Asia Cup 2022: ఆసియా దేశాల క్రికెట్ పోరుకు రంగం సిద్ధం.. పూర్తి షెడ్యూల్‌ ఇదే

| Edited By: Ravi Kiran

Aug 26, 2022 | 6:42 AM

Asia Cup 2022 Schedule: ఆసియా దేశాల క్రికెట్ పోరుకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. శనివారం (ఆగస్టు 27) నుంచి ఈ మెగా టీ20 టోర్నీ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో శ్రీలంక, ఆఫ్ఘనిస్థాన్ జట్లు తలపడనున్నాయి.

Asia Cup 2022: ఆసియా దేశాల క్రికెట్ పోరుకు రంగం సిద్ధం.. పూర్తి షెడ్యూల్‌ ఇదే
Asia Cup 2022
Follow us on

Asia Cup 2022 Schedule: ఆసియా దేశాల క్రికెట్ పోరుకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. శనివారం (ఆగస్టు 27) నుంచి ఈ మెగా టీ20 టోర్నీ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో శ్రీలంక, ఆఫ్ఘనిస్థాన్ జట్లు తలపడనున్నాయి. వాస్తవానికి ఈసారి ఆసియా కప్ శ్రీలంకలో జరగాల్సి ఉంది. అయితే లంకలో నెలకొన్న రాజకీయ సంక్షోభం కారణంగా టోర్నీని యూఏఈకి మార్చారు. అందుకే ఆతిథ్య దేశంగా శ్రీలంక ఓపెనింగ్ మ్యాచ్ ఆడుతోంది. ఆగస్టు 28న పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌తో భారత జట్టు ఆసియా కప్ పోరాటాన్ని ప్రారంభించనుంది. ఇక ఈసారి టోర్నీలో మొత్తం 6 జట్లు పాల్గొంటున్నాయి. వీటిని రెండు గ్రూపులుగా విభజించారు. మొదటి రౌండ్‌లో గ్రూప్ మ్యాచ్‌లు జరుగుతాయి. దీని తర్వాత సూపర్-4 మ్యాచ్‌లు జరగనున్నాయి. గ్రూప్ దశలో 6 మ్యాచ్‌లు జరగనుండగా, సూపర్-4 దశలో ఫైనల్‌తో సహా 7 మ్యాచ్‌లు జరగనున్నాయి. అంటే ఈ ఆసియాకప్‌లో మొత్తం 13 మ్యాచ్‌లు జరగనున్నాయి.

ఆసియా కప్ గ్రూప్ ఆఫ్ టీమ్స్:

ఇవి కూడా చదవండి
  • గ్రూప్ A జట్లు- భారత్, పాకిస్థాన్, హాంకాంగ్
  • గ్రూప్ బి జట్లు- శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్

పూర్తి షెడ్యూల్ ఇలా ఉంది..

  • ఆగస్టు 27 – శ్రీలంక vs ఆఫ్ఘనిస్తాన్ – దుబాయ్
  • ఆగష్టు 28 – భారతదేశం vs పాకిస్తాన్ – దుబాయ్
  • ఆగష్టు 31 – భారతదేశం vs హాంకాంగ్- దుబాయ్
  • సెప్టెంబర్ 1 – శ్రీలంక vs బంగ్లాదేశ్ – దుబాయ్
  • సెప్టెంబర్ 2 – పాకిస్తాన్ vs హాంకాంగ్ – షార్జా

గ్రూప్ దశ నుంచి నాలుగు జట్లు సూపర్-4కు అర్హత సాధిస్తాయి. సెప్టెంబర్ 3 నుంచి సూపర్-4 మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి.

  • సెప్టెంబర్ 3 – B1 vs B2- షార్జా
  • సెప్టెంబర్ 4 – A1 vs A2- దుబాయ్
  • సెప్టెంబర్ 6 – A1 vs B1- దుబాయ్
  • సెప్టెంబర్ 7 – A2 vs B2- దుబాయ్
  • సెప్టెంబర్ 8 – A1 vs B2- దుబాయ్
  • సెప్టెంబర్ 9 – B1 vs- A2- దుబాయ్
  • సెప్టెంబర్ 11 – ఫైనల్ మ్యాచ్ – దుబాయ్

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..