R Ashwin: అశ్విన్ ఖాతాలో 3 రికార్డులు.. టీమిండియా దిగ్గజాన్ని అధిగమించి మొదటి స్థానంలోకి..

|

Mar 10, 2023 | 8:10 PM

భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు రెండో రోజు నాథన్ లియాన్‌ వికెట్‌ను పడగొట్టడం ద్వారా అశ్విన్..

R Ashwin: అశ్విన్ ఖాతాలో 3 రికార్డులు.. టీమిండియా దిగ్గజాన్ని అధిగమించి మొదటి స్థానంలోకి..
R Ashwin
Follow us on

బ్యాటర్లకు తప్ప బౌలర్లకు ఏ మాత్రం సహకరించని పిచ్‌పై కూడా టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 6 వికెట్లు తీసి కంగారుల ఇన్నింగ్స్‌ను కూల్చాడు. అయితే భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు రెండో రోజు నాథన్ లియాన్‌ వికెట్‌ను పడగొట్టడం ద్వారా అశ్విన్ మరో ఘనతను సాధించాడు. బోర్డ‌ర్ గ‌వాస్కర్ ట్రోఫీలో భారత్ తరఫున అత్యధిక వికెట్లు పడగొట్టిన ఆటగాడిగా ఉన్న అనిల్ కుంబ్లే(111)ను అధిగమించి అశ్విన్(113) టాప్ స్థానంలో చేరాడు. అయితే ఈ ఫీట్ కోసం అశ్విన్ 41 ఇన్నింగ్స్ తీసుకోగా.. కుంబ్లే 38 ఇన్నింగ్స్‌లోనే సాధించాడు.

అంతేకాక ఈ మ్యాచ్‌లో 6 వికెట్లు పడగొట్టిన అశ్విన్.. స్వ‌దేశంలో అత్య‌ధికంగా 26 సార్లు ఐదు వికెట్ల ప్ర‌ద‌ర్శ‌న చేసిన బౌల‌ర్‌గా కూడా చ‌రిత్రలో నిలిచాడు. ఈ ఘనత కోసం కూడా అనిల్ కుంబ్లే(25 సార్లు)పేరిట ఉన్న రికార్డునే బద్దలుకొట్టడం గమనార్హం. ఇక్కడ మరో విశేషమేమిటంటే.. కుంబ్లే 122 టెస్టుల్లో ఈ ఫీట్ సాధిస్తే, 92 టెస్టుల్లోనే అశ్విన్ ఆ రికార్డు బ్రేక్ చేయ‌డం విశేషం. అయితే రవిచంద్రన్ అశ్విన్‌కి టెస్టుల్లో ఇది 32వ ఐదు వికెట్ల ప్రదర్శన. అనిల్ కుంబ్లే 35 సార్లు ఈ ఫీట్ సాధించి  అశ్విన్ కంటే ముందున్నాడు.

మరోవైపు బోర్డ‌ర్ – గ‌వాస్కర్ ట్రోఫీలో ఇప్పటివరకు అత్య‌ధిక వికెట్లు తీసిన బౌల‌ర్‌గా కూడా అశ్విన్(1130 నిలిచాడు. అయితే అతనితో పాటు ఆసీస్‌ స్నిన్నర్ నాథ‌న్ లియాన్‌తో కూడా 113 వికెట్లతోనే అగ్ర‌స్థానంలో కొన‌సాగుతున్నాడు. అంటే బోర్డ‌ర్–గ‌వాస్కర్ ట్రోఫీలో ప్ర‌స్తుతం అశ్విన్, లియాన్ ఖాతాలో 113 వికెట్లు ఉన్నాయి. ఇక్కడ కూడా అశ్విన్‌దే పైచేయి. ఎలా అంటే ఈ 113 వికెట్లను నాథన్ లియాన్ 47 ఇన్నింగ్స్‌లో పడగొట్టగా.. అశ్విన్ 41 ఇన్నింగ్స్‌లలోనే తీశాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..