక్కో బంతికి ఒక్కో పరుగులా ఉంటుంది. చివరిగా స్ట్రైక్‌రేట్‌ను మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నించినా.. ప్రస్తుతం టీ20లో విరాట్ కంటే వేగంగా బ్యాటింగ్ చేసే సత్తా భారత జట్టులోని క్రికెటర్లకు ఉంది. అందుకే టీ20 టీమ్ ఫ్యూచర్ ప్లాన్‌లో విరాట్ కోహ్లీని చేర్చడంలేదు. ప్రస్తుతం అతని స్థానంలో టీమ్ ఇండియాలో చాలా మంది యువ బ్యాట్స్‌మెన్‌లను ప్రయత్నించవచ్చు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..