IND vs UAE: ఏం గుండెరా అది.. బుమ్రా అనుకున్నావా.. బచ్చా బౌలర్ అనుకున్నావా? అదేం కొట్టుడు..
ఆసియా కప్ 2025లో భారత్-యూఏఈ మ్యాచ్‌లో, ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర బౌలర్‌గా పేరొందిన జస్ప్రీత్ బుమ్రా ఒకే ఓవర్‌లో యూఏఈ కెప్టెన్ మొహమ్మద్ వసీమ్‌కు 12 పరుగులు ఇచ్చాడు. వసీమ్ మూడు బౌండరీలు కొట్టడంతో బుమ్రా ఓవర్ ఖరీదైంది. అయితే, భారత జట్టు ఘన విజయం సాధించింది.

ప్రపంచ క్రికెట్‌లోనే మోస్ట్ డేంజరస్ బౌలర్ ఎవరంటే.. వందలో 90 మంది చెప్పే పేరు జస్ప్రీత్ బుమ్రా. ఫార్మాట్ ఏదైనా.. సిచ్యూవేషన్ ఎలా ఉన్నా.. ఎదురుగా ఎలాంటి బ్యాటర్ ఉన్నా.. అది పాత బాలైనా, కొత్త బాలైనా.. పిచ్ ఎలా ఉన్నా.. సూపర్ బౌలింగ్‌తో బ్యాటర్లను బెంబేలెత్తించే సత్తా ఉన్నా బౌలర్. అలాంటి బుమ్రాను ఎదుర్కొనేందుకు ప్రపంచంలోని ప్రతి బ్యాటర్ భయపడతాడు. కానీ, తాజాగా ఓ పసికూన జట్టు కెప్టెన్ మాత్రం బుమ్రా అంటే ఏ మాత్రం బెదురులేకుండా బ్యాటింగ్ చేశాడు. బుమ్రా వేసిన ఓ ఓవర్‌లో ఏకంగా మూడు ఫోర్లు కొట్టాడు. అవి కూడా అడ్డిగుడ్డి బ్యాటింగ్‌తో కాకుండా ప్రాపర్ క్రికెటింగ్ షాట్లతో ఆ బౌండరీలు రాబట్టాడు.
ఆసియా కప్ 2025లో భాగంగా బుధవారం భారత్, యూఏఈ మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. పసికూన యూఏఈని పూర్తిగా డామినేట్ చేస్తూ వరల్డ్ ఛాంపియన్ హోదాకు తగ్గట్లు ఆడింది. అయితే ఈ మ్యాచ్లో జస్ప్రీత్ బుమ్రా వేసిన ఇన్నింగ్స్ 6వ ఓవర్‌లో తొలి బంతికే యూఏఈ కెప్టెన్ మొహమ్మద్ వసీమ్ అద్భుతమైన బౌండరీ కొట్టాడు. ఆ తర్వాత చివరి రెండు బంతుల్లో రెండు ఫోర్లు కొట్టాడు. మొత్తంగా ఒకే ఓవర్‌లో మూడు సూపర్ బౌండరీలతో ఏకంగా 12 పరుగులు రాబట్టాడు.
మొత్తం 3 ఓవర్లలు వేసిన బుమ్రా 19 పరుగులు చేసి ఒక వికెట్ తీసుకున్నాడు. అయితే 19 పరుగుల్లో బుమ్రా 12 పరుగులు ఒకే ఓవర్లో ఇచ్చాడు. మిగిలిన రెండు ఓవర్లలో కేవలం 7 రన్స్ మాత్రమే ఇచ్చాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన యూఏఈని టీమిండియా బౌలర్లు కేవలం 57 పరుగులకే ఆలౌట్ చేశారు. ఆ తర్వాత ఛేజింగ్‌కు దిగి కేవలం 4.3 ఓవర్లలోనే ఒక్క వికెట్ కోల్పోయి 60 పరుగులు కొట్టేశారు భారత టాప్ ఆర్డర్ బ్యాటర్లు. ఓపెనర్ అభిషేక్ శర్మ యూఏఈని వణికించాడు. కేవలం 16 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సులతో 30 పరుగులు చేసి దడదడలాడించాడు. అలాగే గిల్ 9 బంతుల్లో 20, కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ 2 బంతుల్లో 7 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి మ్యాచ్ ముగించారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




