ప్రతీ ప్లేయర్‌కు క్రికెట్ కెరీర్ అంత ఈజీగా కొనసాగదు. ఎన్నో ఎత్తుపల్లాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. చాలామంది ప్లేయర్స్ డొమెస్టిక్ క్రికెట్‌తో రిటైర్‌మెంట్ ప్రకటించగా.. మరికొందరు జాతీయ జట్టులో రెండు లేదా మూడు మ్యాచ్‌లకు చోటు దక్కించుకుని కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన సందర్భాలు లేకపోలేదు. ఇప్పుడు మీకు ఓ ప్లేయర్ గురించి చెప్పబోతున్నాం. ఆ ఆటగాడి అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ కేవలం 17 రోజుల్లో ముగిసింది. చివరిగా టీమిండియాతో మ్యాచ్ ఆడాడు. అంతే!.. ఆ నెక్స్ట్ రిటైర్‌మెంట్ ప్రకటించాడు. తన కెరీర్‌లో ఆడింది కేవలం 3 టెస్టులే. మరి అతడెవరో తెలుసుకుందామా..
అతడెవరో కాదు ఆస్ట్రేలియన్ ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ కోప్‌ల్యాండ్. ఈ కోప్‌ల్యాండ్ ఫాస్ట్ బౌలర్ కావడానికి ముందు మొదటిగా వికెట్ కీపర్. దేశవాళీ టోర్నమెంట్లలో కోప్‌ల్యాండ్ వికెట్ కీపర్‌గా కొనసాగుతున్న సమయంలో.. అతడి కోచ్ ఫాస్ట్ బౌలర్‌గా మారాలని సలహా ఇచ్చాడు. ముఖ్యంగా కోప్‌ల్యాండ్ 1.95 మీటర్ల పొడవు ఉండటంతో ఇందుకు కారణం. ఇక కోచ్ ఇచ్చిన సలహా మేరకు అతడు ఆ విధంగా ప్రయత్నించి.. సఫలమయ్యాడు. కానీ ఫాస్ట్ బౌలర్‌గా అతడి కెరీర్ దేశవాళీ క్రికెట్‌లో కొనసాగినంత కాలం, అంతర్జాతీయ క్రికెట్‌లో మాత్రం కొనసాగలేదు.
36 ఏళ్ల ట్రెంట్ కోప్‌ల్యాండ్ తన ఫస్ట్ క్లాస్ క్రికెట్ కెరీర్‌లో 112 మ్యాచ్‌లు ఆడి.. 410 వికెట్లు పడగొట్టాడు. అలాగే 29 లిస్ట్-A మ్యాచ్‌ల్లో 41 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. “ప్రస్తుత సీజన్ ప్రారంభానికి ముందే నా రిటైర్‌మెంట్ గురించి ఆలోచించాను. నాకు ఇప్పుడు 37 ఏళ్లు. నేను వైదొలగడానికి ఇదే సరైన సమయం. యువ ఫాస్ట్ బౌలర్లు మరిన్ని అవకాశాలు ఇవ్వాలి. క్రికెట్‌లో నేను సాధించిన విజయాలకు చాలా గర్వంగా ఉంది’ అని రిటైర్మెంట్ ప్రకటించిన సమయంలో కోప్‌ల్యాండ్ పేర్కొన్నాడు. కాగా, ఆస్ట్రేలియా తరఫున ఆడిన 3 టెస్టుల్లో ట్రెంట్ కోప్‌ల్యాండ్ కేవలం 6 వికెట్లు పడగొట్టాడు. 2011లో శ్రీలంకతో తన సొంతగడ్డపై మూడు టెస్టులు ఆడాడు. 31 ఆగష్టు 2011న తన టెస్ట్ అరంగేట్రం చేసిన కోప్‌ల్యాండ్.. 16 సెప్టెంబర్ 2011న చివరి మ్యాచ్ ఆడాడు. కేవలం 17 రోజుల్లో తన అంతర్జాతీయ కెరీర్‌కు ఫుల్‌స్టాప్ పెట్టాడు.
???
A huge thanks to Will Sutherland & all at @cricketvictoria for such a lovely gesture. ✊? https://t.co/0BIWwBc3q8
— Trent Copeland (@copes9) March 5, 2023