Asia Cup Controversy: మనోళ్లను ఉగ్రవాదులతో పోల్చిన పాక్ అధికారి..నవ్వుకున్న నఖ్వీ.. వీడియో వైరల్

ఆసియా కప్ 2025 వివాదం మరింత ముదురుతోంది. భారత్, పాకిస్తాన్‌ల మధ్య క్రికెట్ ట్రోఫీకి సంబంధించి మొదలైన ఘర్షణ ఇప్పుడు అభ్యంతరకరమైన వ్యాఖ్యల స్థాయికి చేరుకుంది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్, ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధిపతి అయిన మొహ్సిన్ నఖ్వీ తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు.

Asia Cup Controversy: మనోళ్లను ఉగ్రవాదులతో పోల్చిన పాక్ అధికారి..నవ్వుకున్న నఖ్వీ.. వీడియో వైరల్
Asia Cup Controversy

Updated on: Oct 24, 2025 | 2:50 PM

Asia Cup Controversy: ఆసియా కప్ 2025 వివాదం మరింత ముదురుతోంది. భారత్, పాకిస్తాన్‌ల మధ్య క్రికెట్ ట్రోఫీకి సంబంధించి మొదలైన ఘర్షణ ఇప్పుడు అభ్యంతరకరమైన వ్యాఖ్యల స్థాయికి చేరుకుంది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్, ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధిపతి అయిన మొహ్సిన్ నఖ్వీ తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో మొత్తం క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ట్రోఫీని ఎత్తుకెళ్లిన దొంగగా కొందరు పేర్కొంటున్న నఖ్వీ సమక్షంలో కొందరు వ్యక్తులు భారత ఆటగాళ్లను ఉగ్రవాదులు అంటూ సంబోధించడం తీవ్ర కలకలం రేపింది.

2025 ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్, పాకిస్థాన్‌ను ఓడించి టైటిల్ గెలుచుకుంది. అయితే, మ్యాచ్ తర్వాత భారత జట్టు ట్రోఫీని స్వీకరించడానికి నిరాకరించడంతో వివాదం మొదలైంది. దుబాయ్‌లో నిర్వహించిన ట్రోఫీ సమర్పణ వేడుకలో పాల్గొనడానికి బీసీసీఐ నిరాకరించినట్లు వార్తలు వచ్చాయి. దీనికి ఏసీసీ చీఫ్ మొహ్సిన్ నఖ్వీ స్పందిస్తూ.. భారత జట్టు సభ్యులు దుబాయ్‌లోని అధికారిక కార్యక్రమంలో వ్యక్తిగతంగా వచ్చి ట్రోఫీని తీసుకుంటేనే ఇస్తామని స్పష్టం చేశారు. అప్పటి నుంచి ట్రోఫీ ఏసీసీ కార్యాలయంలోనే ఉండిపోయింది. రెండు బోర్డుల మధ్య ఉద్రిక్తత కొనసాగుతోంది.

తాజాగా, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో మొహ్సిన్ నఖ్వీ పక్కన నిలబడిన ఒక వ్యక్తి భారత్‌కు వ్యతిరేకంగా తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఆ వ్యక్తి వీడియోలో.. “భారత జట్టు ట్రోఫీని తీసుకోనప్పుడు మా ఛైర్మన్ ఓపిక పట్టారు. కానీ తర్వాత ఆ జట్టును ఉగ్రవాదులు లాగా నిర్వహించారు. పాకిస్థాన్ హోంమంత్రి అయిన నఖ్వీ, ట్రోఫీని కారులో ఉంచి తీసుకువచ్చారు. ఇప్పుడు మొత్తం భారతదేశం ట్రోఫీ వెనుక పడుతోంది” అని వ్యాఖ్యానించాడు. షాకింగ్ విషయం ఏంటంటే.. ఈ వ్యక్తి అభ్యంతరకరంగా మాట్లాడుతున్న సమయంలో మొహ్సిన్ నఖ్వీ నవ్వుతూ కనిపించారు. ఆయన ఆ వ్యాఖ్యలను ఏమాత్రం ఖండించలేదు. ఈ వ్యవహారం భారత క్రికెట్ అభిమానులు, నిపుణుల్లో తీవ్ర ఆగ్రహాన్ని, అసంతృప్తిని పెంచింది.

మొహ్సిన్ నఖ్వీ ఈ వ్యాఖ్యలపై మౌనంగా ఉండటం అంటే, ఆ అభ్యంతరకర భాషను ఆయన పరోక్షంగా సమర్థించినట్లేనని క్రికెట్ నిపుణులు అంటున్నారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో బీసీసీఐ, ఐసీసీ స్పందన కోసం అంతా ఎదురుచూస్తున్నారు. ఈ ట్రోఫీ వివాదంపై వచ్చే నెలలో జరగనున్న ఐసీసీ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉందని సమాచారం. ఈ సమావేశంలో బీసీసీఐ తన అభ్యంతరాన్ని తీవ్రంగా తెలియజేసి పీసీబీ నుండి అధికారికంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

 

 

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..