Asia Cup 2022: క్రికెట్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. సోమవారం నుంచి భారత్‌, పాక్‌ మ్యాచ్‌ టికెట్లు.. ఎలా బుక్‌ చేసుకోవాలంటే?

|

Aug 14, 2022 | 3:04 PM

IND vs PAK Asia Cup 2022: భారత్‌ ఫ్యాన్స్‌తో పాటు యావత్‌ క్రికెట్ అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తోన్న భారత్‌- పాకిస్తాన్‌ మ్యాచ్‌కు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. ఆగస్టు 28న దుబాయ్‌లో దాయాది జట్లు హోరాహోరీగా తలపడనున్నాయి.

Asia Cup 2022: క్రికెట్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. సోమవారం నుంచి భారత్‌, పాక్‌ మ్యాచ్‌ టికెట్లు.. ఎలా బుక్‌ చేసుకోవాలంటే?
Asia Cup 2023 India Vs Pakistan
Follow us on

IND vs PAK Asia Cup 2022: క్రికెట్‌ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఆసియాకప్‌ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. ఆగస్టు 27న యూఏఈ వేదికగాఈ మెగా క్రికెట్ టోర్నీ ప్రారంభం కానుంది. ఇక భారత్‌ ఫ్యాన్స్‌తో పాటు యావత్‌ క్రికెట్ అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తోన్న భారత్‌- పాకిస్తాన్‌ మ్యాచ్‌కు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. ఆగస్టు 28న దుబాయ్‌లో దాయాది జట్లు హోరాహోరీగా తలపడనున్నాయి. కాగా ఈ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్స్ సోమవారం (ఆగస్టు 15) నుంచి అందుబాటులో ఉండనున్నాయి. ఈ మేరకు ‘ఆసియా కప్‌ టికెట్ల విక్రయాలు ఆగస్టు 15 నుంచి ప్రారంభంకానున్నాయి’ అని ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఆదివారం తెలిపింది. మ్యాచ్‌ టిక్కెట్లను సోమవారం platinumlist లో బుక్‌ చేసుకోవచ్చు అని అందులో పేర్కొంది.

కాగా ఆసియాకప్‌ టోర్నీ మొదటి మ్యాచ్‌లో ఆఫ్గానిస్తాన్‌-శ్రీలంక తలపడనున్నాయి. మొత్తం ఆరు జట్లు తమ అదృష్టం పరీక్షించుకోనున్నాయి. ఇప్పటికే భారత్‌,పాకిస్తాన్‌, శ్రీలంక, ఆఫ్గానిస్తాన్‌, బంగ్లాదేశ్‌ ఈ టోర్నీకి అర్హత సాధించగా.. మరో స్థానం కోసం క్వాలిఫియంగ్‌ రౌండ్‌లో యూఏఈ, కువైట్, సింగపూర్, హాంకాంగ్ తలపడనున్నాయి. ఇక ఈ టోర్నీ కోసం పూర్తిస్థాయి జట్టుతో బరిలోకి దిగనుంది భారత్‌. కొద్ది రోజులుగా జట్టుకు దూరంగా ఉన్న విరాట్ కోహ్లీ, కేఎల్‌ రాహుల్‌ పునరాగమనం చేశారు. కెప్టెన్‌ రోహిత్ శర్మ జట్టును ముందుండి నడిపించనున్నాడు. అయితే స్టార్‌ బౌలర్ జస్‌ప్రీత్‌ బుమ్రా దూరం కావడం కాస్త లోటేనని భావించవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి