Asian Games 2023: టీమిండియా కెప్టెన్‌గా ధోని శిష్యుడు.. ఐపీఎల్ ప్లేయర్లకే పట్టం కట్టిన బీసీసీఐ..!

|

Jul 15, 2023 | 11:46 AM

Asian Games 2023: చైనాలోని హాంగ్‌జౌ వేదికగా జరగనున్న 2023 ఆసియా క్రీడల టోర్నీలో తొలి సారిగా భారత పురుషుల క్రికెట్ జట్టు ఆడబోతున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు బీసీసీఐ శుక్రవారం ఆసియా క్రీడలకు వెళ్లే భారత ‘బి’ జట్టును ప్రకటించింది. ఆసియా క్రీడల్లో క్రికెట్ టీ20 ఫార్మాట్‌లో జరగబోతుండగా....

Asian Games 2023: టీమిండియా కెప్టెన్‌గా ధోని శిష్యుడు.. ఐపీఎల్ ప్లేయర్లకే పట్టం కట్టిన బీసీసీఐ..!
Team India For Asian Games
Follow us on

Asian Games 2023: చైనాలోని హాంగ్‌జౌ వేదికగా జరగనున్న 2023 ఆసియా క్రీడల టోర్నీలో తొలి సారిగా భారత పురుషుల క్రికెట్ జట్టు ఆడబోతున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు బీసీసీఐ శుక్రవారం ఆసియా క్రీడలకు వెళ్లే భారత ‘బి’ జట్టును ప్రకటించింది. ఆసియా క్రీడల్లో క్రికెట్ టీ20 ఫార్మాట్‌లో జరగబోతుండగా.. భారత్ నుంచి వెళ్లే జట్టుకు చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ సారథ్య బాధ్యతలు నిర్వహించనున్నాడు. ఇంకా ఈ టీమ్‌లో తెలుగు ప్లేయర్ తిలక్ వర్మ సహా తాజా ఐపీఎల్ సీజన్‌లో మెరుగ్గా రాణించిన పలువురు ప్లేయర్లకు అవకాశం దక్కింది.

సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 8 వరకు జరిగే ఆసియా క్రీడల కోసం.. పంజాబ్ కింగ్స్ జట్టులోని ఇద్దరు వికెట్ కీపర్‌లకూ బీసీసీఐ పిలుపునిచ్చింది. ఈ మేరకు జితేష్ శర్మ, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ కూడా భారత జట్టులో భాగమయ్యారు. అలాగే వెస్టిండీస్‌తో శుక్రవారం ముగిసిన తొలి టెస్ట్‌ ద్వారా ఆరంగేట్ర మ్యాచ్‌లోనే సెంచరీ(171) చేసిన యశస్వీ జైస్వాల్‌కి కూడా అవకాశం దక్కింది. ఇంకా రాహుల్ త్రిపాఠి, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్, శివమ్ మావి, శివమ్ దూబే వంటి ఐపీఎల్ యువ ప్లేయర్లకు కూడా బీసీసీఐ అవకాశం ఇచ్చింది.

ఇవి కూడా చదవండి

కాగా, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా వంటి సీనియర్ ఆటగాళ్లు.. భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి నవంబర్ 23 వరకు జరిగే ప్రపంచ కప్ 2023 టోర్నీ కోసం కట్టుబడి ఉన్నందున ఆసియా క్రీడలకు వెళ్లే భారత జట్టులో కనిపించడం లేదు. ఇదే సమయంలో ఆసియా క్రీడల కోసం ఎంపికైన యువ ఆటగాళ్లకు బీసీసీఐ దృష్టిలో పడేందుకు ఇది సువర్ణావకాశం అని చెప్పుకోవాలి. వీరంతా ఐపీఎల్‌లో కనబర్చిన ప్రదర్శనను ఆసియా క్రీడల్లో కూడా కనబరిస్తే జాతీయ జట్టులో స్థానం లభించడం ఖాయం.

ఆసియా క్రీడల కోసం భారత జట్టు: రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), యశస్వీ జైస్వాల్, రాహుల్ త్రిపాఠి, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్, శివమ్ మావి, శివమ్ దూబే, ప్రభ్‌సిమ్రాన్ సింగ్(వికెట్ కీపర్)

స్టాండ్‌బై ఆటగాళ్లు: యశ్ ఠాకూర్, సాయి కిషోర్, వెంకటేష్ అయ్యర్, దీపక్ హుడా, సాయి సుదర్శన్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..