IND vs Aus Match: టీ20 ప్రపంచకప్‌తో పాటు భారత పర్యాటకు సంబంధించి ఆస్ట్రేలియా జట్టును ప్రకటించింది. 15 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును ప్రకటించారు. ఆరోన్ ఫించ్ కెప్టెన్సీ బాధ్యతలను స్వీకరించనున్నాడు. ఈ నెలలో భారత్, ఆస్ట్రేలియా పర్యటన జరగనుండగా, అక్టోబర్-నవంబర్‌లో టీ 20 ప్రపంచకప్ జరగనున్న విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా జట్టులో ఒక మార్పు కనిపిస్తోంది. ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ భారత్ పర్యటనలో ఆడటం లేదు. అతని స్థానంలో కామెరాన్ గ్రీన్ ఎంపికయ్యాడు.
గతేడాదిలో యూఏఈలో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో పాల్గొన్న జట్టే ఈసారి టీ20 ప్రపంచకప్‌లో పాల్గొననుంది. అయితే ఇండియా టూర్‌లో మాత్రం వార్నర్‌కు విశ్రాంతినిచ్చారు. ఇదిలా ఉంటే భారత్ పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా టీమిండియాతో 3 టీ 20 మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. మూడు మ్యాచ్‌లను సెప్టెంబర్ 20,23,25 తేదీల్లో మొహాలీ, నాగ్‌పూర్, హైదరాబాద్‌లో జరగనున్నాయి. ఇక టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా మ్యాచ్ అక్టోర్ 22 నుంచి ప్రారంభంకానుంది.
ఆరోన్ ఫించ్ (కెప్టెన్), పాట్ కమిన్స్ (వైఎస్ కెప్టెన్), టిమ్ డేవిడ్, అష్టన్ అగర్, జోష్ హేజిల్‌వుడ్, జోస్ ఇంగ్లిస్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, కేన్ రిచర్డ్‌సన్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..