
India vs South Africa, 2nd Test: ఆగస్టులో ఇంగ్లండ్ పర్యటన నుంచి భారత జట్టుకు దూరంగా ఉన్న స్టార్ బ్యాటర్ కరుణ్ నాయర్, సోమవారం సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. గౌహతిలో జరుగుతున్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికాపై భారత జట్టు కష్టాల్లో ఉన్న సమయంలోనే నాయర్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
“కొన్ని పరిస్థితులు మనసుకు సుపరిచితమైన అనుభూతిని కలిగిస్తాయి – కానీ అక్కడ (మైదానంలో) లేకపోవడంలోని నిశ్శబ్దం బాధను (sting) మిగిలిస్తుంది,” అని రాసుకొచ్చాడు.
2016లో ఇంగ్లండ్‌పై ట్రిపుల్ సెంచరీ సాధించిన కరుణ్ నాయర్ కెరీర్ ఆ తర్వాత ఒడిదుడుకులతో సాగింది. అప్పటి నుంచి అతనికి అవకాశాలు చాలా తక్కువగా వచ్చాయి. అయితే ఇటీవల దేశవాళీ క్రికెట్‌లో ఆయన మంచి ఫామ్‌లో ఉన్నారు.
శుభ్‌మన్ గిల్ మెడ గాయం కారణంగా రెండో టెస్టుకు దూరమవడంతో, ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత హర్షా భోగ్లే.. గిల్ స్థానంలో కరుణ్ నాయర్‌ను ఎంపిక చేసి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. దేశవాళీ క్రికెట్‌లో పరుగులు సాధిస్తున్న నాయర్ వంటి రైట్ హ్యాండర్ ప్రస్తుతం జట్టుకు అవసరమని ఆయన పేర్కొన్నారు.
Adei😂 https://t.co/PiLMwlYoCe
— Ashwin 🇮🇳 (@ashwinravi99) November 24, 2025
గత సీజన్‌లో విదర్భ రంజీ ట్రోఫీ గెలవడంలో నాయర్ కీలక పాత్ర పోషించాడు. కానీ, ఇంగ్లండ్ టూర్‌లో 8 ఇన్నింగ్స్‌లలో కేవలం 25.62 సగటుతో 205 పరుగులు మాత్రమే చేయడంతో, సెలెక్టర్లు అతన్ని వెస్టిండీస్ సిరీస్‌తోపాటు ఇండియా-A మ్యాచ్‌లకు ఎంపిక చేయలేదు.
ఈ క్రమంలో జట్టు ఎంపికపై స్పందిస్తూ నాయర్ ఇటీవల ఓ ట్వీట్ చేశాడు. “ఇది కచ్చితంగా చాలా నిరాశజనకం. గత రెండేళ్లుగా నా ప్రదర్శనను బట్టి చూస్తే, నాకు ఇంకా మెరుగైన అవకాశాలు దక్కాల్సిందని భావిస్తున్నాను. జట్టులోని కొంతమంది వ్యక్తులు నాతో మాట్లాడారు, కానీ చివరికి నా పని పరుగులు చేయడమే” అంటూ చెప్పుకొచ్చాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..