Video: 5 సిక్సర్లు, 3 ఫోర్లు.. 18 బంతుల్లోనే తుఫాన్ ఇన్నింగ్స్.. హాఫ్ సెంచరీతో ప్రపంచ రికార్డ్..

|

Oct 02, 2023 | 7:12 PM

Hayley Matthews: 213 పరుగుల కఠినమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వెస్టిండీస్ జట్టుకు కెప్టెన్ హేలీ మాథ్యూస్ తుఫాన్ శుభారంభం అందించింది. తొలి ఓవర్ నుంచే వేగవంతమైన బ్యాటింగ్‌ను ప్రదర్శించిన హేలీ 64 బంతుల్లో 5 భారీ సిక్సర్లు, 20 ఫోర్లతో 132 పరుగులు చేసింది. అలాగే, తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తరుపున ఎల్లిస్ పెర్రీ కేవలం 46 బంతుల్లో 4 భారీ సిక్సర్లు, 5 ఫోర్లతో 70 పరుగులు చేశాడు. 6వ స్థానంలో బరిలోకి దిగిన ఫోబ్ లిచ్‌ఫీల్డ్ తుఫాన్ బ్యాటింగ్‌ను ప్రదర్శించాడు.

Video: 5 సిక్సర్లు, 3 ఫోర్లు.. 18 బంతుల్లోనే తుఫాన్ ఇన్నింగ్స్.. హాఫ్ సెంచరీతో ప్రపంచ రికార్డ్..
Hayley Matthews
Follow us on

Hayley Matthews Half Century: సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియా మహిళల జట్టు, వెస్టిండీస్‌ మహిళల మధ్య జరుగుతున్న 2వ టీ20 మ్యాచ్‌ ఉత్కంఠభరితంగా సాగింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన వెస్టిండీస్ జట్టు కెప్టెన్ హేలీ మాథ్యూస్ బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తరుపున ఎల్లిస్ పెర్రీ కేవలం 46 బంతుల్లో 4 భారీ సిక్సర్లు, 5 ఫోర్లతో 70 పరుగులు చేశాడు. 6వ స్థానంలో బరిలోకి దిగిన ఫోబ్ లిచ్‌ఫీల్డ్ తుఫాన్ బ్యాటింగ్‌ను ప్రదర్శించింది.

ఫోబ్ వరల్డ్ రికార్డ్..

అద్భుతంగా బ్యాటింగ్ చేసిన ఫోబ్ లిచ్ ఫీల్డ్ కేవలం 18 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసింది. దీంతో మహిళల టీ20 క్రికెట్‌లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ సాధించిన న్యూజిలాండ్ క్రీడాకారిణి సోఫీ డివైన్ (18 బంతుల్లో) ప్రపంచ రికార్డును సమం చేసింది.

ఇవి కూడా చదవండి

అలాగే, ఫోబ్ లిచ్‌ఫీల్డ్ కేవలం 19 బంతుల్లో 5 భారీ సిక్సర్లు, 3 ఫోర్లతో అజేయంగా 52 పరుగులు చేయడం ద్వారా ఆస్ట్రేలియా తరపున వేగవంతమైన టీ20 అర్ధ సెంచరీ బ్యాటర్‌గా రికార్డు సృష్టించింది. ఈ తుపాన్ అర్ధ సెంచరీ సాయంతో ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది.

హేలీ మాథ్యూస్ మెరుపు సెంచరీ..

213 పరుగుల కఠినమైన లక్ష్యాన్ని ఛేదించిన వెస్టిండీస్ జట్టుకు కెప్టెన్ హేలీ మాథ్యూస్ తుఫాన్ శుభారంభం అందించింది. తొలి ఓవర్ నుంచే వేగంగా బ్యాటింగ్‌ను ప్రదర్శించిన హేలీ 64 బంతుల్లో 5 భారీ సిక్సర్లు, 20 ఫోర్లతో 132 పరుగులు చేసింది.

కాగా, వెస్టిండీస్ జట్టు 18.5 ఓవర్లలో 204 పరుగులకు ఆలౌటైంది. ఆఖరి ఓవర్లో 8 పరుగులు చేసిన వెస్టిండీస్ జట్టు 19.5 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో వెస్టిండీస్ మహిళలపై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ఇరుజట్లు:

ఆస్ట్రేలియా ప్లేయింగ్ 11: అలిస్సా హీలీ (కెప్టెన్), బెత్ మూనీ, తహ్లియా మెక్‌గ్రాత్, ఆష్లీ గార్డనర్, ఎల్లిస్ పెర్రీ, ఫోబ్ లిచ్‌ఫీల్డ్, అన్నాబెల్ సదర్లాండ్, జార్జియా వేర్‌హామ్, జెస్ జోనాస్సెన్, మేగాన్ షట్, డార్సీ బ్రౌన్.

వెస్టిండీస్ ప్లేయింగ్ 11: హేలీ మాథ్యూస్ (కెప్టెన్), షబికా గజ్నబీ, స్టెఫానీ టేలర్, రషదా విలియమ్స్ (వికెట్ కీపర్), షెమైన్ క్యాంప్‌బెల్, చినెల్లె హెన్రీ, అలియా అలెన్, జైదా జేమ్స్, షామిలియా కన్నెల్, అఫీ ఫ్లెచర్, కరిష్మా రాంహారక్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..