IND vs PAK: భారత్ వర్సెస్ పాకిస్తాన్ పోరు కాదు.. అది ఓ సాధారణ మ్యాచ్ అంతే.. బీసీసీఐ చీఫ్ కీలక వ్యాఖ్యలు..

|

Aug 17, 2022 | 12:30 PM

ఆసియా కప్‌లో ఆగస్టు 28న భారత్, పాకిస్థాన్ మధ్య కీలక పోరు జరగనుంది. గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్ తర్వాత ఇరు జట్లు తొలిసారి తలపడుతున్నాయి.

IND vs PAK: భారత్ వర్సెస్ పాకిస్తాన్ పోరు కాదు.. అది ఓ సాధారణ మ్యాచ్ అంతే.. బీసీసీఐ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
Asia Cup 2023 India Vs Pakistan
Follow us on

ఆసియా కప్ 2022 కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ప్రపంచం మొత్తం చూపు భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ పైనే ఉంది. ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఎంత ఆత్రుతగా ఎదురుచూస్తున్నారంటే.. కేవలం 3 గంటల్లోనే ఈ మ్యాచ్ టిక్కెట్లు అమ్ముడుపోయాయంటేనే ఈమ్యాచ్ పరిస్థితి ఏంటో తెలుసుకోవచ్చు. వీరిద్దరి మధ్య ఆగస్టు 28న హై వోల్టేజ్ మ్యాచ్ జరుగుతుందని, ఈ బిగ్ మ్యాచ్‌కు ముందు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కీలక కామెంట్స్ చేశారు.

మిగతా మ్యాచ్‌ల మాదిరిగానే భారత్ vs పాకిస్థాన్ పోరు..

గతేడాది టీ20 ప్రపంచకప్‌లో 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయం పాలైన తర్వాత భారత జట్టు తొలిసారి పాకిస్థాన్‌పై మైదానంలోకి దిగనుంది. ప్రపంచకప్ చరిత్రలో తొలిసారిగా పాకిస్థాన్ చేతిలో భారత్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఇండియా టుడే ప్రకారం, మిగతా మ్యాచ్‌ల మాదిరిగానే భారత్, పాకిస్తాన్‌లు ఒకేలా ఉన్నాయని గంగూలీ పేర్కొన్నాడు. ఆసియా కప్‌ను గెలుపొందడంపైనే అందరి దృష్టి నెలకొంది. నేను ఈ పోటీని ఆసియా కప్‌గా చూస్తున్నాను అని గంగూలీ అన్నాడు. నేను ఏ టోర్నీని ఇండియా వర్సెస్ పాకిస్థాన్‌గా చూడను. నేను ఆడే రోజుల్లో కూడా ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ నాకు ఇతర మ్యాచ్‌ల మాదిరిగానే ఉండేది. నేను ఎప్పుడూ టోర్నీ గెలుపొందడంపైనే దృష్టి సారిస్తానని గంగూలీ పేర్కొన్నాడు. భారతదేశం గొప్ప జట్టు. ఇటీవలి కాలంలో మంచి ప్రదర్శన కనబరిచింది. ఆసియా కప్‌లో కూడా అలానే రాణిస్తుందని భావిస్తున్నానంటూ తెలిపారు.

ఇవి కూడా చదవండి

2014లో చివరి ఓటమి..

భారత్ ఆసియా కప్‌లో 7 సార్లు ఛాంపియన్‌గా నిలిచింది. ఆసియా కప్‌లో మొత్తం 14 సార్లు పాకిస్థాన్‌తో తలపడింది. ఇందులో భారత్ 8 మ్యాచ్‌లు గెలిచి 5 ఓడిపోయింది. 2014లో మిర్పూర్‌లో జరిగిన ఆసియా కప్‌లో పాకిస్థాన్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో భారత్ ఓడిపోయింది. సౌరవ్ గంగూలీ కూడా విరాట్ కోహ్లీ పేలవమైన ఫామ్ గురించి కూడా కీలకంగా మాట్లాడారు. ఆసియాకప్‌లో కోల్పోయిన ఫాంను కోహ్లీ తిరిగి పుంజుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేశారు. కోహ్లిని ప్రాక్టీస్ చేయనివ్వండి, మ్యాచ్ ఆడనివ్వండి అంటూ బీసీసీఐ ప్రెసిడెంట్ ట్వీట్ చేశాడు. కోహ్లీ పెద్ద ఆటగాడు, అతను తిరిగి తన పాత ఫాంకి వస్తాడని ఆశిస్తున్నాడు. విరాట్ కోహ్లి నాయకత్వంలో గత ఏడాది పాకిస్థాన్‌పై భారత్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. అయితే ఈసారి జట్టు కొత్త శైలిలో కనిపించనుంది. ప్రస్తుతం రాహుల్ ద్రవిడ్ కోచ్‌లో, రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా బరిలోకి దిగనుంది.