AUS vs IND Highlights, WTC Final 2023 Day 5: డబ్ల్యూటీసీ 2023 విజేతగా ఆస్ట్రేలియా.. టీమిండియా ఘోర పరాజయం..

|

Jun 11, 2023 | 5:21 PM

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను కైవసం చేసుకున్న టీమిండియా నేడు చరిత్ర సృష్టించే అవకాశం ఉంది. చివరి రోజు టీమ్ ఇండియాకు ఇంకా 280 పరుగులు చేయాల్సి ఉంది. విరాట్ కోహ్లీ 44, అజింక్య రహానే 20 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు. లండన్‌లో ఈరోజు ఎండలు ఎక్కువగా ఉన్నాయి.

AUS vs IND Highlights, WTC Final 2023 Day 5: డబ్ల్యూటీసీ 2023 విజేతగా ఆస్ట్రేలియా.. టీమిండియా ఘోర పరాజయం..
Aus Vs Ind Day 5 Live

AUS vs IND Highlights, WTC Final 2023 Day 5: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో టీమిండియా వరుసగా రెండోసారి ఓడిపోయింది. రోహిత్ సేన 209 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. 444 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు చివరి రోజు తొలి సెషన్‌లో 234 పరుగులకు ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్‌లో ఏ భారత బ్యాట్స్‌మెన్ కూడా 50+ పరుగులు చేయలేదు. విరాట్ కోహ్లీ (49 పరుగులు) టాప్ స్కోరర్ గా నిలిచాడు.

లండన్‌లోని ఓవల్ మైదానంలో ఆస్ట్రేలియా తన రెండో ఇన్నింగ్స్‌ను 270/8 వద్ద డిక్లేర్ చేసి భారత్‌కు 444 పరుగుల విజయ లక్ష్యాన్ని అందించింది. భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 296 పరుగులకు ఆలౌట్ కాగా, ఆస్ట్రేలియా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 469 పరుగులకు ఆలౌటైంది.

ఇరుజట్లు:

ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుస్‌చాగ్నే, స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్, కామెరాన్ గ్రీన్, అలెక్స్ కారీ(కీపర్), పాట్ కమిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్, స్కాట్ బోలాండ్.

భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, శ్రీకర్ భరత్(కీపర్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, ఉమేష్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్.

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 11 Jun 2023 05:13 PM (IST)

    రెండోసారి నిరాశే.. విశ్వ విజేతగా ఆస్ట్రేలియా..

    ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో టీమిండియా వరుసగా రెండోసారి ఓడిపోయింది. రోహిత్ సేన 209 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. 444 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు చివరి రోజు తొలి సెషన్‌లో 234 పరుగులకు ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్‌లో ఏ భారత బ్యాట్స్‌మెన్ కూడా 50+ పరుగులు చేయలేదు. విరాట్ కోహ్లీ (49 పరుగులు) టాప్ స్కోరర్ గా నిలిచాడు.

    లండన్‌లోని ఓవల్ మైదానంలో ఆస్ట్రేలియా తన రెండో ఇన్నింగ్స్‌ను 270/8 వద్ద డిక్లేర్ చేసి భారత్‌కు 444 పరుగుల విజయ లక్ష్యాన్ని అందించింది. భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 296 పరుగులకు ఆలౌట్ కాగా, ఆస్ట్రేలియా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 469 పరుగులకు ఆలౌటైంది.

  • 11 Jun 2023 04:50 PM (IST)

    8వ వికెట్ డౌన్..

    చివరి రోజు తొలి సెషన్‌లో భారత జట్టు 8 వికెట్లకు 220 పరుగులు చేసింది. శ్రీకర్ భరత్ 23 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. ప్రస్తుతం టీమిండియా విజయానికి 224 పరుగులు చేయాల్సి ఉంది.

  • 11 Jun 2023 03:40 PM (IST)

    5 వికెట్లు డౌన్..

    చివరి రోజు తొలి సెషన్‌లో భారత జట్టు ఐదు వికెట్లకు 184 పరుగులు చేసింది. అజింక్య రహానే 30 పరుగులతో, శ్రీకర్ భరత్ 4 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు. ప్రస్తుతం టీమిండియా విజయానికి 260 పరుగులు చేయాల్సి ఉంది.

    జడేజా సున్నా వద్ద ఔటయ్యాడు. అతను వికెట్ కీపర్ అలెక్స్ కారీ చేతికి చిక్కి స్కాట్ బోలాండ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. అదే ఓవర్లో 49 పరుగులు చేసి విరాట్ కోహ్లీ అవుటయ్యాడు. స్టీవ్ స్మిత్ చేతికి చిక్కాడు.

  • 11 Jun 2023 03:34 PM (IST)

    కోహ్లీ ఔట్..

    విరాట్ కోహ్లీ రూపంలో టీమిండియా 4వ వికెట్‌ను కోల్పోయింది. తన హాఫ్ సెంచరీ పూర్తి చేయకుండానే విరాట్ కోహ్లీ 49 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం భారత్ 179 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది.

  • 11 Jun 2023 02:53 PM (IST)

    వర్షం పడే ఛాన్స్..

    ఈ ఉదయం నుంచి లండన్‌లో మేఘావృతమై ఉంది. వర్షం పడే అవకాశం ఉంది. ఒకవేళ వర్షం పడి ఆదివారం మ్యాచ్‌లో ఫలితం తేలకపోతే.. సోమవారం రిజర్వ్ డే ఉపయోగిస్తారు.

  • 11 Jun 2023 02:43 PM (IST)

    మరో 280 పరుగులు..

Follow us on