Asia Cup 2023: పాకిస్తాన్‌లోనే ఆసియా కప్.. మద్దతిచ్చిన బంగ్లాదేశ్, శ్రీలంక..

|

May 16, 2023 | 9:49 PM

PCB: ఆసియా కప్‌ను నిర్వహణపై భారత్ వర్సెస్ పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తత కొనసాగుతోంది. ఇటీవల, BCCI పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రతిపాదించిన హైబ్రిడ్ మోడల్‌ను తిరస్కరించింది.

Asia Cup 2023: పాకిస్తాన్‌లోనే ఆసియా కప్.. మద్దతిచ్చిన బంగ్లాదేశ్, శ్రీలంక..
Ind Vs Pak
Follow us on

Asia Cup 2023, Hybrid Model: ఆసియా కప్‌ను నిర్వహణపై భారత్ వర్సెస్ పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తత కొనసాగుతోంది. ఇటీవల, BCCI పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రతిపాదించిన హైబ్రిడ్ మోడల్‌ను తిరస్కరించింది. ఈ నమూనా ప్రకారం, పాకిస్తాన్ ఆసియా కప్‌ను నిర్వహించేది, కానీ.. టీమ్ ఇండియా మ్యాచ్‌లు మాత్రం వేరే దేశంలో ఆడేది. అయితే, ఇప్పుడు పీసీబీకి కాస్త ఊరట లభించిందనే వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు, శ్రీలంక క్రికెట్ బోర్డులు PCB కొత్త హైబ్రిడ్ మోడల్‌పై అంగీకరించినట్లు నివేదికలు వస్తున్నాయి.

పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కొత్త హైబ్రిడ్ మోడల్ ఏమిటి?

మొదటి ప్రతిపాదన..

ఆసియా కప్ టోర్నమెంట్ పాకిస్థాన్‌లో నిర్వహించబడుతుంది. అయితే భారత జట్టు మ్యాచ్‌లు మాత్రం తటస్థ వేదికలో ఆడుతుంది.

రెండవ ప్రతిపాదన..

ఆసియా కప్ టోర్నీని రెండు భాగాలుగా విభజించనున్నారు. తొలి రౌండ్ మ్యాచ్‌లకు పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనుండగా.. ఈ రౌండ్‌లో భారత్‌తో మ్యాచ్‌లు ఉండవు. ఇక రెండో రౌండ్‌లో భారత జట్టు ఆడుతుంది. అలాగే టోర్నీ ఫైనల్ మ్యాచ్ తటస్థ వేదికపై జరుగుతుంది.

ఇవి కూడా చదవండి

అయితే బీసీసీఐ స్టాండ్ ఏంటంటే?

అదే సమయంలో, ఈ విషయంలో, బీసీసీఐకి సంబంధించిన అధికారులు ఇప్పటివరకు ఎలాంటి ప్రతిపాదనను ఓకే చేయలేదు. అయితే రానున్న రోజుల్లో వైఖరిలో మార్పు వచ్చే అవకాశం ఉంది. టోర్నీ తటస్థ వేదికగా జరగాలని కోరుకుంటున్నాం, యూఏఈలో నిర్వహించడం ఇష్టం లేదంటూ పీసీబీ చెప్పుకొచ్చింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..