Watch Video: 13 బంతుల్లో అర్థ సెంచరీ.. తుఫాన్ ఇన్నింగ్స్‌తో చెలరేగిన నరైన్.. యూవీ రికార్డుకు తప్పిన ప్రమాదం..

|

Feb 17, 2022 | 6:33 AM

బీపీఎల్ 2022 రెండో క్వాలిఫయర్‌లో కొమిల్లా విక్టోరియన్స్ తరపున ఆడుతున్న సునీల్ నరైన్ కేవలం 16 బంతుల్లో 57 పరుగులు చేసి బ్యాట్‌తో విధ్వంసం సృష్టించాడు.

Watch Video: 13 బంతుల్లో అర్థ సెంచరీ.. తుఫాన్ ఇన్నింగ్స్‌తో చెలరేగిన నరైన్.. యూవీ రికార్డుకు తప్పిన ప్రమాదం..
Bangladesh Premier League
Follow us on

సునీల్ నరైన్ (Sunil Narine) తన మిస్టరీ బౌలింగ్‌కు పేరుగాంచినప్పటికీ, అతను బ్యాట్‌తోనూ చాలా ప్రమాదకరంగా కనిపిస్తూనే ఉంటాడు. నరేన్ బ్యాట్ కదిలినప్పుడల్లా బౌలర్లపై విధ్వంసం సృష్టిస్తూనే ఉంటాడు. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ 2022(Bangladesh Premier League 2022) రెండో క్వాలిఫైయర్‌లో కూడా ఇలాంటిదే కనిపించింది. కొమిల్లా విక్టోరియన్స్ తరఫున ఆడుతున్న సునీల్ నరైన్, చటోగ్రామ్ ఛాలెంజర్స్‌పై కేవలం 16 బంతుల్లో 57 పరుగులు చేశాడు. సునీల్ నరైన్ కేవలం 13 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. నరేన్ క్రీజులోకి రాగానే తుఫాను బ్యాటింగ్ చేశాడు. 6 సిక్సర్లు, 4 ఫోర్లు కొట్టి అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. నరేన్ తన హాఫ్ సెంచరీలో కేవలం ఒక్క సింగిల్ మాత్రమే తీసుకున్నాడు. సిక్సర్లు, ఫోర్లతో ప్రత్యర్థి బౌలర్లపై విధ్వంసం సృష్టించాడు.

సిక్సర్ బాదిన నరైన్ తన ఖాతా తెరిచి నాలుగో ఓవర్ ముగిసే సమయానికి 9 బంతుల్లో 36 పరుగులు చేశాడు. దీని తర్వాత నరైన్ ఆరో ఓవర్ తొలి బంతికి సిక్సర్ కొట్టి అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. నరైన్ హాఫ్ సెంచరీ చేసేందుకు 13 బంతుల్లోనే పట్టింది. 149 పరుగుల లక్ష్యాన్ని నరేన్, కొమిల్లా (Chattogram Challengers vs Comilla Victorians, 2nd Qualifier) జట్టు 12.5 ఓవర్లలోనే ఛేదించింది. ఈ విజయంతో కొమిల్లా జట్టు కూడా ఫైనల్‌కు చేరుకుంది.

నరైన్‌ విధ్వసంతో కొమిల్లా విజయం..

బీపీఎల్ 2022 చరిత్రలో అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీ సాధించిన ఆటగాడిగా సునీల్ నరైన్ నిలిచాడు. దీనితో పాటు, నరేన్ తుఫాన్ ఇన్నింగ్స్ తర్వాత యువరాజ్ రికార్డు ప్రమాదంలో పడేది. టీ20ల్లో అత్యంత వేగంగా అర్ధశతకం సాధించిన ఆటగాడిగా యువరాజ్ సింగ్ రికార్డు సృష్టించాడు. ఈ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ 2007లో కేవలం 12 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించాడు.

కొమిల్లా బ్యాట్స్‌మెన్ ఆధిపత్యం..

మ్యాచ్ గురించి మాట్లాడుతూ, లక్ష్యాన్ని ఛేదించిన కొమిల్లా జట్టుకు శుభారంభం లభించలేదు. లిట్టన్ దాస్ తొలి బంతికే ఔటయ్యాడు. అయితే, దీని తర్వాత నరేన్ జోరుగా బ్యాటింగ్ చేసి ప్రత్యర్థి జట్టును కుప్పకూల్చాడు. నరైన్ కేవలం 16 బంతుల్లో 57 పరుగులు చేశాడు. అతను ఔటైన తర్వాత, ఫాఫ్ డు ప్లెసిస్ 23 బంతుల్లో 30 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మొయిన్ అలీ కూడా 13 బంతుల్లో అజేయంగా 30 పరుగులు చేశాడు. బౌలింగ్‌లోనూ మొయిన్‌ అలీ, సునీల్‌ నరైన్‌ తమ సత్తా చాటారు. మొయిన్ అలీ 3 ఓవర్లలో 20 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. అదే సమయంలో సునీల్ నరైన్ 4 ఓవర్లలో 24 పరుగులు ఇచ్చాడు.

Also Read: Ipl 2022 Auction: కొత్త ఆటగాళ్లకు అదిరిపోయే వెల్కమ్‌ చెప్పిన రాజస్థాన్‌ రాయల్స్‌.. షారుఖ్‌ ఖాన్‌ పాటతో..

IND vs WI 1st T20: అర్ధ సెంచరీతో రాణించిన నికోలస్‌ పూరన్‌.. టీమిండియా ముందు మోస్తరు లక్ష్యం..