World Cup 2023: భారత్‌లో ఆ ఫుడ్‌ టేస్ట్ చేయాలని ఉంది.. మనసులో మాట చెప్పిన విదేశీ క్రికెటర్స్‌

ఇదిలా ఉంటే ఈ ఏడాది ప్రపంచకప్‌ నిర్వహణను భారత్‌ చేపడుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వివిధ దేశాలకు చెందిన క్రికెటర్లకు భారత్‌కు చేరుకుంటున్నారు. తమ మ్యాచ్‌ల ప్రారంభకంటే ముందే భారత్‌కు ఒక్కొక్కరిగా చేరుకుంటున్నారు. ఇప్పటికే పాకిస్థాన్‌తో పాటు పలు దేశాల క్రికెటర్లకు భారత గడ్డపై అడుగుపెట్టారు. ఇక క్రమంలోనే విదేశీ ప్లేయర్స్‌ భారత మీడియాతో సరదాగా మాట్లాడుతూ సందడి చేస్తున్నారు...

World Cup 2023: భారత్‌లో ఆ ఫుడ్‌ టేస్ట్ చేయాలని ఉంది.. మనసులో మాట చెప్పిన విదేశీ క్రికెటర్స్‌
Cricketers About Food

Updated on: Oct 05, 2023 | 9:53 AM

Icc World Cup 2023: పురుషుల క్రికెట్ ప్రపంచ కప్‌ 2023కి సర్వం సిద్ధమైంది. యావత్ ప్రపంచ క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చేసింది. గురువారం (అక్టోబర్ 5వ) నుంచి ప్రపంచకప్‌ 2023 ప్రారంభమవుతోన్న విషయం తెలిసిందే. ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌ల మధ్య తొలి మ్యాచ్‌ గుజరాత్ వేదికగా జరుగనున్న విషయం తెలిసిందే. దీంతో ఇప్పటికే ఇరు జట్ల ప్లేయర్స్‌ గుజరాత్‌ చేరుకున్నారు.

ఇదిలా ఉంటే ఈ ఏడాది ప్రపంచకప్‌ నిర్వహణను భారత్‌ చేపడుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వివిధ దేశాలకు చెందిన క్రికెటర్లకు భారత్‌కు చేరుకుంటున్నారు. తమ మ్యాచ్‌ల ప్రారంభకంటే ముందే భారత్‌కు ఒక్కొక్కరిగా చేరుకుంటున్నారు. ఇప్పటికే పాకిస్థాన్‌తో పాటు పలు దేశాల క్రికెటర్లకు భారత గడ్డపై అడుగుపెట్టారు. ఇక క్రమంలోనే విదేశీ ప్లేయర్స్‌ భారత మీడియాతో సరదాగా మాట్లాడుతూ సందడి చేస్తున్నారు. భారత్‌లో ప్రపంచకప్‌ ఆడుతుండడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నరు. ఇందులో భాగంగానే తాజాగా ఆస్ట్రేలియా, శ్రీలంకకు చెందిన కొందరు ప్లేయర్స్‌ భారత్‌లో తమకు ఇష్టమైన ఆహారం గురించి అభిప్రాయాలను పంచుకున్నారు.

ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఆస్ట్రేలియన్‌ ప్లేయర్స్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌, స్టీవ్‌ స్మిత్‌, మిచెల్‌ మార్ష్‌లకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. భారత్‌లో తాము బటర్‌ నాన్‌, బటర్‌ చికెన్‌, గులాబ్‌జామ్‌ తినడానికి ఆసక్తిగా ఉన్నామని చెప్పుకొచ్చారు. మెజారిటీ సభ్యులు బటర్‌ నాన్‌, బటర్‌ చికెన్‌కు ఓటు వేయడం విశేషం. ఇదిలా ఉంటే భారత ప్రజలకు కూడా బటర్‌ నాన్‌, బటర్‌ చికెన్‌ ప్రియులనే విషయం తెలిసిందే.

మార్కస్‌ స్టోయినిస్‌ తనకు గులాజ్‌ జామ్‌ తినాలని ఉందని చెప్పుకొచ్చాడు. “బటర్ చికెన్, నాన్‌లను ఎవరు ఇష్టపడరు?!” అనే క్యాప్షన్‌తో ఐసీసీ పోస్ట్ చేసిన ఈ వీడియో తెగ వైరల్‌ అవుతోంది. ఇక శ్రీలంకకు చెందిన క్రికెటర్లు సైతం తమ అభిప్రాయాలను పంచుకున్నారు. శ్రీలంక ప్లేయర్స్‌ జాబితాలో గుజరాతీ థాలీ, చికెన్‌ టిక్కా, బటర్‌ నాన్‌ విత్‌ బటర్‌ చికెన్ డిషెస్‌ ఉన్నాయి.

కాగా ఈరోజు ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌ మ్యాచ్‌తో ప్రపంచకప్‌ 2023 ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఇక మంగళవారం జరిగిన వామప్‌ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ విజయం సాధించింది. ఇక అక్టోబర్ 8వ తేదీన చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ఆస్ట్రేలియా, భారత్‌ తలపడనున్న విషయం తెలిసిందే.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..