Babar Azam: ఒరేయ్ ఆజామూ.! నీలో మస్త్ షేడ్‌లున్నాయ్.. ఇంకెన్ని రోజులురా ఇలా

|

Sep 17, 2024 | 1:18 PM

అంతర్జాతీయ సిరీస్‌లలో పేలవ ప్రదర్శనలు కనబరుస్తూ విమర్శలపాలవుతున్న పాక్ క్రికెటర్లు.. ప్రస్తుతం స్వదేశంలో జరుగుతోన్న పాకిస్థాన్ ఛాంపియన్స్ కప్‌లో తిరిగి ఫామ్‌లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ టోర్నీలో బాబర్ అజామ్..

Babar Azam: ఒరేయ్ ఆజామూ.! నీలో మస్త్ షేడ్‌లున్నాయ్.. ఇంకెన్ని రోజులురా ఇలా
Babar Azam
Follow us on

అంతర్జాతీయ సిరీస్‌లలో పేలవ ప్రదర్శనలు కనబరుస్తూ విమర్శలపాలవుతున్న పాక్ క్రికెటర్లు.. ప్రస్తుతం స్వదేశంలో జరుగుతోన్న పాకిస్థాన్ ఛాంపియన్స్ కప్‌లో తిరిగి ఫామ్‌లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ టోర్నీలో బాబర్ అజామ్, మహ్మద్ రిజ్వాన్, షాహీన్ షా ఆఫ్రిది, షాదాబ్ ఖాన్ వంటి పలువురు స్టార్ ప్లేయర్లు ఆడుతున్నారు. సోమవారం స్టాలియన్స్, మార్ఖోర్స్ జట్ల మధ్య జరిగిన ఉత్కంఠ మ్యాచ్‌లో యువ పేసర్ షానవాజ్ దహానీ ఓవర్‌లో బాబర్ ఆజామ్ వరుసగా ఐదు బౌండరీలు బాదాడు.

ఇది చదవండి: R అక్షరంతో పేరున్న వ్యక్తుల వ్యక్తిత్వం ఎలాంటిదంటే.? ఆ విషయంలో జగమొండి

ఇవి కూడా చదవండి

వరుసగా ఐదు బౌండరీలు..

50 ఓవర్లలో 232 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన స్టాలియన్స్ జట్టుకు మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన బాబర్ ఆజామ్.. ఆరంభం నుంచి అద్భుతంగా ఆడాడని చెప్పొచ్చు. అదే సమయంలో దహానీ వేసిన ఎనిమిదో ఓవర్‌లో బాబర్ చివరి ఐదు బంతుల్లో ఐదు బౌండరీలు బాదాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇది చదవండి: బాలికతో 20 రోజులు ఓయో రూమ్‌లో.. చివరికి తను ఏం చేసిందంటే

45 బంతుల్లో 45 పరుగులు..

8వ ఓవర్‌లో బాబర్ వరుసగా ఐదు బౌండరీలు బాదాడు. అయితే అతడి స్ట్రైక్ రేట్ మాత్రం మునపటి మాదిరిగా ఉండటం గమనార్హం. ఈ మ్యాచ్‌లో 45 బంతులు ఎదుర్కొన్న బాబర్ ఎనిమిది బౌండరీల సాయంతో 45 పరుగులు చేశాడు. బాబర్ క్రీజులో ఉన్నంతసేపు స్టాలియన్స్ మ్యాచ్ గెలుస్తుందని అందరూ ఊహించారు. అయితే బాబర్ వికెట్ పడగానే మ్యాచ్ రూపురేఖలు మారిపోయాయి. లెగ్ స్పిన్నర్ జాహిద్ మహమూద్‌ బౌలింగ్‌లో పుల్ షాట్ ఆడబోయి.. పెవిలియన్ చేరాడు బాబర్ ఆజామ్.

బాబర్ జట్టు ఓటమి..

బాబర్ అజామ్ ఔటయ్యే సమయానికి జట్టు స్కోరు 23.4 ఓవర్లలో 105 పరుగులు కాగా.. అప్పటి కేవలం 2 వికెట్లు మాత్రమే పడ్డాయి. కానీ అక్కడ నుంచి స్టాలియన్స్ జట్టు 8.4 ఓవర్లలో 26 పరుగులకే చివరి ఎనిమిది వికెట్లు కోల్పోయింది. రెండు మ్యాచ్‌ల్లో 60.50 సగటుతో 121 పరుగులతో, బాబర్ ఆజామ్ ప్రస్తుతం టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు.

ఇది చదవండి: టీ20లకే మొనగాడురా.! 12 ఫోర్లు, 5 సిక్సర్లతో కావ్యపాప ప్లేయర్ ఊచకోత

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..