
England vs Australia, 1st T20I: సౌతాంప్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ ట్రావిస్ హెడ్ సందడి చేశాడు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిపోయినప్పటికీ.. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టుకు ట్రావిస్ హెడ్, మాథ్యూ షార్ట్ తుఫాన్ ఆరంభాన్ని అందించారు. ట్రావిస్ హెడ్ మొదటి ఓవర్ నుంచి బౌండరీల వర్షం కురిపించాడు. సిక్స్-ఫోర్లతో దంచి కొట్టాడు.
పవర్‌ప్లే 5వ ఓవర్‌లో ట్రావిస్ హెడ్ చెలరేగడంతో.. ఒకే ఓవర్‌లో 30 పరుగులు పిండుకున్నాడు. సామ్ కరన్ వేసిన ఈ ఓవర్ తొలి రెండు బంతుల్లో హెడ్ బ్యాట్ నుంచి ఫోర్లు వచ్చాయి. ఆ తర్వాత సిక్స్‌ల హ్యాట్రిక్‌తో రెచ్చిపోయాడు. అనంతరం మరో ఫోర్ కొట్టి మొత్తం 30 పరుగులు రాబట్టాడు. ఈ తుఫాన్ బ్యాటింగ్ సాయంతో ట్రావిస్ హెడ్ కేవలం 19 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
अभी तो चौका मारा है,
चक्का तो अभी बाकि है,
आगाज देखा है आपने अंजाम तो,
अभी बाकी है !
Travis Head vs Sam Curran –4.1 – 4
4.2 – 4
4.3 – 6
4.4 – 6
4.5 – 6
4.6 – 4#TravisHead #ENGvsAUS #SRH #OrangeArmy #IPL2025 pic.twitter.com/arbQoecyvK— kamlesh choudhary (@kamlesh81666873) September 12, 2024
అలాగే ట్రావిస్ హెడ్ 23 బంతుల్లో 4 భారీ సిక్సర్లు, 8 ఫోర్లతో 59 పరుగులు చేశాడు. హెడ్ ఈ తుఫాన్ ఆరంభాన్ని అందించినప్పటికీ, ఆస్ట్రేలియా జట్టు 19.3 ఓవర్లలో 179 పరుగులకు ఆలౌటైంది. 180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టుకు ఆశించిన ఆరంభం లభించలేదు. ఓపెనర్ విల్ జాక్స్ కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అరంగేట్రం చేసిన జోర్డాన్ కాక్స్ ఇన్నింగ్స్ 17 పరుగులకే పరిమితమైంది. అలాగే కెప్టెన్ ఫిల్ సాల్ట్ 20 పరుగుల వద్ద పెవిలియన్ కు వెనుదిరిగాడు.
ఫలితంగా ఇంగ్లండ్ జట్టు 19.2 ఓవర్లలో 151 పరుగులకు ఆలౌటైంది. దీంతో మూడు టీ20ల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు 28 పరుగుల తేడాతో విజయం సాధించింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..