BAN vs IND: ఇషాన్ డబుల్ సెంచరీతో ఇరకాటంలో ద్రవిడ్‌.. మూర్ఖుడంటూ తీవ్ర విమర్శలు చేస్తోన్న నెటిజన్లు.. ఎందుకంటే?

|

Dec 12, 2022 | 12:18 PM

ఈ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ సాధించిన ఇతర ఫీట్‌ల గురించి మాట్లాడితే, అతను వన్డే ఇంటర్నేషనల్స్‌లో డబుల్ సెంచరీ సాధించిన అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు. రోహిత్ శర్మ దీర్ఘకాల రికార్డును అధిగమించాడు.

BAN vs IND: ఇషాన్ డబుల్ సెంచరీతో ఇరకాటంలో ద్రవిడ్‌.. మూర్ఖుడంటూ తీవ్ర విమర్శలు చేస్తోన్న నెటిజన్లు.. ఎందుకంటే?
Virat Kohli, Ishan Kishan
Follow us on

Ishan Kishan: శనివారం బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో వన్డేలో 131 బంతుల్లో 210 పరుగులతో సంచలనాత్మక ఇన్నింగ్స్‌తో ఇషాన్ కిషన్ ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. అయితే, ఆ తర్వాత భారత ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ సోషల్ మీడియాలో తీవ్రమైన విమర్శలను ఎదుర్కొంటున్నాడు. టీమిండియా మద్దతుదారులలో ఒక వర్గం అతన్ని “రాస్కల్” అని కామెంట్ చేస్తుండగా, మరికొందరు ఇషాన్ కిషన్‌కు జాతీయ జట్టులో ఎక్కువ అవకాశాలు ఇవ్వనందుకు ద్రవిడ్‌ను “మూర్ఖుడు” అని పిలుస్తున్నారు.

రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడిన తర్వాతే ఇషాన్ కిషన్‌ను టీమిండియా ప్లేయింగ్ XI లో చేర్చడం ఏంటని, అభిమానులు ట్విట్టర్‌లో పదేపదే కామెంట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

పరిమిత ఓవర్ల క్రికెట్‌లో భారత్ విపరీతమైన ప్రయోగాలు చేస్తున్న సంగతి తెలిసిందే. భారత టాప్-ఆర్డర్, ముఖ్యంగా ముగ్గురు ఓపెనర్లు, టీ20ల్లో రోహిత్ శర్మ, KL రాహుల్ , ODIలో శిఖర్ ధావన్ మొదటి 10 ఓవర్లలో నెమ్మదిగా బ్యాటింగ్ చేసినందుకు తీవ్రమైన విమర్శలను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.

ఈమేరకు మాజీ క్రికెటర్లు కూడా వీరిపై విమర్శలు కురిపిస్తూ.. దూకుడుగా ఆడటం లేదని కామెంట్లు చేస్తున్నారు. ఎందుకంటే వారి ప్రకారం ఇది మిడిల్ ఆర్డర్‌పై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది. జట్టులో ఆరోగ్యకరమైన మార్పులు చేయాలని BCCIని కోరిన సంగతి తెలిసిందే.

చటోగ్రామ్‌లోని జహుర్ అహ్మద్ చౌదరి స్టేడియంలో ఇషాన్ కిషన్ తన తొలి డబుల్ సెంచరీని కొట్టిన తర్వాత, చాలా మంది అభిమానులు మెన్ ఇన్ బ్లూ స్వదేశంలో వచ్చే ఏడాది ODI ప్రపంచ కప్‌ను గెలవాలనుకుంటే భారతీయ సెలెక్టర్లు సీనియర్లను తొలగించాల్సిన అవసరం ఉందని ఈమేరకు సలహాలు కూడా ఉస్తున్నారు.

కొంతమంది క్రికెట్ ప్రేమికులు ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్ “భారత క్రికెట్ విచారకరమైన వాస్తవాన్ని” బట్టబయలు చేసిందని పేర్కొన్నారు. ఎందుకంటే రోహిత్ శర్మ గాయం కాకుంటే, యువ ఎడమచేతి వాటం బ్యాటర్ బంగ్లాదేశ్‌తో మూడవ ODI ఆడే అవకాశం ఉండేది కాదంటూ చెప్పుకొచ్చారు.

ఇషాన్ కిషన్ ఆటతీరు విషయానికి వస్తే, అతను వన్డే ఇంటర్నేషనల్స్‌లో డబుల్ సెంచరీ చేసిన నాల్గవ భారత బ్యాటర్‌గా నిలిచాడు. అతనికి ముందు, దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్, పేలుడు వీరేంద్ర సెహ్వాగ్, ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మైలురాయిని సాధించారు.

ఇది 50 ఓవర్ల ఫార్మాట్‌లో వేగవంతమైన డబుల్ సెంచరీగా మరో రికార్డ్ నెలకొల్పింది. ఇషాన్ కిషన్ కేవలం 126 బంతుల్లోనే మైలురాయిని చేరుకున్నాడు. మాజీ రికార్డ్ హోల్డర్ వెస్టిండీస్ గ్రేట్ క్రిస్ గేల్ 2015లో జింబాబ్వేపై 138 బంతుల్లో డబుల్ సెంచరీ చేశాడు.

“యూనివర్స్ బాస్” గా పేరుగాంచిన క్రిస్ గేల్, భారత ఓపెనర్ ఇద్దరిలో కనిపించే ఇతర లక్షణం ఏమిటంటే, దాడిని ప్రత్యర్థి వైపుకు తీసుకెళ్లడంలో ముందుంటారు.

ఈ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ సాధించిన ఇతర ఫీట్‌ల గురించి మాట్లాడితే, అతను వన్డే ఇంటర్నేషనల్స్‌లో డబుల్ సెంచరీ సాధించిన అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు. రోహిత్ శర్మ దీర్ఘకాల రికార్డును అధిగమించాడు. ఇషాన్ 24 సంవత్సరాల 145 రోజుల వయస్సులో తన తొలి డబుల్ సెంచరీని చేయగా, రోహిత్ శర్మ తన 26 సంవత్సరాల 186 రోజుల వయస్సులో బెంగళూరులో 2013లో బెంగుళూరులో ఆస్ట్రేలియన్‌లపై ఈ ఫీట్ సాధించాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..