IPL 2021: అన్ని రంగాలపై ప్రభావం చూపినట్లే కరోనా మహమ్మారి క్రీడా రంగంపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపింది. ఈ క్రమంలోనే క్రికెట్ అభిమానులు ఎంతగానో ఇష్టపడే ఐపీఎల్ 14వ సీజన్ కూడా కరోనా కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ప్రస్తుతం కరోనా కేసులు తగ్గడంతో ఐపీఎల్‌ను తిరిగి ప్రారంభించేందుకు భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే ఐపీఎల్-14 ఫేజ్2 తేదీలను వెల్లడించింది. ఐపీఎల్ 14వ సీజన్ సెప్టెంబర్ 19 నుంచి పునఃప్రారంభం కానుంది. ఇప్పటికే ఐపీఎల్ 14వ సీజన్‌లో 29 మ్యాచ్‌లు పూర్తి అయిన సంగతి తెలిసిందే. మిగిలిన 31 మ్యాచ్‌లను యూఏఈ వేదికగా నిర్వహించనున్నారు. ఇక మెదటి మ్యాచ్ ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఓ వార్త చెన్నై సూపర్ కింగ్స్ అభిమానుల్లో జోష్‌ను పెంచుతోంది.
ఐపీఎల్ గత సీజన్‌లలో చెన్నై తరఫున ఆడిన ఆస్ట్రేలియాకు చెందిన ఫాస్ట్ బౌలర్ జోష్ హాజెల్‌వుడ్.. ఐపీఎల్ 14వ సీజన్‌కు మాత్రం దూరంగా ఉన్న విషయం తెలిసిందే. హాజెల్‌వుడ్ వ్యక్తిగత కారణాల దృష్ట్యా ఈసారి ఐపీఎల్‌కు దూరంగా ఉంటున్నానని ప్రకటించాడు. దీంతో హాజెల్‌వుడ్ లేకుండానే చెన్నై జట్టు బరిలోకి దిగింది. అయితే ఇప్పుడు తాజాగా ఈ ఆస్ట్రేలియన్ ఫాస్ట్ బౌలర్ మళ్లీ ఐపీఎల్‌లో రీఎంట్రీ ఇవ్వనున్నట్లు ప్రకటించాడు. యూఏఈ వేదికగా జరగనున్న ఐపీఎల్-14 ఫేజ్ 2లో పాల్గొనేందుకు సుముఖత వ్యక్తం చేశాడు. ఈ విషయాన్ని చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ సీఈవో కాశీ విశ్వనాథ్ కూడా ధృవీకరించాడు. ఇదిలా ఉంటే ఇటీవల వెస్టిండీస్, బంగ్లాదేశ్ పర్యటనలో ఆస్ట్రేలియా తరఫను పాల్గొన్న హాజెల్‌వుడ్ మంచి ప్రదర్శనను కనబరిచాడు. టీ20, వన్డే సిరీస్‌లో ఆడిన ఆయన ఎక్కువ వికెట్లు తీసుకున్నాడు. దీంతో ఇప్పుడు అందరి దృష్టి ఐపీఎల్‌పై పడింది. ఐపీఎల్‌లో ఎంతో కీలక పాత్ర పోషించే బౌలింగ్ విభాగంలో చెన్నై జట్టుకి మంచి ఫాస్ట్ బౌలర్ తిరిగి వస్తుండడంతో టీమ్‌పై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి.
ఇదిలా ఉంటే హాజెల్‌వుడ్ ఈ సిరీస్‌కు దూరంగా ఉంటానని ప్రకటించడంతో చెన్నై సూపర్ కింగ్స్ అతని స్థానంలో జాసన్ బెహ్రెన్‌డార్ఫ్‌ను తీసుకుంది. అయితే బెహ్రెన్ ఒక్క మ్యాచ్ కూడా ఆడకపోవడం గమనార్హం. కరోనా కారణంగా టోర్నమెంట్ వాయిదా పడడంతో బెహ్రెన్ ఈ సీజన్‌లో మ్యాచ్ ఆడలేదు. మరి ఇప్పుడు హాజెల్‌వుడ్ తిరిగి జట్టులోకి రావడంతో బెహ్రెన్‌డార్ఫ్ పరిస్థితి ఏంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జట్టు నిర్వాహకులు బెహ్రెన్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరి.
Also Read: Vizag Stell: నీతి ఆయోగ్ సీఈవోకు ఉక్కుసెగ.. దద్దరిల్లిన విశాఖలోని స్మృత్యాంజలి జంక్షన్
Bollywood : బాలీవుడ్ సెలబ్రిటీలకు మచ్చెమటలు.. ఆ వీడియోలు సేకరించిన గ్యాంగ్.. ఏకంగా 100 మంది