Video: బౌండరీ లైన్‌లో స్టన్నింగ్ క్యాచ్.. షాకైన బ్యాటర్.. నెట్టింట్లో వైరల్ వీడియో..

BBL 2022-23: బిగ్ బాష్ లీగ్‌లో, మెల్‌బోర్న్ రెనెగేడ్స్‌కు చెందిన విల్ సర్డ్‌ల్యాండ్ అలాంటి క్యాచ్‌ను పట్టుకున్నాడు. ఇది అందరినీ ఆశ్చర్యపరిచింది. బౌండరీ లైన్ దగ్గర చాలా ప్రత్యేకమైన రీతిలో ఈ క్యాచ్ పట్టాడు.

Video: బౌండరీ లైన్‌లో స్టన్నింగ్ క్యాచ్.. షాకైన బ్యాటర్.. నెట్టింట్లో వైరల్ వీడియో..
Will Sutherland Stunning Ca

Updated on: Jan 15, 2023 | 1:19 PM

BBL 2022-23 Viral Video: క్రికెట్ ఆటలో రోజురోజుకు మార్పులు కనిపిస్తున్నాయి. ఈ తీవ్రమైన పోటీలో ఆటగాళ్లు బ్యాట్, బాల్‌, ఫీల్డింగ్‌తో కొత్త పద్ధతులను అవలంబిస్తున్నారు. ప్రస్తుతం క్రికెట్‌లో ఫీల్డింగ్‌కు చాలా ప్రాధాన్యత ఏర్పడింది. ఫీల్డింగ్ ద్వారా ఏ జట్టు అయినా మ్యాచ్‌ను మలుపు తిప్పగలదు. ఫీల్డింగ్ అనేది ఏదైనా ఆటలో ముఖ్యమైన భాగం అనేది తెలిసిందే. ముఖ్యంగా బౌండరీ లైన్ దగ్గర ఫీల్డర్లు కొన్నిసార్లు అద్భుతమైన క్యాచ్‌లు పట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అలాంటి ఓ క్యాచ్‌ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో సంచలనంగా మారింది. ఆస్ట్రేలియా ఆటగాడు విల్ సదర్లాండ్ పట్టుకున్నాడు.

క్యాచ్‌ని చూస్తే ఆశ్చర్యపోతారంతే..

బిగ్ బాష్ లీగ్‌లో మెల్‌బోర్న్ రెనెగేడ్స్, మెల్‌బోర్న్ స్టార్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆటగాడు విల్ సదర్లాండ్ అలాంటి క్యాచ్ పట్టడంతో బ్యాట్స్‌మెన్‌తో పాటు అందరినీ ఆశ్చర్యపరిచాడు. విల్ సర్డ్‌లాండ్ బిగ్ బాష్ లీగ్‌లో మెల్‌బోర్న్ రెనెగేడ్స్ తరపున ఆడుతున్నాడు. బౌండరీ లైన్ వద్ద అద్భుత క్యాచ్ పట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. 17 ఏళ్ల విల్ సుర్డ్‌ల్యాండ్ స్టన్నింగ్ క్యాచ్‌తో థామస్ రోజర్స్‌ను పెవిలియన్ చేర్చాడు. ఈ అద్భుతమైన వీడియోను క్రికెట్.కామ్.ఏయూ సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోలో బ్యాట్స్‌మెన్ థామస్ రోజర్స్ లాంగ్ ఆన్ వైపు షాట్ ఆడాడు. అక్కడ ఉన్న విల్ సర్డ్‌లాండ్, ముందుగా గాల్లోకి ఎగిరి క్యాచ్ పట్టాడు. అయితే, బౌండరీ లైన్ క్రాస్ చేసేలా ఉండడంతో.. బంతిని లోపలికి విసిరి, బౌండరీ లైన్‌ అవతలకు వెళ్లాడు. ఆ తర్వాత పైకి విసిరిన బంతిని మరోసారి క్యాచ్ అందుకున్నాడు.

మ్యాచ్ ఎలా ఉంది..

మెల్‌బోర్న్ రెనెగేడ్స్, మెల్‌బోర్న్ స్టార్స్ మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో మెల్‌బోర్న్ రెనెగేడ్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు ఆహ్వానించిన మెల్‌బోర్న్ రెనెగేడ్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. ఛేదనలో మెల్‌బోర్న్ స్టార్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 156 పరుగులు మాత్రమే చేయగలిగింది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..