Video: తొలి ఓవర్‌లోనే సిరాజ్‌కు కోపం తెప్పించిన ఆసీస్ ప్లేయర్.. కట్‌చేస్తే.. 16వ బంతికి దిమ్మతిరిగే షాక్

|

Dec 01, 2024 | 12:58 PM

Mohammed Siraj vs Matt Renshaw: ఆస్ట్రేలియాతో అడిలైడ్ టెస్టుకు ముందు, కాన్‌బెర్రాలో ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్‌తో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడేందుకు టీమ్ ఇండియా రంగంలోకి దిగింది. అయితే, ఈ మ్యాచ్‌లో సిరాజ్‌ చాలా కోపంగా కనిపించాడు. ఆ వివరాలేంటో ఓసారి చూద్దాం..

Video: తొలి ఓవర్‌లోనే సిరాజ్‌కు కోపం తెప్పించిన ఆసీస్ ప్లేయర్.. కట్‌చేస్తే.. 16వ బంతికి దిమ్మతిరిగే షాక్
Mohammed Siraj Vs Matt Renshaw
Follow us on

Mohammed Siraj vs Matt Renshaw: డిసెంబర్ 6 నుంచి అడిలైడ్‌లో భారత్, ఆస్ట్రేలియా మధ్య పింక్ బాల్ టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు భారత జట్టు కాన్‌బెర్రాలో ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్‌తో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతోంది. ఈ మ్యాచ్ రెండో రోజు మహ్మద్ సిరాజ్ కొత్త బంతితో ఆస్ట్రేలియా ఓపెనర్ మాట్ రెన్‌షాను పెవిలియన్‌కు పంపాడు. సిరాజ్ ముందు రెన్షా ఇబ్బంది పడుతూ కనిపించాడు. సిరాజ్‌కి కోపం తెప్పించిన తరువాత.. తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి వచ్చింది.

మొదటి రోజు వర్షం కారణంగా కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రెండో రోజు 50-50 ఓవర్ల మ్యాచ్‌లో ఇరుజట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన భారత్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. సిరాజ్ దాడి ప్రారంభించాడు. ఇన్నింగ్స్ మొదటి ఓవర్‌లోనే, సిరాజ్ రెన్షా యాక్షన్ పట్ల అసంతృప్తిగా కనిపించాడు. ఇది మొదటి ఓవర్‌లో చోటు చేసుకుంది. సిరాజ్ అసంతృప్తిగా కనిపించాడు. అయితే ఆ తర్వాత మ్యాచ్ ముందుకు సాగుతున్న కొద్దీ ఈ విషయం సీరియస్‌గా మారింది. సిరాజ్ ఓవర్ చివరి రెండు బంతుల్లో పరుగులు చేయడానికి రెన్షాకు ఎటువంటి అవకాశం ఇవ్వలేదు.

ఇవి కూడా చదవండి

రెన్‌షా ఎలా బయటపడ్డాడు?

సిరాజ్ వేసిన తొలి ఓవర్లో ఆస్ట్రేలియా ఖాతాలో ఒక్క పరుగు మాత్రమే చేరింది. 5 బంతులు ఆడినా రెన్‌షా ఖాతా తెరవలేకపోయాడు. అతను సిరాజ్ బంతుల ముందు ఇబ్బంది పడ్డాడు. రెన్‌షా తన ఇన్నింగ్స్‌లోని 16వ బంతికి సిరాజ్ వేసిన బంతికి రెండో స్లిప్‌లో దేవదత్ పడిక్కల్‌కి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. రెన్‌షా కేవలం 5 పరుగులు మాత్రమే చేయగలిగాడు.

12 పరుగుల స్కోరు వద్ద ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్ తొలి దెబ్బ తగిలింది. 4.5 ఓవర్లలో రెన్షాను సిరాజ్ అవుట్ చేశాడు. అతను తన ఓవర్ చివరి బంతికి ఫోర్ కొట్టవలసి వచ్చింది. జాడెన్ గుడ్విన్ ఫోర్ కొట్టాడు. ఆకాష్‌దీప్ తర్వాతి ఓవర్‌లో దాడికి దిగాడు. కానీ, అతని ఓవర్‌లో మూడు బంతుల తర్వాత వర్షం కారణంగా ఆటను నిలిపివేయాల్సి వచ్చింది. దీంతో మ్యాచ్‌లో ఓవర్లలో కోత విధించారు. ఇప్పుడు ఇరు జట్లు 46-46 ఓవర్లు ఆడనున్నాయి. అనంతరం ఆట మొదలైంది. ఈ క్రమంలో వార్త రాసే సమయానికి పీఎంఎక్స్‌ఐ టీం 39 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసింది. సామ్ కాన్స్టాస్ అద్భుత ఆటతో ఆకట్టుకున్నాడు. భారత బౌలర్లను ఎదుర్కొని సెంచరీ చేసి పెవిలయిన్ చేరాడు. ఇక భారత బౌలర్లలో హర్షిత్ రానా 4 వికెట్లు తీయగా, ఆకాష్ దీప్ 2, సిరాజ్, ప్రసిద్ద్ తలో వికెట్ తీశారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..