Watch Video: ఆస్ట్రేలియా అమ్మాయి.. ఇంగ్లండ్ అబ్బాయి.. గబ్బా టెస్టులో ప్రపోజల్.. నెజిటన్లను ఫిదా చేస్తోన్న వీడియో..!

|

Dec 10, 2021 | 12:01 PM

Ashes Series 2021-22: గబ్బా వేదికగా ఇంగ్లండ్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న తొలి యాషెస్ టెస్టులో ఓ ఆసక్తికర ఘటన కెమెరాకు చిక్కింది.

Watch Video: ఆస్ట్రేలియా అమ్మాయి.. ఇంగ్లండ్ అబ్బాయి.. గబ్బా టెస్టులో ప్రపోజల్.. నెజిటన్లను ఫిదా చేస్తోన్న వీడియో..!
Proposal Viral Video
Follow us on

Ashes Series 2021-22: గబ్బా వేదికగా ఇంగ్లండ్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న తొలి యాషెస్ టెస్టులో ఓ ఆసక్తికర ఘటన కెమెరాకు చిక్కింది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో ఒక యువ ఇంగ్లాండ్ క్రికెట్ అభిమాని మైదానం వెలుపల అందరి హృదయాలను గెలుచుకున్నాడు. సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలో, ఆ అబ్బాయి ఆస్ట్రేలియాకు చెందిన తన స్నేహితురాలికి మ్యాచ్ సందర్భంగా ప్రపోజ్ చేశాడు. దానికి అమ్మాయి ఓకే చెప్పడంతో అంతా శుభాకాంక్షలు తెలిపారు.

ఆ ప్రపోజల్‌ను యాక్సెప్ట్ చేసిన అమ్మాయి తన ప్రియుడిని కౌగిలించుకుంది. ఆ తర్వాత ఉంగరాలు మార్చుకున్నారు. ఆ సమయంలో అక్కడున్న ప్రేక్షకులు చప్పట్లు కొట్టి ఇద్దరినీ అభినందించారు. అమ్మాయి పేరు నటాలీ, అబ్బాయి పేరు రాబ్ అని పేర్కొన్నారు.

ఈ స్పెషల్ ప్రతిపాదనను గ్రౌండ్‌లోని పెద్ద స్క్రీన్‌పై ప్రత్యక్షంగా చూపించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. సోషల్ మీడియా యూజర్లు కూడా రకరకాల రియాక్షన్స్ ఇస్తున్నారు. మ్యాచ్‌ సమయంలో ఓ మంచి ముహూర్తం ఉందంటూ ఓ యూజర్ కామెంట్ చేశాడు.

మ్యాచ్‌లో ఆస్ట్రేలియా పట్టు..
యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మధ్య బ్రిస్బేన్ వేదికగా తొలి మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో మూడో రోజైన శుక్రవారం ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ 425 పరుగులకు ముగిసింది. ట్రావిస్ హెడ్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ 148 బంతుల్లో 152 పరుగులు చేశాడు. అదే సమయంలో రెండో ఇన్నింగ్స్‌లోనూ ఇంగ్లండ్‌కు 23 పరుగులకే తొలి దెబ్బ తగిలింది. తొలి ఇన్నింగ్స్‌లో ఖాతా కూడా తెరవలేకపోయిన రోరీ బర్న్స్ రెండో ఇన్నింగ్స్‌లో 13 పరుగులకే ఔటయ్యాడు. ఆ తరువాత హబీద హమీద్ 27 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం 2 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ 159 పరుగులు సాధించింది. ఇంకా 119 పరుగుల వెనుకంజలోనే నిలిచింది.

అంతకుముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 147 పరుగులకు ఆలౌటైంది. మ్యాచ్ రెండో రోజున ట్రావిస్ హెడ్ సెంచరీ సాధించడంతో పాటు డేవిడ్ వార్నర్, మార్నస్ లాబుస్‌చాగ్నే హాఫ్ సెంచరీలు చేయడంతో ఆస్ట్రేలియా మ్యాచ్‌పై పట్టు సాధించింది.

Also Read: U-19 Asia Cup: ఆసియా కప్‌‌లో పాల్గొనే భారత జట్టు ఇదే.. ప్రకటించిన బీసీసీఐ.. ఎనిమిదోసారి టైటిల్‌ గెలిచేందుకు సిద్ధం..!

Sachin Tendulkar: 19 ఏళ్ల నిరీక్షణ ముగించిన లిటిల్ మాస్టర్.. నేటికీ ఈ రికార్డు చెక్కు చెదరలే.. అదేంటంటే?