AUS vs ENG:బజ్ బాల్ అంటే ఇదేనా బాబూ? 11 రోజుల్లోనే ప్యాకప్ చెప్పేశారు..ఆస్ట్రేలియా దెబ్బకు ఇంగ్లాండ్ మైండ్ బ్లాక్

AUS vs ENG: ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా అడిలైడ్‌లో ముగిసిన మూడో టెస్టులో కంగారూ జట్టు 82 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ గెలుపుతో సిరీస్‌లో 3-0 ఆధిక్యాన్ని సాధించింది.

AUS vs ENG:బజ్ బాల్ అంటే ఇదేనా బాబూ? 11 రోజుల్లోనే ప్యాకప్ చెప్పేశారు..ఆస్ట్రేలియా దెబ్బకు ఇంగ్లాండ్ మైండ్ బ్లాక్
Aus Vs Eng

Updated on: Dec 21, 2025 | 12:48 PM

AUS vs ENG: ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా అడిలైడ్‌లో ముగిసిన మూడో టెస్టులో కంగారూ జట్టు 82 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ గెలుపుతో సిరీస్‌లో 3-0 ఆధిక్యాన్ని సాధించడమే కాకుండా, మరో రెండు టెస్టులు మిగిలి ఉండగానే ప్రతిష్ఠాత్మక ఎషెస్‌ ట్రోఫీని తమ వద్దే పదిలం చేసుకుంది. కేవలం 11 రోజుల వ్యవధిలోనే సిరీస్‌ను తేల్చేసి ఇంగ్లాండ్‌ను కోలుకోలేని దెబ్బ తీసింది.

అడిలైడ్‌లో జరిగిన ఈ పోరులో ఆస్ట్రేలియా నిర్దేశించిన 435 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన ఇంగ్లాండ్, ఆఖరి వరకు పోరాడి 352 పరుగులకు కుప్పకూలింది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ కాసేపు ప్రతిఘటించినా, ఆసీస్ బౌలర్ల ధాటికి వారు ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు. ఆస్ట్రేలియా పేస్ దళం ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్ క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ ఇంగ్లాండ్‌ను ఒత్తిడిలోకి నెట్టారు. చివరి సెషన్‌లో స్కాట్ బోలాండ్ మెరుపులు మెరిపించడంతో ఆస్ట్రేలియా విజయం నల్లేరుపై నడకలా మారింది.

ఈ మ్యాచ్ విజయానికి ప్రధాన కారకుడు వికెట్ కీపర్ బ్యాటర్ అలెక్స్ క్యారీ. తొలి ఇన్నింగ్స్‌లో కీలక సమయంలో సెంచరీ (106) బాదిన క్యారీ, రెండో ఇన్నింగ్స్‌లోనూ వేగంగా 72 పరుగులు చేసి ఆసీస్‌కు భారీ స్కోరు అందించాడు. బ్యాటింగ్‌లోనే కాకుండా వికెట్ల వెనుక 6 అద్భుతమైన క్యాచ్‌లు పట్టి జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు. అతడితో పాటు రెండో ఇన్నింగ్స్‌లో ట్రావిస్ హెడ్ (170) ఆడిన మెరుపు ఇన్నింగ్స్ ఇంగ్లాండ్ బౌలర్ల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో ఆస్ట్రేలియా క్లినికల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది.

ఈ సిరీస్ గెలుపు ఆస్ట్రేలియా ఆధిపత్యానికి నిదర్శనం. పెర్త్‌లో జరిగిన తొలి టెస్టును కేవలం 2 రోజుల్లోనే ముగించిన ఆసీస్, బ్రిస్బేన్ రెండో టెస్టును 4 రోజుల్లో, అడిలైడ్ మూడో టెస్టును 5వ రోజున పూర్తి చేసింది. అంటే కేవలం 11 రోజుల ఆటలోనే సిరీస్ విజేతగా నిలిచింది. 2017-18 సీజన్ నుంచి వరుసగా ఐదు ఎషెస్‌ సిరీస్‌లను ఆస్ట్రేలియా గెలుచుకోవడం ఒక రికార్డు. ఇంగ్లాండ్ కెప్టెన్ స్టోక్స్ వేసిన వ్యూహాలేవీ కమిన్స్ సేన ముందు ఫలించలేదు. మిగిలిన రెండు టెస్టుల్లో కూడా విజయం సాధించి క్లీన్ స్వీప్ చేయాలని కంగారూలు పట్టుదలగా ఉన్నారు.

 

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..