Chetan Sharma Sting Operation Controversy: భారత క్రికెట్ సెలక్షన్ కమిటీ చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ సంచలన ఆరోపణలతో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాడు. జట్టులో ఎంపికలకు సంబంధించి ప్రెస్ కాన్ఫరెన్స్‌లు నిర్వహించకుండా, మీడియా ప్రశ్నలకు సమాధానమివ్వకుండా క్రికెట్ జర్నలిస్టులు, అభిమానులకు టార్గెట్‌గా మారుతుంటారు. చేతన్ శర్మ ఎట్టకేలకు కెమెరా ముందుకు వచ్చాడు. కానీ, అతను వచ్చిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. చేతన్ శర్మ ఒక వార్తా ఛానెల్ స్టింగ్ ఆపరేషన్‌లో కొన్ని సంచలనాలను బహిర్గతం చేశాడు. ఇది ప్రస్తుతం బీసీసీఐతోపాటు, ఆటగాళ్లలోనూ ఆందోళనలు రేకెత్తిస్తోంది. దీంతో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (BCCI) ఈ సమస్యను తీవ్రంగా పరిగణిస్తోంది. చేతన్ శర్మ ఉద్యోగ్యం కూడా ప్రమాదంలో పడింది.
గత నెలలో సీనియర్ సెలక్షన్ కమిటీ చీఫ్ సెలక్టర్‌గా నియమితులైన మాజీ ఫాస్ట్ బౌలర్ చేతన్ శర్మ.. ఈ స్టింగ్ ఆపరేషన్‌లో టీమిండియా ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై రకరకాల వాదనలు చేశాడు. అలాగే బోర్డ్ వర్సెస్ విరాట్ కోహ్లీ ఇష్యూపై కొన్ని ఆరోపణలు చేశాడు. ఇది క్రికెట్ అభిమానులతో పాటు బోర్డును ఇరకాటంలో పడేసింది.
పీటీఐ కథనం ప్రకారం, జాతీయ సెలెక్టర్లు బోర్డు కాంట్రాక్ట్‌కు కట్టుబడి ఉన్నందున, మీడియాతో మాట్లాడటానికి వారికి అనుమతి ఉండదు. దీంతో బీసీసీఐ ఈ విషయాన్ని పరిశీలిస్తోంది. PTI శర్మను సంప్రదించగా, అతను వ్యాఖ్యానించడానికి అందుబాటులో లేరు. ఈ విషయాన్ని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు పీటీఐకి తెలిపారు. చేతన్ భవిష్యత్తుపై బీసీసీఐ కార్యదర్శి జై షా నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు.
ఈ స్టింగ్ ఆపరేషన్‌లో చేతన్ శర్మ విరాట్ కోహ్లీ, జస్‌ప్రీత్ బుమ్రా వంటి ఆటగాళ్లపై పలు ఆరోపణలు చేశాడు. కోచ్‌లు రాహుల్ ద్రవిడ్, విరాట్ కోహ్లిలతో జరిగిన రహస్య సంభాషణలను కూడా బయటపెట్టాడు. 80 నుంచి 85 శాతం ఫిట్‌గా ఉన్నప్పటికీ ఆటగాళ్లు త్వరగా క్రికెట్‌లోకి రావడానికి ఇంజెక్షన్లు తీసుకుంటారని శర్మ ఆయన ఆరోపించారు.
ఇది మాత్రమే కాదు, భారతదేశం తరపున 23 టెస్టులు ఆడిన చేతన్ శర్మ, సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగే టీ20ఐ సిరీస్‌కు బుమ్రా తిరిగి రావడంపై తనకు, జట్టు మేనేజ్‌మెంట్ మధ్య విభేదాలు ఉన్నాయని ఆరోపించారు.
బుమ్రా ప్రస్తుతం జట్టుకు దూరంగా ఉన్నాడు. ఆస్ట్రేలియాతో జరిగే నాలుగు టెస్టుల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ, తదుపరి మూడు-వన్డేల సిరీస్‌లో పాల్గొనే అవకాశం లేదు. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మధ్య అహం ఉందని, కెప్టెన్సీ వివాదంలో కోహ్లీ అబద్ధం చెప్పాడని శర్మ ఆరోపించారు. గంగూలీ రోహిత్‌కు అనుకూలంగా లేడని, బదులుగా అతను కోహ్లీని ఇష్టపడలేదని చెప్పుకొచ్చాడు.
మరిన్ని క్రీడా వార్తల గురించి ఇక్కడ క్లిక్ చేయండి..