IND vs PAK: పాక్‌తో పోరాటానికి సిద్ధమైన భారత్.. భారీ షాట్లతో దంచికొట్టిన విరాట్, రోహిత్.. వైరల్ వీడియో..

|

Aug 26, 2022 | 8:27 AM

Asia Cup 2022: ఆగస్టు 28న ఆసియా కప్‌లో భారత్‌-పాక్‌ల మధ్య బ్లాక్‌బస్టర్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం టీమిండియా తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తోంది.

IND vs PAK: పాక్‌తో పోరాటానికి సిద్ధమైన భారత్.. భారీ షాట్లతో దంచికొట్టిన విరాట్, రోహిత్.. వైరల్ వీడియో..
Asia Cup 2022 India Vs Pakistan Virat Rohit
Follow us on

IND vs PAK Asia Cup 2022: ఆసియా కప్‌ 2022 రేపటి నుంచి ప్రారంభంకానుంది. ఆ తర్వాత ఆగస్టు 28న భారత్-పాకిస్థాన్ మధ్య జరిగే మ్యాచ్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్ కోసం భారత జట్టు కూడా తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తోంది. ఈ మ్యాచ్ కోసం భారత జట్టు తీవ్రంగా చెమడోడుస్తోంది. గురువారం భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ నెట్స్‌లో చాలా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించారు. రోహిత్, కోహ్లీ తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) షేర్ చేసింది. ప్రాక్టీస్‌లో ఇద్దరు ఆటగాళ్లు భారీ షాట్లు కొట్టడమే కాకుండా కొన్ని అద్భుతమైన డ్రైవ్‌లు ఆడారు. ‘పాకిస్థాన్‌తో జరిగే తొలి పోరు నుంచే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తమ సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు’ అంటూ బీసీసీఐ ఈ వీడియో క్యాప్షన్‌లో రాసుకొచ్చింది.

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు ఆసియా కప్‌లో పరుగులు సాధిస్తారని భారత అభిమానులు ఆశిస్తున్నారు. జింబాబ్వే పర్యటనలో ఇద్దరు ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చారు. విండీస్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లో కూడా కోహ్లీ భాగం కాలేదు. ఇటువంటి పరిస్థితిలో విరామం తర్వాత ఆసియా కప్‌నకు ముందు తమను మానసికంగా తాజాగా ఉంచుకోవడానికి ఇద్దరు ఆటగాళ్లు తీవ్రంగా కష్టపడుతున్నారు.

ఇవి కూడా చదవండి

రోహిత్ శర్మ గురించి మాట్లాడితే, పాకిస్తాన్‌తో జరిగిన T20 ఇంటర్నేషనల్స్‌లో అతని ప్రదర్శన చాలా పేలవంగా ఉంది. అతను ఎనిమిది మ్యాచ్‌లలో ఏడు ఇన్నింగ్స్‌లలో 70 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఈ సమయంలో అతని సగటు 14గా ఉంది. పాకిస్థాన్‌తో జరిగిన టీ20 ఇంటర్నేషనల్‌లో రోహిత్ శర్మ అత్యుత్తమ స్కోరు 30 నాటౌట్‌గా నిలిచింది. స్ట్రైక్ రేట్ 127.27గా ఉంది. టీ20లో పాకిస్థాన్‌పై రెండుసార్లు సున్నా వద్దే ఔటయ్యాడు. ఇప్పుడు ఈ రికార్డును మెరుగుపరుచుకునే గొప్ప అవకాశం రోహిత్‌కి ఉంది.

పాక్‌పై విరాట్ కోహ్లీ ఆటతీరు అద్భుతం..

పాకిస్థాన్‌పై విరాట్ కోహ్లీ రికార్డు చాలా బాగుంది. ఇలాంటి పరిస్థితుల్లో అతడి నుంచి పాక్ జట్టుపై భారీ ఇన్నింగ్స్‌ను ఆశిస్తున్నారు. 2016, 2021 టీ20 ప్రపంచకప్‌లలో కోహ్లీ హాఫ్ సెంచరీలు ఆడాడు. విరాట్ కోహ్లీ వన్డే క్రికెట్‌లో అత్యుత్తమ స్కోరు 183గా నిలిచింది. అతను ఆసియా కప్‌లోనే పాకిస్థాన్‌పై అత్యధిక స్కోర్ నమోదు చేశాడు.

విరాట్ కోహ్లీ చాలా కాలంగా సెంచరీ చేయలేకపోయాడు. కానీ, అంతర్జాతీయ క్రికెట్‌లో అతని రికార్డు చాలా అద్భుతంగా ఉంది. అంతర్జాతీయ సెంచరీల జాబితాలో విరాట్ కోహ్లీ ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్నాడు. ఈ విషయంలో అతను రికీ పాంటింగ్ కంటే కేవలం ఒక సెంచరీ వెనుకంలో నిలిచి, రెండవ స్థానంలో ఉన్నాడు.