టిమ్ డేవిడ్(Tim david) పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగుతోంది. ఈ కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ తుఫాన్ బ్యాటింగ్‌కు పేరుగాంచాడు. ఐపీఎల్ 2022లో అద్భుత ప్రదర్శన తర్వాత టిమ్ డేవిడ్.. ప్రస్తుతం టీ20 బ్లాస్ట్‌లో విధ్వసం చేస్తున్నాడు. లంకేయులు తరపున ఆడుతోన్న ఈ బ్యాట్స్‌మెన్.. బుధవారం యార్క్‌షైర్ బౌలర్లపై దాడి చేసి 32 బంతుల్లో 66 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. తొలుత బ్యాటింగ్ చేసిన యార్క్‌షైర్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. అనంతరం యార్క్‌షైర్ జట్టు 209 పరుగులు మాత్రమే చేసి, నాలుగు పరుగుల తేడాతో ఓడిపోయింది.
పవర్‌ఫుల్ హిట్టింగ్..
మొదట బ్యాటింగ్ చేసిన యార్క్‌షైర్ వికెట్ కీపర్ ఫిల్ సాల్ట్ త్వరగానే పెవిలియన్ చేరాడు. అయితే కీటన్ జెన్నింగ్స్, స్టీవెన్ క్రాఫ్ట్ 72 పరుగుల భాగస్వామ్యంతో జట్టును రక్షించారు. ఆ తర్వాత, 10వ ఓవర్‌లో, స్టీవెన్ క్రాఫ్ట్ 41 పరుగుల వద్ద ఔటయ్యాడు. లంకాషైర్ తుఫాను బ్యాట్స్‌మెన్ లియామ్ లివింగ్‌స్టన్ కేవలం 2 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. ఇక ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన టిమ్ డేవిడ్.. యార్క్‌షైర్ బౌలర్లపై బలమైన దాడి చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో 6 సిక్సులు, 4 ఫోర్లు బాదేశాడు. 32 బంతుల్లో 66 పరుగులతో నాటౌట్‌గా నిలిచి, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఈ క్రమంలో వికెట్ల చుట్టూ వేగంగా షాట్లు ఆడుతూ, నెట్టింట్లో హల్ చల్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డేవిడ్ కొట్టిన షాట్లు చూసి ప్రేక్షకులు కూడా ఆశ్చర్యపోయారు. టిమ్ డేవిడ్, కెప్టెన్ డాన్ విలాస్‌తో కలిసి జట్టును 200 దాటించారు.
T20 బ్లాస్ట్‌లో టిమ్ డేవిడ్ ప్రదర్శన..
ఈ సీజన్‌లో ఇప్పటివరకు లాంక్షైర్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా టిమ్ డేవిడ్ నిలిచాడు. ఈ కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ 44 సగటుతో 264 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ కూడా 190కి చేరువలో ఉంది. డేవిడ్ బ్యాట్‌లో ఇప్పటి వరకు 19 సిక్సర్లు, 17 ఫోర్లు ఉన్నాయి. టిమ్ డేవిడ్ ఇలాగే రాణిస్తే త్వరలో ఆస్ట్రేలియా జట్టులో కనిపించే ఛాన్స్ ఉంది. టిమ్ డేవిడ్ ఆస్ట్రేలియా టీ20 జట్టులోకి వస్తే.. స్టీవ్ స్మిత్ టీ20 ప్రపంచకప్ ఆడడం కష్టమే.
6⃣6⃣ (32): 4×4, 6×6 ?
Just another day in the office for @timdavid8 ?#OneFamilypic.twitter.com/sn3pna77qp
— Mumbai Indians (@mipaltan) June 9, 2022