T20 World Cup: టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఘన విజయాన్ని నమోదు చేసుకుంది. డేవిడ్ వార్నర్ కేవలం 42 బంతుల్లో 65 పరుగులు సాధించి జట్టును విజయ తీరానికి చేర్చాడు. శ్రీలంక ఇచ్చిన 155 పరుగుల లక్ష్యాన్ని చేధించిన ఆస్ట్రేలియా 7 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీని అందుకుంది. మరో 18 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేధించింది. దీంతో ఆస్ట్రేలియా సూపర్ 12 దశలో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసుకొని టోర్నీలో దూసుకుపోతోంది.
ఇక ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్స్ పించ్, వార్నర్‌లు తొలి వికెట్‌కు 70 పరుగులు చేయడంతో మంచి ఆరంభం మొదలైంది. అనంతరం ఫించ్, మ్యాక్స్‌వెల్ ఔటైన తర్వాత వార్నర్ జోరుగా ఆడడంతో ఆస్ట్రేలియా లక్ష్యం దిశగా వేగంగా అడుగులు వేసింది.. స్మిత్ 28 పరగులు నాటౌట్‌తో మంచి ఆటతీరును కనబరిచాడు. ఇక చివర్లో మార్కస్ స్టోయినిస్ 7 బంతుల్లో 16 పరుగులతో ధీటుగా ఆడడంతో మ్యాచ్ ముగిసింది.
ఇదిలా ఉంటే అంతకు ముందు తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు నిర్ణీత 20 ఓవర్‌లలో 6 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. శ్రీలంక బ్యాట్స్‌మెన్స్‌లో కుషాల్ పెరీరా, చరిత్ అసలంక చెరో 35 పరుగులు చేయగా.. బానుక రాజపక్స 33 పరుగులతో ఆఖర్లో కీలక ఇన్నింగ్స్ ఆడాడాడు. దీంతో శ్రీలంక గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది. అయితే బౌలింగ్‌లో ఆస్ట్రేలియాను కట్టడి చేయకపోవడంతో శ్రీలంక ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది.
Also Read: T20 World Cup2021: 45 నిమిషాల పాటు కోహ్లీ బ్యాటింగ్.. కన్ను ఆర్పకుండా చూసిన ఇషాన్, శ్రేయాస్..