
India vs Pakistan Highlights, Asia Cup 2025, Todays Match Latest Updates: ఆసియా కప్ 2025లో భారత జట్టు పాకిస్థాన్‌పై వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం రాత్రి జరిగిన రెండో సూపర్-4 మ్యాచ్‌లో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో పాకిస్థానీలను ఓడించింది.
దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ నిర్దేశించిన 172 పరుగుల లక్ష్యాన్ని 18.5 ఓవర్లలో 4 వికెట్లకు ఛేదించింది.
ఆసియా కప్ 2025లో భారత్ వర్సెస్ పాకిస్తాన్ మరోసారి తలపడనున్నాయి. ఈసారి సూపర్ ఫోర్ మ్యాచ్. టోర్నమెంట్‌లో ఇరు జట్ల మధ్య ఇది రెండవ మ్యాచ్ అవుతుంది. గతంలో, ఈ రెండు జట్లు గ్రూప్ దశలో తొలిసారి తలపడ్డాయి. అక్కడ భారత జట్టు పాకిస్థాన్‌ను ఓడించింది. భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య సూపర్ ఫోర్ మ్యాచ్ కూడా దుబాయ్‌లో జరుగుతోంది.
ఇది భారత్, పాకిస్తాన్ మధ్య జరుగుతున్న 15వ టీ20 మ్యాచ్. దీనికి ముందు జరిగిన 14 టీ20 మ్యాచ్‌లలో భారత్ పాకిస్తాన్‌పై 11-3 ఆధిక్యంలో ఉంది. టీ20 ఆసియా కప్‌లో ఇప్పటివరకు జరిగిన నాలుగు మ్యాచ్‌లలో రికార్డు 2-2తో సమంగా ఉంది. వన్డే ఫార్మాట్‌తో సహా, ఆసియా కప్ చరిత్రలో భారత్, పాకిస్తాన్ 20 సార్లు తలపడ్డాయి, భారత్ 11 సార్లు, పాకిస్తాన్ 6 సార్లు గెలిచాయి. మూడు మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి.
భారత్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సంజు శాంసన్(కీపర్), సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.
పాకిస్థాన్ (ప్లేయింగ్ XI): సైమ్ అయూబ్, సాహిబ్జాదా ఫర్హాన్, ఫఖర్ జమాన్, సల్మాన్ అఘా(కెప్టెన్), హుస్సేన్ తలత్, మహ్మద్ హారీస్(కీపర్), మహ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, హారీస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్.
ఆసియా కప్ 2025లో భారత జట్టు పాకిస్థాన్‌పై వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం రాత్రి జరిగిన రెండో సూపర్-4 మ్యాచ్‌లో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో పాకిస్థానీలను ఓడించింది.
దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ నిర్దేశించిన 172 పరుగుల లక్ష్యాన్ని 18.5 ఓవర్లలో 4 వికెట్లకు ఛేదించింది.
భారత జట్టు 16 ఓవర్లలో 3 వికెట్లకు 145 పరుగులు చేసింది.
భారత జట్టు 12.2 ఓవర్లలో 3 వికెట్లకు 123 పరుగులు చేసింది. తిలక్ వర్మ క్రీజులో ఉన్నారు. అభిషేక్ 24 బంతుల్లో తన అర్ధ సెంచరీని చేరుకున్నాడు.
తొలి వికెట్ కోల్పొయిన భారత్, గిల్ అవుట్, 47 పరుగుల దగ్గర గిల్ అవుట్
9 ఓవర్లకు స్కోరు 101/0. అభిషేక్ శర్మ (56), గిల్ (44) పరుగులతో ఉన్నారు.
దంచికొడుతున్న ఓపెనర్లు.. అభిషేక్ 50తో దూసుకుపోతున్నాడు.
సైమ్ అయూబ్ వేసిన ఆరో ఓవర్‌లో శుభ్‌మన్ గిల్ రెండు, అభిషేక్ శర్మ ఒక ఫోర్ బాదారు.
దూకుడు చూపిస్తున్న ఓపెనర్లు.. ఇండియా స్కోర్ 50-0
మూడో ఓవర్‌లోనూ రెండు ఫోర్లు, సిక్స్ , క్యాచ్ ఔట్ నుంచి తప్పించుకున్న అభిషేక్
క్రీజులో అభిషేక్ శర్మ 10, శుభ్‌మన్ గిల్ 21, మూడు ఓవర్లకు భారత్ స్కోరు 31-0
అదరగొట్టిన ఓపెనర్లు.. ఓపెనర్లుగా వచ్చిన అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్ తదైనా బ్యాటింగ్ తో ఆకట్టుకున్నారు. రెండు ఓవర్లకు 19 పరుగులు చేశారు.
తొలి బంతికే సిక్స్ కొట్టాడు అభిషేక్ శర్మ .. అదిరిపోయే సిక్స్ ఇది
20 ఓవర్లు ముగిసే సరికి పాకిస్తాన్ జట్టు 5 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. దీంతో భారత జట్టు ముందు 172 పరుగుల టార్గెట్ నిలిచింది.
18 ఓవర్లు ముగిసేసరికి పాకిస్తాన్ 146/4తో ఉంది. మహ్మద్ నవాజ్, కెప్టెన్ సల్మాన్ అలీ అఘా క్రీజులో ఉన్నారు.
14.1 ఓవర్లకు పాకిస్తాన్ 115/4తో ఉంది. మహ్మద్ నవాజ్, కెప్టెన్ సల్మాన్ అలీ అఘా క్రీజులో ఉన్నారు. సాహిబ్జాదా ఫర్హాన్ 58 పరుగుల వద్ద ఔటయ్యాడు.
13.1 ఓవర్ల తర్వాత పాకిస్తాన్ 110/3తో ఉంది. సాహిబ్‌జాదా ఫర్హాన్ క్రీజులో ఉన్నాడు. ఫర్హాన్ 34 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తలక్ 10 పరుగులు చేసి కుల్దీప్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు.
11వ ఓవర్ వేసిన శివం దుబే భారత్ కు రెండో వికెట్ అందించ్చాడు. శివం దూబే బౌలింగ్ లో సాయిమ్ అయూబ్ షాట్ మిస్సవ్వడంతో అభిషేక్ శర్మకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. బ్యాక్-ఆఫ్-లెంగ్త్ డెలివరీలో సాయిమ్ భారీ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. కానీ అదనపు బౌన్స్ టాప్ ఎడ్జ్ కు దారితీసింది. బంతి లాంగ్ లెగ్ లో నిలబడి ఉన్న అభిషేక్ శర్మ వైపు వెళ్ళింది. అభిషేక్ క్యాచ్ తీసుకోవడానికి డైవ్ చేశాడు. అభిషేక్ గతంలో రెండు క్యాచ్ లు వదిలాడు.
10 ఓవర్లు ముగిసేసరికి పాకిస్తాన్ 91/1తో ఉంది. సాహిబ్‌జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్ క్రీజులో ఉన్నారు. ఫర్హాన్ 34 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. భారత ఫీల్డర్లు ఇప్పటివరకు మూడు క్యాచ్‌లు వదులుకున్నారు.
8 ఓవర్లు ముగిసేసరికి పాకిస్తాన్ స్కోరు 70/1గా ఉంది. సాహిబ్‌జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్ క్రీజులో ఉన్నారు.
పవర్ ప్లే ముగిసే సరికి పాక్ జట్టు ఒక వికెట్ కోల్పోయి 55 పరుగులు చేసింది.
4 ఓవర్లు ముగిసేసరికి పాకిస్తాన్ 36/1తో ఉంది. సాహిబ్‌జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్ క్రీజులో ఉన్నారు.
ఫఖార్ జమాన్ (15) రూపంలో పాక్ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. హార్దిక్ పాండ్యా భారత జట్టుకు తొలి వికెట్ అందించాడు. శాంసన్ అద్భుత క్యాచ్‌తో పాక్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది.
రెండు ఓవర్లు ముగిసేసరికి పాకిస్తాన్ స్కోరు 17/0గా నిలిచింది. సాహిబ్‌జాదా ఫర్హాన్, ఫఖర్ జమాన్ క్రీజులో ఉన్నారు.
హార్దిక్ తొలి ఓవర్ బౌలింగ్ చేశాడు. అయితే, ఫర్హాన్ ఇచ్చిన సింపుల్ క్యాచ్‌ను అభిషేక్ శర్మ మిస్ చేశాడు. దీంతో తొలి ఓవర్‌లో 6 పరుగులు పాక్ ఖాతాలో చేరాయి.
టీం ఇండియా ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ అభిషేక్ శర్మ ఆసియా కప్‌లో రికార్డు సృష్టించవచ్చు. అతను ఇప్పటికే T20I లలో 46 సిక్సర్లు కొట్టాడు. అతను మరో నాలుగు సిక్సర్లు కొడితే, అతి తక్కువ మ్యాచ్‌లలో 50 సిక్సర్లు కొట్టిన ప్రపంచంలోనే మొదటి బ్యాట్స్‌మన్ అవుతాడు.
టాస్ సమయంలో టీమిండియా కెప్టెన్ మరోసారి పాక్ కెప్టెన్‌కు కరచాలనం చేయలేదు. ఇదే విషయంపై ఇప్పటి వరకు ఎన్నో చర్యలు పాకిస్తాన్ చేపట్టినా, ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో మ్యాచ్ తర్వాత కూడా ఇదే పరిస్థితి కొనసాగునుందని తెలుస్తోంది.
ప్లేయింగ్ ఎలెవన్‌లో భారత్ రెండు మార్పులు చేసింది. జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి తిరిగి ప్లేయింగ్ ఎలెవన్‌లోకి వచ్చారు. ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆడిన హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్‌లను జట్టులోకి తీసుకోలేదు.
అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సంజు శాంసన్(కీపర్), సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.
సూపర్‌లో భాగంగా పాకిస్తాన్ జట్టుతో జరుగుతోన్న సూపర్ 4 మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ గెలిచాడు. దీంతో ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు.
దుబాయ్‌లో ప్రస్తుతం చాలా వేడిగా ఉంది. మ్యాచ్ సమయంలో ఉష్ణోగ్రత 35 నుంచి 36 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుందని అంచనా. దుబాయ్‌లో రాత్రిపూట ఉష్ణోగ్రత తగ్గుతుంది. మైదానంలో మంచు కురుస్తుంది. దీని వలన స్కోరును కాపాడుకోవడం కష్టమవుతుంది.
దుబాయ్ క్రికెట్ స్టేడియంలోని పిచ్ ఇప్పటివరకు నెమ్మదిగా ఉంది. ఈ పిచ్‌పై స్పిన్నర్లు పెద్ద ముప్పుగా మారవచ్చు. ఈ టోర్నమెంట్‌లో, దుబాయ్‌లో జరిగిన ఆరు మ్యాచ్‌లలో రెండవసారి బ్యాటింగ్ చేసిన జట్టు నాలుగు గెలిచింది.
పాకిస్థాన్‌తో జరిగే సూపర్-4 మ్యాచ్ కోసం భారత జట్టు దుబాయ్ స్టేడియం చేరుకుంది.
#WATCH | Asia Cup 2025 Super 4 | Team India arrives at Dubai International Cricket Stadium for their match against Pakistan. pic.twitter.com/VZAjnu62s0
— ANI (@ANI) September 21, 2025
ఇప్పటివరకు, దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన T20 మ్యాచ్‌లలో భారత్ వర్సెస్ పాకిస్తాన్ నాలుగుసార్లు తలపడ్డాయి. రెండు జట్లు చెరో రెండు మ్యాచ్‌లను గెలుచుకున్నాయి. ఇక్కడ జరిగిన మొదటి భారతదేశం-పాకిస్తాన్ పోటీ 2021 టీ20 ప్రపంచ కప్‌లో జరిగింది. పాకిస్తాన్ 10 వికెట్ల తేడాతో గెలిచింది. ఆ తర్వాత, 2022 టీ20 ఆసియా కప్‌లో రెండు జట్లు రెండుసార్లు తలపడ్డాయి. భారత జట్టు ఒక మ్యాచ్‌ను గెలుచుకోగా, పాకిస్తాన్ ఒక మ్యాచ్‌ను గెలుచుకుంది. ఆ తర్వాత, ప్రస్తుత ఆసియా కప్ గ్రూప్ రౌండ్‌లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ కూడా జరిగింది. భారత జట్టు ఆ మ్యాచ్ ను 7 వికెట్ల తేడాతో గెలుచుకుంది. ఇక్కడ జరిగిన నాలుగు మ్యాచ్‌లలో, తరువాత బ్యాటింగ్ చేసిన జట్టు గెలిచింది.
ఓపెనర్ అభిషేక్ శర్మ అత్యధికంగా 99 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ శుభ్‌మాన్ గిల్ 3 మ్యాచ్‌ల్లో 35 పరుగులు మాత్రమే చేయగలిగాడు. సంజు సామ్సన్ స్థానంలో గిల్‌కు ఓపెనింగ్ ఇచ్చారు. సామ్సన్ ఒకే ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసి 56 పరుగులు చేసి గిల్ కంటే ముందు నిలిచాడు.
ఈ టోర్నమెంట్‌లో భారత్ హ్యాట్రిక్ విజయాలు సాధించింది. అయినప్పటికీ, జట్టులో కొన్ని సమస్యలు తలెత్తాయి. మూడు మ్యాచ్‌ల తర్వాత కూడా, టోర్నమెంట్‌లో ఏ భారత బ్యాట్స్‌మన్ కూడా 100 పరుగులు పూర్తి చేయలేకపోయాడు.
భారత్-పాకిస్తాన్ మ్యాచ్ కు ఆండీ పైక్రాఫ్ట్ మ్యాచ్ రిఫరీగా వ్యవహరించనున్నారు. మరి ఈ మ్యాచ్‌లో కరచాలనం జరుగుతుందా లేదా అని అంతా వేచి చూస్తున్నారు.
భారత్-పాకిస్తాన్ మ్యాచ్ సమయంలో ఆండీ పైక్రాఫ్ట్ మ్యాచ్ రిఫరీగా వ్యవహరిస్తారు. చివరిసారిగా ఈ రెండు జట్లు తలపడినప్పుడు ఆయనే మ్యాచ్ రిఫరీగా వ్యవహరించారు. కరచాలన వివాదం తర్వాత , పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పైక్రాఫ్ట్ పై తీవ్రమైన ఆరోపణలు చేసి , టోర్నమెంట్ నుంచి అతన్ని తొలగించాలని డిమాండ్ చేసింది.
భారత్‌తో జరిగే మ్యాచ్ కోసం పాకిస్తాన్ జట్టులో కొన్ని ప్రధాన మార్పులు చూడవచ్చు. సామ్ అయూబ్ ఇప్పటివరకు పూర్తిగా విఫలమయ్యాడు. వరుసగా మూడు మ్యాచ్‌లలో 0 పరుగులకే ఔటయ్యాడు. అందువల్ల, అతన్ని టాప్ ఆర్డర్ నుంచి కిందకు పంపవచ్చు.
టీ20 ఆసియా కప్ సూపర్ 4 దశలో టీం ఇండియా ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడింది. ఈ మూడు మ్యాచ్‌లు 2022 టీ20 ఆసియా కప్ సందర్భంగా జరిగాయి. ఈ మ్యాచ్‌లలో భారత్ ఒక మ్యాచ్‌లో మాత్రమే గెలిచి రెండు ఓటములతో టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది.
India vs Pakistan Live Score: పురుషుల T20I లలో అత్యధిక డకౌట్లు అయిన పాకిస్తాన్ బౌలర్ గా అబ్దుల్లా షఫీక్ రికార్డు సృష్టించాడు. వరుసగా నాలుగు ఇన్నింగ్స్ లలో డకౌట్ గా ఔటయ్యాడు. 2025 ఆసియా కప్ లో సామ్ అయూబ్ మూడుసార్లు ఇలా చేశాడు. భారత్ తో జరిగిన సూపర్ ఫోర్ లో కూడా అతను డకౌట్ అయితే, అతను పాకిస్తాన్ రికార్డును సమం చేస్తాడు.
India vs Pakistan Live Score: భారత్‌తో జరిగే సూపర్ ఫోర్ మ్యాచ్ కోసం పాకిస్తాన్ తమ జట్టులో అనేక మార్పులు చేసే అవకాశం ఉంది. పాకిస్తాన్ ప్లేయింగ్ ఎలెవన్ నుంచి హసన్ నవాజ్‌ను తొలగించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. అతని స్థానంలో హుస్సేన్ తలత్ రావొచ్చు. ఫఖర్ జమాన్, హారిస్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించవచ్చు. సామ్ అయూబ్ మూడవ స్థానంలో ఆడవచ్చు.
India vs Pakistan Live Score: భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగే సూపర్ ఫోర్ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8:00 గంటలకు ప్రారంభమవుతుంది. టాస్ అరగంట ముందుగా, భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7:30 గంటలకు జరుగుతుంది.
Ind vs Pak Live Updates: ఆసియా కప్‌లో భారత్, పాకిస్తాన్ జట్లు 21వ సారి తలపడనున్నాయి. గతంలో ఆడిన 20 మ్యాచ్‌ల్లో భారత్ 11 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, పాకిస్తాన్ 6 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఈ రెండు జట్ల మధ్య జరిగిన మూడు మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి.
Ind vs Pak Live Score: ఈసారి, ఇండియా వర్సెస్ పాకిస్తాన్ జట్లు T20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో 15వ సారి తలపడనున్నాయి. గత 14 మ్యాచ్‌ల ఫలితాలు భారత్‌కు 11-3తో అనుకూలంగా ఉన్నాయి.
సూపర్ ఫోర్ లో భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ లో టాస్ కీలకం కానుంది. దుబాయ్ లోనే భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన గత నాలుగు T20I లు ఛేజింగ్ జట్టు విజయానికి దారితీశాయి. ఇరు జట్ల మధ్య జరిగిన చివరి తొమ్మిది T20I లలో, ఛేజింగ్ జట్టు ఎనిమిదింటిలో గెలిచింది.
India vs Pakistan Live Score: పాకిస్థాన్‌తో జరిగే సూపర్ 4 మ్యాచ్‌లో సంజు శాంసన్, హార్దిక్ పాండ్యా ప్రధాన మైలురాళ్లను సాధించే ఛాన్స్ ఉంది. శాంసన్ ఇంకా 83 పరుగులు చేస్తే టీ20ల్లో భారతదేశం తరపున 1,000 పరుగులు చేసిన 12వ ఆటగాడిగా నిలిచే అవకాశం ఉంది. హార్దిక్ పాండ్యా టీ20లో 100 వికెట్లు తీయడానికి నాలుగు అడుగుల దూరంలో ఉన్నాడు.
అభిషేక్ శర్మ, శుభమన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, సంజు శాంసన్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా.