
Australia vs India, Live Score: డబ్ల్యూటీసీ ఫైనల్ తుది అంకానికి చేరుకుంది. ఆసీస్ నిర్దేశించిన 444 లక్ష్య ఛేదనకు దిగిన భారత్.. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 40 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో కోహ్లీ (44), రహానె (20)ఉన్నారు. రోహిత్ శర్మ (43), గిల్ (18), పుజారా (27) పెవిలియన్ చేరారు. భారత్ విజయం సాధించాలంటే ఆఖరి రోజు 280 పరుగులు చేయాలి. డబ్ల్యూటీసీ ఫైనల్ 4వ రోజు ఆస్ట్రేలియా టీం లంచ్ సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లకు 201 పరుగులు చేసింది. అలెక్స్ కారీ 41, మిచెల్ స్టార్క్ 11 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు. ఆస్ట్రేలియా ఆధిక్యం 374 పరుగులకు చేరుకుంది. 25 పరుగుల వద్ద కామెరాన్ గ్రీన్ ఔటయ్యాడు. రవీంద్ర జడేజా బౌలింగ్‌లో అవుటయ్యాడు. మార్నస్ లాబుషెన్ 41 పరుగుల వద్ద అవుటయ్యాడు. ఉమేష్ యాదవ్ బౌలింగ్ లో ఔటయ్యాడు. జడేజాకు ఇది మూడో వికెట్.
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్‌లో తమ ఆశలను సజీవంగా ఉంచుకోవడానికి భారత్ నాలుగో రోజు ప్రారంభ సెషన్‌లో మార్నస్ లాబుస్‌చాగ్నే సవాలును ఎదుర్కోవలసి ఉంటుంది. మూడో రోజు 41 పరుగులు చేసిన తర్వాత లాబుషేన్ నాటౌట్‌గా వెనుదిరిగాడు. అదే సమయంలో, భారత బౌలర్లు ఆస్ట్రేలియా 6 వికెట్లు పడగొట్టాల్సి ఉంది.
భారత బౌలర్లు వాతావరణ మద్దతును కూడా పొందవచ్చు. లండన్‌లో ఉదయం మేఘావృతమై ఉంటుంది. దీన్ని భారత పేసర్లు సద్వినియోగం చేసుకోవాలి. వాతావరణ వెబ్‌సైట్ AccuWeather ప్రకారం, లండన్‌లో ఈరోజు కూడా వర్షం పడే అవకాశం ఉంది.
అదే సమయంలో ఇంగ్లండ్‌లోని ఓవల్ మైదానంలో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో మూడో రోజు ఆస్ట్రేలియా జట్టు భారీ ఆధిక్యంలో నిలిచింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 296 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. మార్నస్ లబుషెన్, కెమెరూన్ గ్రీన్ నాటౌట్‌గా నిలిచారు.
శుక్రవారం ఆస్ట్రేలియా జట్టు రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లకు 123 పరుగులు చేసింది. లాబుషెన్ 41, గ్రీన్ 7 పరుగులతో నాలుగో రోజు ఆస్ట్రేలియన్ ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లారు.
ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుస్‌చాగ్నే, స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్, కామెరాన్ గ్రీన్, అలెక్స్ కారీ(కీపర్), పాట్ కమిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్, స్కాట్ బోలాండ్.
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, శ్రీకర్ భరత్(కీపర్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, ఉమేష్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్.
డబ్ల్యూటీసీ ఫైనల్ నాలుగో రోజు ఆట ముగిసింది. 444 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్‌ఇండియా నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (44 ), అజింక్య రహానె (20) రన్స్ తో క్రీజులో ఉన్నారు. టీమిండియా విజయానికి ఇంకా 280 పరుగులు అవసరం.
టీమిండియా స్కోరు 150 పరుగులు దాటింది. కోహ్లీ (39), రహానే (44) నిలకడగా ఆడుతూ అభేద్యమైన నాలుగో వికెట్ కు 63 పరుగులు జోడించారు. టీమిండియా విజయానికి ఇంకా 287 పరుగులు చేయాల్సి ఉంది.
చివరి సెషన్‌లో భారత్ తన రెండో ఇన్నింగ్స్‌లో ముడు వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసింది. ప్రస్తుతం టీమిండియాకు 352 పరుగులు చేయాల్సి ఉంది.
ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్ మ్యాచ్లో భారత్‌కు 444 పరుగుల విజయ లక్ష్యం ఉంది. చివరి సెషన్‌లో భారత్ తన రెండో ఇన్నింగ్స్‌లో ఒక వికెట్ నష్టానికి 70 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ 37, చెతేశ్వర్ పుజారా 13 పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం టీమిండియాకు 374 పరుగులు చేయాల్సి ఉంది. 18 పరుగుల వద్ద శుభ్‌మన్ గిల్ ఔటయ్యాడు.
భారత్ తన రెండో ఇన్నింగ్స్‌లో ఒక వికెట్ నష్టానికి 41 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ 22 క్రీజులో ఉన్నాడు. ప్రస్తుతం టీమిండియా 403 పరుగులు చేయాల్సి ఉంది.
18 పరుగుల వద్ద శుభ్‌మన్ గిల్ ఔటయ్యాడు. స్కాట్ బోలాండ్ బౌలింగ్ లో కెమరూన్ గ్రీన్ చేతికి చిక్కాడు.
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 8 వికెట్లకు 270 పరుగులు చేసి, డిక్లెర్ చేసింది. దీంతో భారత్ ముందు 444 పరుగుల టార్గెట్ నిలిచింది.
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 7 వికెట్లకు 260 పరుగులు చేసింది. అలెక్స్ కారీ 64 పరుగులతో నిలిచాడు. మిచెల్ స్టార్క్ 33 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. దీంతో ప్రస్తుతం ఆస్ట్రేలియా ఆధిక్యం 433 పరుగులకు చేరుకుంది.
డబ్ల్యూటీసీ ఫైనల్ నాలుగో రోజు ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లకు 201 పరుగులు చేసింది. అలెక్స్ కారీ 41, మిచెల్ స్టార్క్ 11 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆస్ట్రేలియా ఆధిక్యం 374 పరుగులకు చేరింది.
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్లకు 181 పరుగులు చేసింది. అలెక్స్ కారీ 32 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఆస్ట్రేలియా ఆధిక్యం 354 పరుగులు.
25 పరుగుల వద్ద కామెరాన్ గ్రీన్ ఔటయ్యాడు. రవీంద్ర జడేజా బౌలింగ్‌లో అవుటయ్యాడు. మార్నస్ లాబుషెన్ 41 పరుగుల వద్ద అవుటయ్యాడు.
డబ్ల్యూటీసీ ఫైనల్ నాలుగో రోజు ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లకు 156 పరుగులు చేసింది. కెమరూన్ గ్రీన్ 21, అలెక్స్ కారీ 15 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆస్ట్రేలియా 329 పరుగుల ఆధిక్యంలో ఉంది.
మార్నస్ లాబుషెన్ 41 పరుగుల వద్ద అవుటయ్యాడు.
మార్నస్ లాబుషెన్ 41 పరుగుల వద్ద అవుటయ్యాడు. ఉమేష్ యాదవ్ బౌలింగ్ లో చెతేశ్వర్ పుజారా చేతికి చిక్కాడు.
మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 296 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. మార్నస్ లబుషెన్, కెమెరూన్ గ్రీన్ నాటౌట్‌గా నిలిచారు.
భారత బౌలర్లు వాతావరణ మద్దతును కూడా పొందవచ్చు. లండన్‌లో ఉదయం మేఘావృతమై ఉంటుంది. దీన్ని భారత పేసర్లు సద్వినియోగం చేసుకోవాలి. వాతావరణ వెబ్‌సైట్ AccuWeather ప్రకారం, లండన్‌లో ఈరోజు కూడా వర్షం పడే అవకాశం ఉంది.
శుక్రవారం ఆస్ట్రేలియా జట్టు రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లకు 123 పరుగులు చేసింది. లాబుషెన్ 41, గ్రీన్ 7 పరుగులతో నాలుగో రోజు ఆస్ట్రేలియన్ ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లారు.