
Virat Kohli Record: 2025 ఆసియా కప్‌నకు రంగం సిద్ధమైంది. మెగా టోర్నమెంట్‌కు ఇంకా నెల రోజులే మిగిలి ఉంది. ఈ టోర్నమెంట్‌లో టాప్ స్కోరర్ విరాట్ కోహ్లీని మిస్ అవుతామనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ క్రమంలో కోహ్లీ ఓ భారీ రికార్డులలో ఒకటి బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇందుకోసం విరాట్ కోహ్లీ 14 సంవత్సరాలుగా టీ20 క్రికెట్‌లో కష్టపడ్డాడు. అయితే, ఓ టీం ఇండియా ప్లేయర్ కేవలం 83 టీ20 అంతర్జాతీయ మ్యాచ్ లలో ఈ ఘనత సాధించేందుకు సిద్ధంగా ఉన్నాడు.
2025 ఆసియా కప్ సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభమవుతుంది. ఈ టోర్నమెంట్ చివరి మ్యాచ్ సెప్టెంబర్ 28న జరుగుతుంది. భారత జట్టు గురించి చర్చలు తారాస్థాయికి చేరుకున్నాయి. నివేదికల ప్రకారం, టీం ఇండియా జట్టును త్వరలో ప్రకటించనున్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టీ20 ప్రపంచ కప్ ఛాంపియన్లుగా నిలిచిన తర్వాత టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలికారు. కానీ, వారిద్దరూ ఆసియా కప్‌లో అత్యధిక పరుగులు సాధించిన వారిలో టాప్-5లో ఉన్నారు.
విరాట్ కోహ్లీ 2010 నుంచి 2024 వరకు 14 సంవత్సరాల కెరీర్‌లో 125 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి 16 ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ టైటిళ్లను గెలుచుకున్నాడు. ఈ సంఖ్యను చేరుకోవడానికి అతనికి 14 సంవత్సరాలు పట్టింది. కానీ, టీం ఇండియా ప్రస్తుత T20I కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కేవలం 83 మ్యాచ్‌లలో ఈ సంఖ్యను చేరుకున్నాడు. ఇప్పుడు అతను ఆసియా కప్‌లో విరాట్‌ను అధిగమించగలడు.
టీ20ల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను గెలుచుకున్న వారిలో సూర్యకుమార్ యాదవ్ మూడో స్థానంలో ఉన్నాడు. ఇప్పటివరకు, ఇన్ని తక్కువ మ్యాచ్‌ల్లో ఇన్ని అవార్డులు గెలుచుకున్న ఆటగాడు లేడు. జింబాబ్వేకు చెందిన సికందర్ రజా 17 అవార్డులు గెలుచుకున్నాడు. కానీ, ఇందుకోసం అతను 109 మ్యాచ్‌లు ఆడాడు. మలేషియాకు చెందిన వీరన్‌దీప్ సింగ్ అత్యధికంగా 22 అవార్డులు గెలుచుకుని ఇప్పటివరకు 102 మ్యాచ్‌లు ఆడాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..