180 బంతుల్లో 220 పరుగులు.. 6గురి బౌలర్ల భరతం పట్టారు.. కట్ చేస్తే.. మ్యాచ్‌ను మలుపు తిప్పేశారు!

|

Apr 01, 2022 | 12:31 PM

మూడు సెంచరీలు.. మూడు అర్ధ సెంచరీలు.. రికార్డు బ్రేకింగ్ స్కోర్లు.. ఇదేందిది మావా.. ఇదెప్పుడు జరిగిందని అనుకుంటున్నారా.!

180 బంతుల్లో 220 పరుగులు.. 6గురి బౌలర్ల భరతం పట్టారు.. కట్ చేస్తే.. మ్యాచ్‌ను మలుపు తిప్పేశారు!
Cricket
Follow us on

మూడు సెంచరీలు.. మూడు అర్ధ సెంచరీలు.. రికార్డు బ్రేకింగ్ స్కోర్లు.. ఇదేందిది మావా.. ఇదెప్పుడు జరిగిందని అనుకుంటున్నారా.! నిన్న పాకిస్థాన్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్‌లో నమోదైన గణాంకాలు చూస్తే.. మీ ఫ్యూజులు ఎగిరిపోతాయి.

సిక్సర్స్.. సిక్సర్స్.. సిక్సర్స్.. ఐ డోంట్ లైక్ థెం.. బట్ సిక్సర్స్ లైక్స్ మీ అంటూ.. ఆరుగురు బ్యాట్స్‌మెన్లు చెలరేగిపోయారు.. వెరిసి రికార్డు బ్రేకింగ్ స్కోర్లు నమోదయ్యాయి. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా టీం దాదాపుగా 350 స్కోర్ చేయగా.. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ జట్టు.. ఏంటి.! మరీ ఇంత చిన్న టోటలా.. సింపుల్‌గా కొట్టేస్తాం అంటూ వీరబాదుడు బాదేశారు. రికార్డు విజయాన్ని అందుకున్నారు.

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్ చేయగా.. ట్రావిస్ హెడ్(89), మెక్‌డేర్మోట్(104) అద్భుత బ్యాటింగ్‌కు.. లబూషెన్(59), స్టోయినిస్(49) మెరుపులకు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 348 పరుగులు చేసింది. పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది 4 వికెట్లు, వసీమ్ జూనియర్ 2 వికెట్లు, జాహిద్ మహమూద్, ఖుష్‌దిల్ చెరో వికెట్ పడగొట్టారు.

ఇక 349 పరుగుల భారీ టార్గెట్‌‌ను చేధించడంలో భాగంగా బరిలోకి దిగిన పాకిస్థాన్‌కు.. ఓపెనర్లు ఫకార్ జమాన్(67), ఇమామ్ ఉల్ హక్(106) మొదటి వికెట్‌కు 118 పరుగుల భాగస్వామాన్ని నెలకొల్పారు. వన్ డౌన్‌లో వచ్చిన పాక్ కెప్టెన్ బాబర్ అజామ్(114) బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో రిజ్వాన్(23), ఖుష్‌దిల్(27) మెరుపులు మెరిపించడంతో పాకిస్థాన్ మరో ఓవర్ మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేధించింది. ఈ మధ్యకాలంలో పాకిస్థాన్ రికార్డు టార్గెట్‌ చేధించడం ఇదే తొలిసారి కావడం విశేషం.

Also Read: 

Viral Video: సీబీఐ రైడింగ్ అనుకుంటే పొరపాటే.. వీడియో చూస్తే ఫ్యూజులు ఔట్!

వాళ్లు వదులుకున్నారు.. వీళ్లు ఒడిసి పట్టుకున్నారు.. ‘ఆర్ఆర్ఆర్’‌ను రిజెక్ట్ చేసిన హీరోయిన్లు వీరే!