BCCI’s decision regarding Veda: వేదా కృష్ణమూర్తి విషయంలో బీసీసీఐ తీరు అమానవీయం!

| Edited By: Narender Vaitla

May 16, 2021 | 9:37 AM

BCCI's decision regarding Veda: కరోనా కారణంగా రెండు వారాల వ్యవధిలో తన తల్లి, అక్కను కోల్పోయిన భారత సీనియర్‌ మహిళా క్రికెటర్‌ వేద కృష్ణమూర్తి విషయంలో బీసీసీఐ వ్యహరించిన తీరుపై...

BCCIs decision regarding Veda: వేదా కృష్ణమూర్తి విషయంలో బీసీసీఐ తీరు అమానవీయం!
Bcci's Decision
Follow us on

BCCI’s decision regarding Veda: కరోనా కారణంగా రెండు వారాల వ్యవధిలో తన తల్లి, అక్కను కోల్పోయిన భారత సీనియర్‌ మహిళా క్రికెటర్‌ వేద కృష్ణమూర్తి విషయంలో బీసీసీఐ వ్యహరించిన తీరుపై భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు….ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన స్పోర్ట్‌ బాడీ. అంత సంపద ఉండి ఏం లాభం.. మానవత్వం పిసరంతైనా లేకపోతే..! ఎంతసేపూ డబ్బు యావే కానీ క్రీడాకారుల గురించి ఎప్పుడైనా ఆలోచించిందా? ఆస్ట్రేలియా మహిళల జట్టు మాజీ కెప్టెన్‌ లీసా స్టలేకర్‌ అన్నారని కాదు కానీ నిజంగానే బీసీసీఐకి జాలి దయ కరుణ ఇలాంటివేమీ ఉండవని చాలా సార్లు రుజవయ్యింది. అంతెందకు కరోనా విస్తరిస్తున్న కాలంలో ఐపీఎల్‌ వద్దు మహాప్రభో అని చాలా మంది వేడుకున్నా బోలెడంత నష్టం వాటిల్లుతుందని పట్టుదలకు పోయింది. ఏమైంది .? చాలా మంది ఆటగాళ్లకు కరోనా సోకింది.. ఇప్పుడు మహిళల జట్టు సభ్యురాలు వేదా కృష్ణమూర్తి పట్ల వ్యవహరిస్తున్న తీరు ఇంకా అమానవీయం. తల్లిని, అక్కను కోల్పోయి తీవ్ర దుఃఖంలో ఉన్న వేదా కృష్ణమూర్తిని పరామర్శించాలన్న సోయి లేదా? డబ్బులు ఇవ్వకండి.. నాలుగు ఓదార్పు మాటలు చెబితే సొమ్మేం పోదు కదా! పరామర్శించడం మాట వదిలేయండి.. వచ్చే ఇంగ్లాండ్‌ పర్యటనకు ఆమెను ఎంపిక చేయకపోవడం దారుణం.. తమ నిర్ణయాన్ని ఆమెకు చెప్పకపోవడం ఇంకా దారుణం.. తల్లిని, సోదరిని పోగొట్టుకున్న వేద ఇప్పుడు ఆడలేని పరిస్థితిలో ఉంటే ఉండవచ్చు.. ఈ విషాదం నుంచి కోలుకోవడానికి కొంత కాలం పట్టవచ్చు.. అందుకే బీసీసీఐ ఆమెను ఎంపిక చేసి ఉండకపోవచ్చు.. ఇవన్నీ కరెక్టే .. కానీ ఓ కాంట్రాక్ట్‌ క్రికెటర్‌ పట్ల వ్యవహరించే తీరు ఇదేనా? జట్టులో ఎంపిక చేయలేదన్న విషయాన్ని ఆమెకు చెప్పకపోవడం సరైందేనా? అందుకే లీసాకు కోపం వచ్చింది. వేద ప్రస్తుతం ఎలా ఉన్నారో, ఎలా కోలుకుంటున్నారో కూడా భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డుకు అవసరం లేకుండా పోయిందని లీసా ఘాటుగానే విమర్శించారు. నిజమైన క్రికెట్‌ సంఘం తమ క్రీడాకారుల గురించి అనుక్షణం పట్టించుకుంటుందని ఆమె చెప్పారు.. మన బోర్డు నిజమైన క్రికెట్ సంఘం అయితే కదా పట్టించుకోవడానికి..! అదే ఆస్ట్రేలియా క్రికెట్‌ సంఘం అయితే తమ క్రీడాకారులు ఎలా ఉన్నారో ప్రతి రోజూ తెలుసుకుంటుంది. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తుంది. వారికి అవసరమైన సేవలను అందిస్తుంది.. ఇది చాలు కదా! ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం ప్రోది చేయడానికి… మరి బీసీసీఐకి ఏమైంది.? బహుశా ఆగిపోయిన ఐపీఎల్‌ ఎలా కొనసాగించాలన్న ఆలోచనలో ఉండి ఉంటుంది.. జరిగిన నష్టాన్ని ఎలా పూడ్చుకోవాలో లెక్కలేసుకునే పనిలో ఉండి ఉంటుంది.. అందుకే క్రీడాకారుల గురించి ఆలోచించే తీరిక లేకపోయింది. ఇప్పుడు భారత్‌లో ఏ క్రీడా సంఘమైనా ఆటగాళ్ల క్షేమ సమాచారాలను తెలుసుకోవలసిన అవసరం ఉంది.. కరోనా సెకండ్‌వేవ్‌ విజృంభిస్తున్న ఈ తరుణంలో వారికి తామున్నామంటూ చెప్పడం అవసరం. ఒక్క క్రికెటర్లే కాదు, క్రీడాకారులందరిలోనూ ఓ రకమైన ఒత్తిడి ఉంది, భయాందోళనలు ఉన్నాయి. ఇప్పుడు టోర్నమెంట్లు లేవు, సరైనా సాధన కూడా లేదు.. భవిష్యత్తు పట్ల బెంగ తప్పకుండా ఉంటుంది..ఇది వారిపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. ముఖ్యంగా క్రికెట్‌ ఆటగాళ్లకు ఇది ఎంతో అవసరం.
భారత మహిళా క్రికెటర్‌ వేదా కృష్ణమూర్తి ఇంట్లో వరుసగా రెండు విషాదాలు చోటు చేసుకున్నాయి. కరోనా మహమ్మారి ఆమె తల్లిని, అక్కను పొట్టన పెట్టుకుంది. ఈ విషయం వేద చెప్పుకుంటూ కన్నీరు కారుస్తున్నప్పుడు మనకే ఎలాగో అనిపించింది. పుట్టెడు దుఃఖంతో ఉన్న ఆమెను ఓదార్చాలని అనిపించింది. మరి బీసీసీఐకి ఈ ఆలోచన ఎందుకు కలగలేదో అర్థం కావడం లేదు.

Also Read: ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టిన బౌలర్..! ఒకసారి కాదు రెండుసార్లు సాధించాడు.. ఎవరో తెలుసా..?

Chess Player Donation For Covid: క‌రోనాకు చెక్ పెట్టే ప‌నిలో ప‌డ్డ చెస్ ప్లేయ‌ర్స్‌.. చెక్‌మేట్ కోవిడ్ పేరుతో..

India Tour of Sri Lanka: ఉంటుందో… ఉండదో…! శ్రీలంక పర్యటనపై కొవిడ్‌ మబ్బులు…!