
India vs Sri Lanka Records: ఆదివారం కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరిగిన ఆసియా కప్ 2023 ఫైనల్లో శ్రీలంకపై భారత్ 10 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. మహ్మద్ సిరాజ్ ఊచకోతతో భారత్ టాస్ ఓడిపోయినప్పటికీ శ్రీలంకను ఘోరంగా ఓడించింది. 10 వికెట్ల తేడాతో లంకను ఓడించి, 8వ సారి ఆసియా కప్ విజేతగా నిలిచింది. ఈ క్రమంలో ఎన్నో రికార్డులను సృష్టించింది.
అతిపెద్ద ODI విజయం: ఆసియా కప్ 2023 ఫైనల్లో శ్రీలంకపై ఛేజింగ్‌లో భారత్ అత్యుత్తమ విజయాన్ని నమోదు చేసింది. భారత్, శ్రీలంక మధ్య ఆసియా కప్ 2023 ఫైనల్‌లో బద్దలైన అన్ని ప్రధాన రికార్డులను ఇప్పుడు చూద్దాం.
భారత్ ఎనిమిదోసారి ఆసియా కప్ ట్రోఫీని దక్కించుకుంది. దీంతో ఆసియా కప్ చరిత్రలో అత్యధికంగా ట్రోఫీ గెలిచిన జట్టుగా నిలిచింది.
𝙒𝙃𝘼𝙏. 𝘼. 𝙒𝙄𝙉! 😎
A clinical show in the summit clash! 👌👌
A resounding 10-wicket win to clinch the #AsiaCup2023 title 👏👏
Well done, #TeamIndia! 🇮🇳#INDvSL pic.twitter.com/M9HnJcVOGR
— BCCI (@BCCI) September 17, 2023
మహ్మద్ సిరాజ్ 16 బంతుల్లో ఐదు వికెట్లు తీసిన చమిందా వాస్ (v BAN, 2003)తో సంయుక్తంగా అత్యంత వేగవంతమైన ODI ఐదు వికెట్ల రికార్డును సమం చేశాడు.
శ్రీలంక ఆటగాడు అజంతా మెండిస్ తర్వాత 50 వన్డే వికెట్లు (1002 బంతుల్లో) అత్యంత వేగంగా సాధించిన రెండో బౌలర్‌గా సిరాజ్ నిలిచాడు.
వన్డేల్లో సిక్స్ వికెట్లు తీసిన 11వ భారత బౌలర్‌గా సిరాజ్ నిలిచాడు.
సిరాజ్ 21 పరుగులకు 6 వికెట్లు పడగొట్టడం ఒక భారతీయ బౌలర్ సాధించిన నాల్గవ అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలుగా నమోదయ్యాయి. వన్డే క్రికెట్‌లో ఓవరాల్‌గా 31వది.
వన్డేల్లో ఒకే ఓవర్‌లో నాలుగు వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా, ఓవరాల్‌గా నాలుగో స్థానంలో నిలిచాడు సిరాజ్.
15.2 ఓవర్లలో 50 పరుగులకే ఆలౌట్ అయిన తర్వాత ఆసియా కప్ వన్డేల్లో శ్రీలంక అత్యల్ప స్కోరును నమోదు చేసింది.
శ్రీలంక దాని రెండవ అత్యల్ప స్కోరును నమోదు చేసింది. ODI క్రికెట్‌లో 10వ అత్యల్ప స్కోరు.
వన్డే క్రికెట్‌లో భారత్ తన అతిపెద్ద విజయాన్ని (బంతులు మిగిలి ఉన్న పరంగా) నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో మరో 263 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది.
6.1 ఓవర్లలో భారత్ చేసిన పరుగుల వేట వన్డే ఇంటర్నేషనల్స్‌లో ఐదో వేగవంతమైనదిగా నిలిచింది.
శ్రీలంకపై 98వ విజయంతో వన్డేల్లో ఒకే ప్రత్యర్థిపై అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా రికార్డు సృష్టించింది.
ఎంఎస్ ధోని, మహ్మద్ అజారుద్దీన్‌లతో సమానంగా రెండు ODI ఆసియా కప్ టైటిళ్లను గెలుచుకున్న మూడవ భారత కెప్టెన్‌గా రోహిత్ శర్మ నిలిచాడు.
మొదట బ్యాటింగ్ చేసి ఆలౌట్ అయినప్పుడు (15.2 ఓవర్లు) ODIలో శ్రీలంక రెండో అత్యల్ప ఓవర్లను ఎదుర్కొంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..