Big Bash League: 24 ఫోర్లు, 4 సిక్సర్లు.. 64 బంతుల్లో 154 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడిన ఆసీస్ ఆటగాడు ఎవరంటే..

| Edited By: Ravi Kiran

Jan 20, 2022 | 7:01 AM

టీ -20 క్రికెట్ అంటేనే ధనాధన్ బ్యాటింగ్ కు మారుపేరు. మొదటి ఓవర్ నుంచే ఫోర్లు, సిక్స్ ల  బాదేందుకు బ్యాటర్లు ప్రయత్నిస్తారు.   ప్రస్తుతం ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న బిగ్ బాష్ లీగ్ లోనూ బ్యాటర్ల హవా

Big Bash League: 24 ఫోర్లు, 4 సిక్సర్లు.. 64 బంతుల్లో 154 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడిన ఆసీస్ ఆటగాడు ఎవరంటే..
Big Bash League Glenn Maxwell
Follow us on

టీ -20 క్రికెట్ అంటేనే ధనాధన్ బ్యాటింగ్ కు మారుపేరు. మొదటి ఓవర్ నుంచే ఫోర్లు, సిక్స్ ల  బాదేందుకు బ్యాటర్లు ప్రయత్నిస్తారు.   ప్రస్తుతం ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న బిగ్ బాష్ లీగ్ లోనూ బ్యాటర్ల హవా కొనసాగుతోంది. తాజాగా ఆసీస్ స్టార్ ఆటగాడు గ్లెన్ మ్యాక్స్ వెల్ బీబీఎల్ లో పెను విధ్వంసం సృష్టించాడు.   మెల్‌బోర్న్ స్టార్స్ జట్టకు నాయకత్వం వహిస్తోన్న అతను బుధవారం  హాబ‌ర్ట్ హరికేన్స్ తో జ‌రిగిన మ్యాచ్‌లో భారీ సెంచరీ సాధించాడు. ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోస్తూ కేవలం 41 బంతుల్లోనే సెంచరీ మార్కు అందుకున్న అతను మొత్తం మీద 64 బంతుల్లో 154 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతని తుఫాన్ ఇన్నింగ్స్ లో  24 ఫోర్లు, 4 సిక్స్‌లు ఉన్నాయి.  ఈ ఇన్నింగ్స్ తో  బిగ్‌బాష్ లీగ్ చ‌రిత్ర‌లోనే వ్య‌క్తిగ‌తంగా  అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాడిగా మ్యాక్సీ రికార్డు సృష్టించాడు.  అంతేకాదు ఈ టోర్నీలో అతి తక్కువ బంతుల్లో సెంచరీ చేసిన రెండో ఆటగాడిగా మరో గుర్తింపు సొంతం చేసుకున్నాడు.

106 పరుగుల తేడాతో ..

కాగా మ్యాక్స్‌వెల్ మెరుపు ఇన్నింగ్స్‌కు స్టోయినిస్ (75) తోడు అవడంతో మొదట బ్యాటింగ్ చేసిన మెల్ బోర్న్ స్టార్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లోరెండు వికెట్ల న‌ష్టానికి 273 ప‌రుగుల భారీ స్కోర్ సాధించింది.  ఇప్ప‌టి వ‌ర‌కు  బిగ్‌బాష్ లీగ్‌లో ఇదే అత్య‌ధిక స్కోర్ కావ‌డం విశేషం.  274 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన హరికేన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి కేవలం 167 పరుగుల మాత్రమే చేయగలిగింది. దీంతో 106 పరుగుల  తేడాతో భారీ విజయం సొంతం చేసుకుంది మెల్ బోర్న్ స్టార్స్.

Also Read: Delhi: దొరికిపోతానేమోనని ఫోన్ మింగేసిన ఖైదీ.. 10 రోజుల తర్వాత ఎలా బయటకు తీశారంటే..

Bedroom Vastu Tips: ఈ వాస్తు దోషాలు మీకు నిద్ర లేకుండా చేస్తాయి.. అవేంటో ఇప్పుడే తెలుసుకోండి..

Gas Geyser: ఇంట్లో గ్యాస్ గీజర్ వాడుతున్నారా.. ఇవి తప్పక తెలుసుకోండి.. లేకుంటే ప్రమాదంలో పడే ఛాన్స్..